...
...
Next Story

సినిమా ఇండస్ట్రీకి డబ్బు తప్ప మతం తెలీదు.. ఎఆర్ రెహమాన్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన రామ్ గోపాల్ వర్మ

బాలీవుడ్‌లో మతతత్వం పెరిగిందంటూ ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. పరిశ్రమలో కేవలం డబ్బు మాత్రమే మాట్లాడుతుందని, కులమతాలకు ఇక్కడ చోటు లేదని రెహమాన్ కామెంట్స్‌ను కొట్టిపారేశారు.

Published on: Jan 25, 2026, 07:52:55 IST
Advertisement

భారతీయ చలనచిత్ర సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత ఎనిమిదేళ్లుగా తనకు బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయని, దీనికి హిందీ చిత్ర పరిశ్రమలో పెరుగుతున్న మతతత్వం (Communalism) కూడా ఒక కారణం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

సినిమా ఇండస్ట్రీకి డబ్బు తప్ప మతం తెలీదు.. ఎఆర్ రెహమాన్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన రామ్ గోపాల్ వర్మ
సినిమా ఇండస్ట్రీకి డబ్బు తప్ప మతం తెలీదు.. ఎఆర్ రెహమాన్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన రామ్ గోపాల్ వర్మ

ఈ సున్నితమైన అంశంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) దీనిపై స్పందించారు. గతంలో రెహమాన్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న రామ్ గోపాల్ వర్మ.. ఇండస్ట్రీ పనితీరు పక్కా వ్యాపార కోణంలో ఉంటుందని తన విశ్లేషణను వినిపించారు.

డబ్బు ఎక్కడ ఉంటే ఇండస్ట్రీ అక్కడ ఉంటుంది!

ఫరీదూన్ షహర్యార్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ వృత్తిపరమైన అవకాశాలను మతపరమైన కోణంలో చూడటాన్ని పూర్తిగా కొట్టిపారేశారు. "సినిమా పరిశ్రమ అంటేనే డబ్బు సంపాదించడం. ఎవరి వల్ల డబ్బు వస్తుందో వారి వెంటే అందరూ వెళ్తారు. వారికి కులం, మతం లేదా మీరు ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలతో అస్సలు సంబంధం ఉండదు" అని ఆర్జీవీ పేర్కొన్నారు.

బాక్సాఫీస్ వద్ద విజయాలు అందించే వారికే ఇక్కడ పెద్దపీట వేస్తారని రెహమాన్ వ్యాఖ్యలను రామ్ గోపాల్ వర్మ కొట్టిపారేశారు. తన వాదనకు మద్దతుగా లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ఆర్జీవీ ఉదాహరణగా తీసుకున్నారు.

"ఎస్పీ బాలు గారు హిందీలో 'మైనే ప్యార్ కియా', 'హుమ్ ఆప్కే హై కౌన్' వంటి చిత్రాలకు పాటలు పాడారు. ఆ పాటలు జనానికి నచ్చాయి, డబ్బులు తెచ్చిపెట్టాయి కాబట్టే ఆయనను ఎంచుకున్నారు తప్ప మరో కారణం లేదు" అని రామ్ గోపాల్ వర్మ వివరించారు.

రెహమాన్ వ్యక్తిగత అనుభవం కావొచ్చు..

కాగా, బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో గత ఎనిమిదేళ్లుగా అధికార మార్పిడి జరిగిందని, సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లోకి పవర్ వెళ్లిందని విమర్శించారు.

ఇదే క్రమంలో మతపరమైన వివక్ష కూడా ఒక కారణం కావొచ్చని, అయితే అది నేరుగా తన ముందు కనిపించకపోయినా వెనుక జరుగుతుండవచ్చని రెహమాన్ అనుమానం వ్యక్తం చేశారు. అలాగే 'ఛావా' (Chhaava) వంటి చిత్రాలు విభజన రాజకీయాలను సొమ్ము చేసుకుంటున్నాయని ఆయన విమర్శించడం గమనార్హం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe