నేషనల్ క్రష్, టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇటీవలే విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయితే, విజయ్తో లవ్ రూమర్్స వినిపిస్తున్న సమయంలోనే ఆనంద్ దేవరకొండ, ప్రస్తుతం మరిదితో రష్మికకు మంచి అనుబంధం ఉండేది.
అరుదైన ఫొటోలు, వీడియోలు

అది ఇప్పుడు మరోసారి స్పష్టమైంది. ఆనంద్ 34వ పుట్టినరోజును పురస్కరించుకుని రష్మిక మందన్నా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని అరుదైన ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. మరిదిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుతూ రష్మిక మందన్నా రాసిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
"ఆనందా.. హ్యాపీ బర్త్డే!"
ఆదివారం (మార్చి 15) ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా రష్మిక మందన్నా ఒక క్యూట్ ఫోటోను పంచుకున్నారు. అందులో రష్మిక, ఆనంద్ ఇద్దరూ ఆరెంజ్ కలర్ టీ-షర్టులు ధరించి ఒకేలా కనిపిస్తున్నారు.
"ఆనందా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు! నువ్వు షూటింగ్లో బిజీగా ఉన్నావు, నిన్ను మేమంతా మిస్ అవుతున్నాం. నీ వర్క్ బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ ఫోటో తీస్తున్నప్పుడు మేమిద్దరం చేపలను పిలుస్తున్నామట.. ఈ విషయాన్ని విజ్జు (విజయ్ దేవరకొండ) చెప్పాడు. మనం ఎప్పుడూ ఇలాగే సరదాగా ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ రష్మిక రాసుకొచ్చారు.
మరిదితో డ్యాన్స్
అంతేకాకుండా, మరిదితో కలిసి డ్యాన్స్ వేసిన ఒక వీడియోను కూడా రష్మిక మందన్నా షేర్ చేశారు. మలయాళ వైరల్ సాంగ్ 'కళ్యాణి' బ్యాక్గ్రౌండ్లో వస్తుండగా, మరిదితో పోటీ పడి డ్యాన్స్ చేస్తున్న వీడియోను చూపిస్తూ "మనం ఎప్పుడూ ఇలాగే డ్యాన్స్ చేస్తూ ఉండాలి" అని రష్మిక ఆకాంక్షించారు.
వదినపై ఆనంద్ ప్రేమ
గత నెల ఫిబ్రవరి 26న జైపూర్లో విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆనంద్ తన అన్న, వదినల గురించి ఒక ఎమోషనల్ నోట్ రాశారు.
{{/usCountry}}గత నెల ఫిబ్రవరి 26న జైపూర్లో విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆనంద్ తన అన్న, వదినల గురించి ఒక ఎమోషనల్ నోట్ రాశారు.
{{/usCountry}}"బయట ఫ్యాన్స్ నన్ను ‘వదిన ఎలా ఉన్నారు?’ అని అడుగుతుంటే నాకు ఎలా స్పందించాలో తెలిసేది కాదు. ఈరోజు నా అన్న ప్రపంచంలోనే అత్యంత పాజిటివ్ పర్సన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు ఒక మంచి వదిన దొరికింది" అని ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు.
వరుస సినిమాలతో బిజీగా దేవరకొండ బ్రదర్స్
ఇదిలా ఉంటే, విజయ్ రష్మిక జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'రణబాలి' అనే సినిమా రూపొందుతోంది. 19వ శతాబ్దం నాటి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది.
మరోవైపు, ఆనంద్ దేవరకొండ కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్యతో కలిసి ఆయన 'ఎపిక్' (Epic) అనే సినిమాలో నటిస్తున్నారు. దేవరకొండ కుటుంబంలో రష్మిక చేరికతో ఆ ఇంట్లో సందడి రెట్టింపైందని, మరిది బర్త్డే వేడుకలే అందుకు నిదర్శనమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.