...
...
Next Story

నిద్రలేవడం, రికార్డ్స్ క్రియేట్ చేయడం, రిపీట్- ధురంధర్ కలెక్షన్స్‌పై ట్వీట్- తొలి హిందీ సినిమాగా 30 రోజుల రికార్డ్

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. విడుదలైన 30 రోజుల్లోనే దేశీయంగా వందల కోట్ల వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దీనిపై నిర్మాణ సంస్థ వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: Jan 4, 2026, 13:40:24 IST
Advertisement

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగుతోంది.. అదే రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నెల రోజులు గడిచినా బాక్సాఫీస్ వద్ద తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. తాజాగా ఈ సినిమా బాలీవుడ్ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ హిందీ సినిమాకు సాధ్యం కాని ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది.

30 రోజుల్లోనే రూ. 800 కోట్ల మ్యాజిక్!

Ranveer Singh plays the lead in Aditya Dhar's spy thriller Dhurandhar which has broken records.
Ranveer Singh plays the lead in Aditya Dhar's spy thriller Dhurandhar which has broken records.

దురంధర్ సినిమా సాధిస్తున్న వసూళ్లు చూస్తుంటే ట్రేడ్ వర్గాలే విస్తుపోతున్నాయి. కేవలం 30 రోజుల్లోనే దేశీయ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 806.80 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో హిందీ వెర్షన్ పరంగా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బాలీవుడ్ సినిమా ఇదే కావడం విశేషం. ఇలా దురంధర్ తొలి హిందీ సినిమాగా 30 రోజుల రికార్డ్ క్రియేట్ చేశాడు.

వారాల వారీగా ధురంధర్ కలెక్షన్స్:

మొదటి వారం: రూ. 218 కోట్లు

రెండో వారం: రూ. 261.5 కోట్లు

మూడో వారం: రూ. 188.3 కోట్లు

నాలుగో వారం: రూ. 115.70 కోట్లు

30 రోజుల ఇండియా గ్రాస్ కలెక్షన్స్

గడిచిన శని, ఆదివారాల్లోనూ ధురంధర్ చిత్రం సత్తా చాటింది. శనివారం రూ. 9.70 కోట్లు, ఆదివారం రూ. 12.60 కోట్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ. 1186.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌కు చేరుకున్నాయి. ఇక ఇండియాలో 30 రోజుల్లో ధురంధర్‌కు రూ. 911.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ అయ్యాయి.

పుష్ప 2 టార్గెట్

షారుక్ ఖాన్ ‘జవాన్’ (రూ. 640 కోట్లు), విక్కీ కౌశల్ ‘ఛావా’ (రూ. 600 కోట్లు) రికార్డులను దురంధర్ ఎప్పుడో దాటేశాడు. ఈ విజయంపై స్పందించిన నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్, "ధురంధర్ దినచర్య ఇదే: నిద్రలేవడం.. రికార్డులు సృష్టించడం.. మళ్లీ దానిని రిపీట్ చేయడం" అంటూ ఆనందం వ్యక్తం చేసింది.

అగ్ర నటుల మేళవింపు

‘ఉరి’ సినిమాతో సంచలనం సృష్టించిన ఆదిత్య ధర్ దురంధర్ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో రణ్‌వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు నటించడం సినిమాకు పెద్ద అసెట్‌గా మారింది. వీరి నటన, ఆదిత్య ధర్ టేకింగ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe