...
...
Next Story

Raakaasa Rapappa Song: ట్రెండీ పదాలు, అలరించే మ్యూజిక్, స్పెషల్‌గా రామ్ మిర్యాల గాత్రం- రాకాస నుంచి రపప్పా సాంగ్ రిలీజ్!

Raakaasa Rapapa Rapappa Song Release: సంగీత్ శోభన్ సోలో హీరోగా నటించిన ఫాంటసీ హారర్ కామెడీ మూవీ రాకాస నుంచి తాజాగా రపప్పా.. రపప్పా సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రెండీ పదాలతో ఆకట్టుకునే మ్యూజిక్‌తో ఈ పాట సాగింది. ముఖ్యంగా రామ్ మిర్యాల గాత్రం పాటకు హైలెట్‌గా నిలిచింది.

Published on: Mar 8, 2026, 12:28:56 IST
Advertisement

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్ నిహరిక కొణిదెల ఇప్పుడు నిర్మాతగా మారి కాన్సెప్ట్ సినిమాలను రూపొందిస్తోంది. ఇదివరకు కమిటీ కుర్రోళ్లు సినిమాతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాతో అవార్డులు కూడా అందుకున్నారు.

జీ స్టూడియోస్ సమర్పణలో

ట్రెండీ పదాలు, అలరించే మ్యూజిక్, స్పెషల్‌గా రామ్ మిర్యాల గాత్రం- రాకాస నుంచి రపప్పా సాంగ్ రిలీజ్!
ట్రెండీ పదాలు, అలరించే మ్యూజిక్, స్పెషల్‌గా రామ్ మిర్యాల గాత్రం- రాకాస నుంచి రపప్పా సాంగ్ రిలీజ్!

కమిటీ కుర్రోళ్లు సినిమా తర్వాత నిహారిక కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి వస్తున్న మరో తెలుగు సినిమా రాకాస. జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో నిర్మాత ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ఈ ‘రాకాస’ మూవీని నిర్మించారు నిహారిక కొణిదెల.

ఫాంటసీ హారర్ కామెడీగా

ఓటీటీ సిరీస్‌తో డైరెక్టర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న మానస శర్మ రాకాస సినిమాకు దర్శకత్వం వహించారు. ఫాంటసీ హారర్ కామెడీగా తెరకెక్కిన రాకాస సినిమాలో సంగీత్ శోభ‌న్‌ హీరోగా న‌య‌న్ సారిక‌ హీరోయిన్‌గా నటించారు. రాకాసా సినిమా ఏప్రిల్ 3న థియేట్రికల్ రిలీజ్ కానుంది.

రాకాస మ్యూజికల్ ప్రమోషన్స్

ఈ క్రమంలో రిలీజ్ చేసిన ‘రాకాస’ గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంత వరకు చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఆడియెన్స్‌ని అలరించాయి. ఇక ఈ టీమ్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసింది. తాజాగా రాకాస నుంచి ‘రపప్పా.. రపప్పా’ పాటను విడుదల చేశారు.

హీరోయిన్ పట్ల హీరోకి ప్రేమ

హీరోయిన్ పట్ల హీరోకి ఉన్న ప్రేమ, తనకి బదులుగా వేరే వాడ్ని పెళ్లి చేసుకుంటోన్న తరుణంలో హీరోయిన్ గురించి హీరో చెప్పడం, తన బాధను వివరించడం ఈ పాటలో కనిపిస్తోంది. ఆ బాధని కూడా ట్రెండీ పదాలతో, చాలా ఫన్నీగా చెప్పే ప్రయత్నం చేశారు.

స్పెషల్‌గా రామ్ మిర్యాల గాత్రం

రాకాస మూవీ ఆడియో హక్కుల్ని సరిగమ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమాని ఓవర్సీస్‌లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్, కెనడాలో ప్రత్యంగిరా సినిమాస్ భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.

రాకాస నటీనటులు

ఇక రాకాస సినిమాలో సంగీత్ శోభన్, న‌య‌న్ సారిక‌తోపాటు వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుక్వింద‌ర్ సింగ్‌, అన్న‌పూర్ణ‌, అమ‌న్‌, అనూప్ సింగ్ ఠాకూర్‌, ర‌మ‌ణ భార్గ‌వ్‌, వాసు ఇంటూరి, రోహిణి (బ‌జ‌ర్ద‌స్త్‌), రోహ‌న్ (నైంటీస్‌) త‌దిత‌రులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks