...
...
Next Story

Ramayana Collection: 2 రోజుల్లో రామాయణం మూవీకి 113 కోట్లు- ఇప్పటికీ దాటని ప్రభాస్ ఆదిపురుష్ కలెక్షన్స్- ఎందుకంటే?

Ramayana Box Office Collection Day 2: నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన బిగ్ బడ్జెట్ మూవీ 'రామాయణం' తొలి రెండు రోజుల్లోనే రూ.113 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రీ-దివాలి బాక్సాఫీస్ రేసులో సరికొత్త రికార్డు సృష్టించింది.

Published on: Nov 7, 2026, 06:19:55 IST
Advertisement

Ramayana 2 Days Worldwide Box Office Collection: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన దృశ్య కావ్య చిత్రం 'రామాయణం'. మొదటి రోజు అంచనాలకు తగ్గట్టే థియేటర్ల వద్ద భారీ హడావుడి కనిపించింది.

కాస్తా తడబడిన

2 రోజుల్లో రామాయణం మూవీకి 113 కోట్లు- ఇప్పటికీ దాటని ప్రభాస్ ఆదిపురుష్ కలెక్షన్స్- ఎందుకంటే?
2 రోజుల్లో రామాయణం మూవీకి 113 కోట్లు- ఇప్పటికీ దాటని ప్రభాస్ ఆదిపురుష్ కలెక్షన్స్- ఎందుకంటే?

దీపావళి పండుగకు కాస్త ముందుగానే నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ రేసులో తన సత్తా చాటుతోంది. అల్ట్రా-మాసివ్ ఓపెనింగ్స్ సాధించడంలో కాస్త తడబడినప్పటికీ, పండగ సీజన్‌కు ముందు విడుదలైన చిత్రాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది.

రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్

తొలి రోజు భారత్‌లో రూ.64.85 కోట్ల నికర (Net) వసూళ్లతో ఖాతా తెరిచిన రామాయణ చిత్రం బాలీవుడ్ చరిత్రలోనే నాలుగో అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇక రెండో రోజు శుక్రవారం (నవంబర్ 6) వర్కింగ్ డే అయినప్పటికీ మంచి రన్ సాధించింది.

రాత్రి 10 గంటల సమయానికి లభించిన ప్రాథమిక లెక్కల ప్రకారం, రెండో రోజు రూ.48.35 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దీంతో రెండు రోజుల్లోనే భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.113.20 కోట్ల నెట్ కలెక్షన్లు దాటేసి వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది రామాయణ పార్ట్ 1 సినిమా. వీకెండ్ ప్రారంభం కావడంతో శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పుంజుకుంటాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

సౌత్ మార్కెట్ పరిస్థితి ఏంటి?

హిందీ బెల్ట్‌లో ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో ఆదరణ లభిస్తోంది. కలెక్షన్లలో ఎక్కువ భాగం ఉత్తరాది నుంచే వస్తున్నాయి. కానీ దక్షిణాది భాషల్లో వసూళ్ల వేగం కాస్త మందగించింది. రావణుడి పాత్రలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించినప్పటికీ, కన్నడ వెర్షన్ మొదటి రోజు కేవలం రూ.7.50 కోట్లు మాత్రమే రాబట్టింది.

తొలి రోజు వసూళ్ల విషయంలో పఠాన్ (రూ.57 కోట్లు), యానిమల్ (రూ.63 కోట్లు), దృశ్యం 2 (రూ.62 కోట్లు) వంటి పెద్ద హిట్ సినిమాల రికార్డులను రామాయణ మూవీ దాటేసింది. అయితే రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' సాధించిన రికార్డు (రూ.102 కోట్లు), ప్రభాస్ 'ఆదిపురుష్' సాధించిన మొదటి రోజు కలెక్షన్ల (రూ.86.75 కోట్లు) కంటే రామాయణం వెనుకబడింది.

రెండు రోజుల కలెక్షన్లు పరిశీలిస్తే ఆదిపురుష్ రూ.151 కోట్లు వసూలు చేయగా, రామాయణ సినిమా రూ.113.20 కోట్లతో నిలిచింది. అంటే, రెండు రోజుల కలెక్షన్స్‌లో కూడా ఆదిపురుష్ కంటే వెనుకంజలోనే రామాయణం ఉందన్నమాట. అయితే ఆదిపురుష్ మొదటి రెండు రోజులు శుక్ర, శనివారాలు కావడం, రామాయణం వర్కింగ్ డేస్ అయిన గురు, శుక్రవారాల్లో విడుదల కావడం ప్రధాన వ్యత్యాసంగా చెప్పవచ్చు.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్

ఇకపోతే రెండో రోజున వరల్డ్ వైడ్‌గా రూ. 93.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దాంతో 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 221.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది రామాయణ సినిమా. ఓవర్సీస్‌లో రూ. 85 కోట్లకుపైగా వసూలు చేసింది.

రెండు భాగాలుగా 'రామాయణం'

నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డిఎన్‌ఇజి (DNEG), యశ్ 'మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్' కలిసి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించాయి. రెండు భాగాలుగా వస్తున్న ఈ పౌరాణిక చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే నటించారు.

మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాగా, రెండో భాగం 2028 దీపావళి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ రావడంతో రాబోయే దీపావళి సెలవుల్లో వసూళ్లు సరికొత్త ఎత్తులకు చేరతాయని చిత్ర బృందం ఆశిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks