Ramayana 14 Days Worldwide Collection: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'రామాయణం' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ సాయి పల్లవి సీతగా, 'కేజీఎఫ్' స్టార్ యశ్ రావణుడిగా నటించిన ఈ చిత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది.
840 కోట్ల కలెక్షన్స్

రెండో వారంలో రోజువారీ వసూళ్లు కాస్త నెమ్మదించినా, తాజాగా రామాయణం సినిమా మరో భారీ మైలురాయిని దాటింది. దేశవ్యాప్తంగా రూ.840 కోట్ల మార్కును అధిగమించి గతంలో సంచలనం సృష్టించిన 'ధురంధర్' సినిమా లైఫ్‌టైమ్ నెట్ కలెక్షన్లను వెనక్కి నెట్టింది.
14వ రోజు వసూళ్ల లెక్కలివే..
ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకింగ్ సంస్థ నివేదిక ప్రకారం, 'రామాయణం' విడుదలైన 14వ రోజు దేశవ్యాప్తంగా రూ.23.20 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దీపావళి సెలవుల తర్వాత సాధారణ పనిదినాల్లోనూ ఈ స్థాయి కలెక్షన్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
దేశవ్యాప్తంగా 21,215 షోల ద్వారా ఈ వసూళ్లు నమోదయ్యాయి. దీంతో రెండు వారాలు పూర్తయ్యేసరికి భారత్‌లో రామాయణం సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ.844.40 కోట్లకు, గ్రాస్ కలెక్షన్స్ రూ. 1000 కోట్లకు చేరాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ సాయి పల్లవి, యశ్ క్రేజ్ తోడవడంతో మల్టీప్లెక్సులతో పాటు సింగిల్ స్క్రీన్లలోనూ కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.
మరోవైపు, మార్చి 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన రణ్‌వీర్ సింగ్ చిత్రం 'ధురంధర్: ది రివేంజ్' 14వ రోజు రూ.20.10 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమా తొలి రెండు వారాల్లో భారత్‌లో రూ.919.52 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. రెండో వారం బుధవారం (నవంబర్ 18) వసూళ్ల విషయంలో 'రామాయణం' ఆ చిత్రాన్ని సైతం దాటేయడం విశేషం.
హాలీవుడ్ స్థాయి విజువల్ వండర్: నమిత్ మల్హోత్రా
ఇక రామాయణం సినిమాకు వరల్డ్ వైడ్‌గా 14 రోజుల్లో రూ. 1519.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే, ఓవర్సీస్లో 510 కోట్లు కొల్లగొట్టింది రామాయణం సినిమా.
{{/usCountry}}ఇక రామాయణం సినిమాకు వరల్డ్ వైడ్‌గా 14 రోజుల్లో రూ. 1519.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే, ఓవర్సీస్లో 510 కోట్లు కొల్లగొట్టింది రామాయణం సినిమా.
{{/usCountry}}ఇప్పటికే ఎన్నో రామాయణాలు వచ్చాయి కదా, మళ్లీ ఈ కథను ఎందుకు తెరకెక్కిస్తున్నారన్న ప్రశ్నలకు చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ఇటీవల పీటీఐ (PTI) వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
"భారత్‌లో చాలామందికి ఈ కథ తెలుసు. కానీ ఇంతకుముందు ఏ టీవీ సీరియల్, వీధి నాటకం లేదా రామ్ లీలా చూపించని అద్భుతమైన స్థాయిలో, కనీవినీ ఎరుగని దృశ్యకావ్యంగా రామాయణాన్ని చూపించాలన్నదే మా ఆశయం. అవతార్, అవెంజర్స్, స్పైడర్ మ్యాన్ లేదా ది ఒడిస్సీ తరహాలో ప్రపంచ స్థాయి విజువల్ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దాం" అని నమిత్ మల్హోత్రా పేర్కొన్నారు.
భారీ విజువల్ సినిమాలను ఆదరిస్తారు
భారతీయ సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న తమ లక్ష్యం గురించి ఆయన మరింత లోతుగా వివరించారు. "పాశ్చాత్య ప్రేక్షకులు భారీ విజువల్ సినిమాలను ఎంతో ఆదరిస్తారు. మన దగ్గర 'బాహుబలి', 'ధురంధర్' వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే హాలీవుడ్ ఊహించే భారీ విజువల్ హంగులకు, మన సినిమాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే ప్రయత్నం మేము చేస్తున్నాం" అని నమిత్ మల్హోత్రా అన్నారు.
"హాలీవుడ్ చేయగలిగినది మేమూ చేయగలమని, అంతకంటే గొప్పగా నిర్మించగలమని ప్రపంచానికి చాటిచెప్పాలన్నదే మా ఉద్దేశం" అని నమిత్ చెప్పుకొచ్చారు. రాజమౌళి 'బాహుబలి' తర్వాత భారతీయ ఇతిహాసాలకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆదరణను 'రామాయణం' మరింత ముందుకు తీసుకెళ్తోంది.