Urmila Kanetkar Adinath Kothare Divorce: సినీ పరిశ్రమలో విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మరాఠీ చిత్ర పరిశ్రమలో మోస్ట్ అడ్మైర్డ్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ జంట ఆదినాథ్ కొఠారే, ఊర్మిళ కనిత్కర్ తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు.
జూలై 16న విడాకుల ప్రకటన

గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, విడివిడిగా ఉంటున్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ జూలై 16న వీరు అధికారిక ప్రకటన చేశారు. దాదాపు 15 ఏళ్ల పాటు కలిసి ప్రయాణించిన ఈ జంట.. పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఊర్మిళ కనిత్కర్ కేవలం మరాఠీలోనే కాకుండా హిందీతో పాటు పలు వెల్‌కమ్ ఒబామా వంటి తెలుగు సినిమాల్లోనూ నటించి ఇక్కడి ప్రేక్షకులకు కూడా సుపరిచితమయ్యారు. ఆదినాథ్ సైతం నటుడిగానే కాకుండా దర్శకుడిగా సత్తా చాటుతున్నారు. ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
కూతురి కోసం కలిసి ముందడుగు
తమ విడాకుల ప్రకటనలో కూతురు జిజా (Jizah) భవిష్యత్తు గురించి ఈ జంట స్పష్టతనిచ్చింది. భాగస్వాములుగా విడిపోయినప్పటికీ, తల్లిదండ్రులుగా తమ బాధ్యతను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
"ఆలోచించి తీసుకున్న నిర్ణయం ప్రకారమే మేమిద్దరం భాగస్వాములుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. దంపతులుగా మా ప్రయాణం ముగిసినా, మా కూతురు జిజా పట్ల మా బాధ్యత ఎప్పటికీ మారదు. తన ప్రయోజనాలే మాకు మొదటి ప్రాధాన్యం. తనను ఎంతో ప్రేమగా, సురక్షితమైన వాతావరణంలో పెంచడానికి మేమిద్దరం కలిసి బాధ్యత తీసుకుంటాం" అని ఆదినాథ్, ఊర్మిళ తమ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
తమ వ్యక్తిగత జీవితంలోని ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న సమయంలో మీడియా, అభిమానులు తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని వారు కోరారు. ఈ విషయంలో ఇదే తమ చివరి ప్రకటన అని, దీనిపై మళ్లీ ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్పష్టం చేశారు.
ఏడాది కాలంగా గుసగుసలు
{{/usCountry}}తమ వ్యక్తిగత జీవితంలోని ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న సమయంలో మీడియా, అభిమానులు తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని వారు కోరారు. ఈ విషయంలో ఇదే తమ చివరి ప్రకటన అని, దీనిపై మళ్లీ ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్పష్టం చేశారు.
ఏడాది కాలంగా గుసగుసలు
{{/usCountry}}నిజానికి వీరిద్దరి బంధం తెగిపోయిందనే వార్తలు ఈరోజో రేపో వచ్చినవి కావు. గత కొన్ని నెలలుగా వీరి కాపురంలో విభేదాలు తలెత్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2025 చివరి నుంచే వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఆ సమయంలో ఈ రూమర్లపై స్పందించడానికి ఈ జంట ఇష్టపడలేదు.
గతంలో ఒక ఇంటర్వ్యూలో ఊర్మిళ ఈ విషయాలపై మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి నకిలీ, విషపూరితమైన వార్తలను తానేమీ పట్టించుకోనని, ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతిదానిని నమ్మవద్దని హింట్ ఇచ్చారు. కానీ, చివరికి ఆ ప్రచారమే నిజమైంది.
సెట్స్‌పై చిగురించిన ప్రేమకథ
ఆదినాథ్ కొఠారే, ఊర్మిళల ప్రేమకథ ఒక సినిమా సెట్స్ పైనే మొదలైంది. 2006లో ఆదినాథ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు మహేష్ కొఠారే దర్శకత్వంలో వచ్చిన 'శుభ్ మంగళ్ సావధాన్' సినిమాతో ఊర్మిళ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది.
ఐదేళ్ల డేటింగ్ తర్వాత 2011లో ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఏడేళ్లకు అంటే 2018లో వీరికి కుమార్తె జిజా జన్మించింది. ఊర్మిళ 'దునియాదారీ', 'మాలా ఆయ్ వ్హాయ్చ్య్!', 'తీ సద్ధ్యా కే కర్తే' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మరాఠీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.
నితేష్ తివారీ 'రామాయణం'లో ఆదినాథ్
కాగా, ఆదినాథ్ కూడా పలు చిత్రాల్లో నటిస్తూ, వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. విడాకుల గొడవలు పక్కన పెడితే, నటుడిగా ఆదినాథ్ కొఠారే కెరీర్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా విజువల్ వండర్ 'రామాయణం' (Ramayana) సినిమాలో ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో శ్రీరాముడి తమ్ముడు 'భరతుడు'గా ఆదినాథ్ కనిపించనున్నారు.
దీంతో పాటు హన్సల్ మెహతా దర్శకత్వంలో వస్తున్న 'గాంధీ టాక్స్' (Gandhi Talks) సినిమాలోనూ ఆయన నటించారు.