...
...
Next Story

OTT Review: రామ్మూరి మాస్టారు రివ్యూ- ఈరోజు ఓటీటీలోకి వచ్చిన తనికెళ్ల భరణి, సుహాసిని ఎమోషనల్ డ్రామా మూవీ ఎలా ఉందంటే?

Ramamurthy Master OTT Review In Telugu: డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు సమర్పించిన సినిమా రామ్మూర్తి మాస్టారు ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. తనికెళ్ల భరణి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను గురువు గొప్పదనంపై తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి రామ్మూర్తి మాస్టారు ఓటీటీ రివ్యూలో చూద్దాం.

Published on: Oct 25, 2026, 09:14:16 IST
Advertisement

Ramamurthy Master OTT Review In Telugu: విద్యాబోధనను కేవలం వృత్తిగా కాకుండా ఒక పవిత్ర యజ్ఞంగా భావించే ఉపాధ్యాయుడి ఆదర్శ జీవితానికి నిలువెత్తు ప్రతిరూప చిత్రం 'రామ్మూర్తి మాస్టారు'.

రామ్మూర్తి మాస్టారు ఓటీటీ రివ్యూ

రామ్మూరి మాస్టారు రివ్యూ- ఈరోజు ఓటీటీలోకి వచ్చిన తనికెళ్ల భరణి, సుహాసిని ఎమోషనల్ డ్రామా మూవీ ఎలా ఉందంటే?
రామ్మూరి మాస్టారు రివ్యూ- ఈరోజు ఓటీటీలోకి వచ్చిన తనికెళ్ల భరణి, సుహాసిని ఎమోషనల్ డ్రామా మూవీ ఎలా ఉందంటే?

నేటి వ్యాపారమయమైన చదువుల ప్రపంచంలో అక్షరాన్ని అమ్మకానికి పెట్టకుండా, విద్యార్థుల పురోగతే తన నిజమైన ఆస్తిగా నమ్మిన ఒక సమ్మోహన మాస్టారి కథతో ఓటీటీలోకి ఈరోజు (అక్టోబర్ 25) వచ్చిన తెలుగు ఎమోషనల్ డ్రామా సినిమానే రామ్మూర్తి మాస్టారు. సీనియర్ నటుడు తనికెళ్ల భరణి, సీనియర్ హీరోయిన్ సుహాసిని జంటగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి రామ్మూర్తి మాస్టారు ఓటీటీ రివ్యూలో తెలుసుకుందాం.

అక్షర క్రమశిక్షణ.. అపారమైన అనురాగం

ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేసే రామ్మూర్తి (తనికెళ్ల భరణి) నిజాయితీకి, విలువలకు కట్టుబడిన వ్యక్తి. సొంత పిల్లలు లేకపోయినా, బడికి వచ్చే పిల్లలనే తన బిడ్డలుగా భావిస్తాడు. తన పరిమిత నెల జీతం నుంచే పేద విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు కొనడం, తన క్యారేజ్ భోజనాన్ని ఆకలితో ఉన్న పసివాళ్లకు తినిపించడం ఆయన నిత్యం చేసే పని.

అయితే, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే ఆయన భార్య జానకి (సుహాసిని మణిరత్నం)కి ఈ దాతృత్వం కొంత నచ్చదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాస్త డబ్బు సంపాదించడానికి ప్రైవేట్ ట్యూషన్లు చెప్పమని ఆమె ఎంత బతిమాలినా, చదువును అమ్ముకోనని రామ్మూర్తి కచ్చితంగా తిరస్కరిస్తాడు. ఇది వారి దాంపత్యంలో చిన్నపాటి అసంతృప్తికి, నిశ్శబ్ద పోరాటానికి దారితీస్తుంది.

రిటైర్మెంట్ రోజున ఊహించని మలుపు

రామమూర్తి ఉద్యోగ విరమణ రోజున వారి పాత బజాజ్ చేతక్ స్కూటర్‌పై దంపతులిద్దరూ బడికి చేరుకుంటారు. శిథిలావస్థలో ఉన్న ఒక చిన్న తరగతి గదిలో వేచి ఉండాలని చెప్పడంతో జానకి కొంత అశాంతికి గురవుతుంది. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఆమె ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చివేస్తాయి.

రామ్మూర్తి మాస్టారు చేసిన నిస్వార్థ సేవలను స్మరించుకుంటూ వందలాది మంది పూర్వ విద్యార్థులు ఆ బడి ప్రాంగణానికి తరలివస్తారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన డాక్టర్లు, ఇంజనీర్లు, సివిల్ అధికారులు, పోలీసులు ఆయనకు సన్మానం చేయడానికి కార్ల కాన్వాయ్‌లో వరుసగా వచ్చి నిలబడతారు.

అసలైన ఆస్తిని గుర్తించిన భార్య

మాస్టారి పాత్రలో తనికెళ్ల భరణి తన సహజ నటనతో ప్రాణం పోయగా, భార్యగా సుహాసిని పాత్రలోని అంతర్మథనాన్ని అద్భుతంగా పండించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు బి.ఎ. నిర్మాతగా వ్యవహరించారు.

సాయి మధుకర్ అందించిన నేపథ్య సంగీతం, సింహాచలం అల్యాన ఛాయాగ్రహణం, వెంకట్ కూర్పు కథలోని భావోద్వేగాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. గురువు ప్రాధాన్యాన్ని చాటిచెప్పే ఈ చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది. ఈ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పించడం విశేషం.

రామ్మూర్తి మాస్టారు ఓటీటీ స్ట్రీమింగ్

గురువు గొప్పదనం చెప్పే రామ్మూర్తి మాస్టారు ఓటీటీలోకి నేడే వచ్చేసింది. ఈటీవీ విన్‌లో రామ్మూర్తి మాస్టారు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతివారం సరికొత్త సినిమాతో అలరింటే ఈటీవీ విన్ కథా సుధాలో భాగంగా ఈరోజు రామ్మూర్తి మాస్టారు ఓటీటీ రిలీజ్ అయింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks