...
...
Next Story

కాంతార వివాదం- కర్ణాటక హైకోర్టుకు ధురంధర్ హీరో రణ్‌వీర్- దైవాలను ప్రశంసించారంటూ పిటిషన్- ఘాటుగా స్పందించిన హైకోర్టు!

రిషబ్ శెట్టి కాంతార సినిమాలోని దైవత్వంపై హావభావాలను అనుకరించినందుకు తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. రణ్‌వీర్ సింగ్ చేసింది మిమిక్రీ కాదని, దైవత్వాని పొగిడారని హీరో లాయర్ పేర్కొన్నారు. ఈ కేసు ఇవాళ విచారణ కానుంది.

Published on: Feb 24, 2026, 11:58:25 IST
Advertisement

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ చుట్టూ ఇప్పుడు చట్టపరమైన చిక్కులు ముసురుకున్నాయి. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ ‘కాంతార’ (Kantara) సినిమాలోని కొన్ని సన్నివేశాలను, ముఖ్యంగా దైవానికి సంబంధించిన హావభావాలను అనుకరించడం (Mimicry) ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టింది.

కాంతార వివాదం- కర్ణాటక హైకోర్టుకు ధురంధర్ హీరో రణ్‌వీర్- దైవాలను ప్రశంసించారంటూ పిటిషన్- ఘాటుగా స్పందించిన హైకోర్టు!
కాంతార వివాదం- కర్ణాటక హైకోర్టుకు ధురంధర్ హీరో రణ్‌వీర్- దైవాలను ప్రశంసించారంటూ పిటిషన్- ఘాటుగా స్పందించిన హైకోర్టు!

తనపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)ను సవాలు చేస్తూ రణ్‌వీర్ సింగ్ ఇటీవల కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం (ఫిబ్రవరి 23) విచారణకు వచ్చిన ఈ పిటిషన్‌ను కోర్టు ఇవాళ్టీకి (ఫిబ్రవరి 24) వాయిదా వేసింది.

హైకోర్టులో ఏం జరిగింది?

న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్న ధర్మాసనం ముందు రణ్‌వీర్ సింగ్ తరపు న్యాయవాది ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కోరారు. "పిటిషనర్ ఒక బాలీవుడ్ నటుడు. 'కాంతార: చాప్టర్ 1'పై ఆయన వ్యక్తం చేసిన నిజాయితీ గల ప్రశంసలకు క్రిమినల్ రంగు పులుముతున్నారు" అని న్యాయవాది వాదించారు.

ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకే విచారణ చేపట్టాలని కోరగా.. "ఎందుకు? ఆయన బాలీవుడ్ నటుడు అయినందుకా? రేపు విచారిద్దాం" అంటూ కోర్టు ఘాటుగా స్పందించింది.

అసలు వివాదం ఏంటి?

గతేడాది నవంబర్‌లో గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFI)లో రణ్‌వీర్ సింగ్ పాల్గొన్నారు. వేదికపై రిషబ్ శెట్టి నటనను ప్రశంసిస్తూ, కాంతారలో దైవం పూనకం వచ్చినప్పుడు రిషబ్ చేసే హావభావాలను రణ్‌వీర్ అనుకరించారు. అంతేకాకుండా, చాముండి దైవాన్ని 'ఫీమేల్ ఘోస్ట్' (ఆడ దెయ్యం) అని వ్యాఖ్యానించారు.

వివాదం ముదరడంతో రణ్‌వీర్ సింగ్ అప్పట్లోనే సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరారు. "ఒక నటుడిగా రిషబ్ అద్భుతమైన ప్రతిభను హైలైట్ చేయడమే నా ఉద్దేశం. అపారమైన గౌరవంతోనే అలా చేశాను తప్ప ఎవరినీ కించపరచాలని కాదు" అని స్పష్టం చేశారు. రిషబ్ శెట్టి కూడా స్టేజ్ మీద రణ్‌వీర్ అలా చేస్తున్నప్పుడు వద్దని వారించినట్లు వీడియోల్లో కనిపించింది.

ఇదిలా ఉంటే, రణ్‌వీర్ సింగ్ తన తదుపరి చిత్రం ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) విడుదలకు రెడీ ఉంది. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా యశ్ నటించిన ‘టాక్సిక్’తో పోటీ పడనుంది. ఇలాంటి సమయంలో ఈ చట్టపరమైన వివాదాలు రణ్‌వీర్‌ను కాస్త ఆందోళనకు గురిచేస్తున్నాయని అభిమానులు వాపోతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe