సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా నటించిన ‘సికందర్’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఈ సినిమా వైఫల్యంపై స్పందించిన రష్మిక.. తనకు చెప్పిన కథకు, తెరపైకి వచ్చిన సినిమాకు చాలా తేడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరోతో

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన చిత్రం ‘సికందర్’. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య గతేడాది సంక్రాంతి బరిలో నిలిచింది.
అయితే, బలహీనమైన కథనం, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ లోపించడంతో సికందర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. తాజాగా సికందర్ పరాజయంపై రష్మిక మందన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
కథ మారింది.. రష్మిక ఆవేదన
తెలుగు సీనియర్ జర్నలిస్ట్ ప్రేమకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా‘సికందర్’ గురించి మనసు విప్పారు. "నేను మురుగదాస్ గారి దగ్గర కథ విన్నప్పుడు అది చాలా భిన్నంగా ఉంది. కానీ, షూటింగ్ జరుగుతున్న కొద్దీ పరిస్థితులు మారిపోయాయి. సాధారణంగా సినిమాల్లో ఇది జరుగుతూనే ఉంటుంది. మనం విన్న కథ ఒకటి అయితే.. ఎడిటింగ్, పర్ఫార్మెన్స్, సినిమా విడుదల సమయానికి అనుగుణంగా కథలో మార్పులు చేస్తారు. సికందర్ విషయంలోనూ అదే జరిగింది" అని రష్మిక చెప్పుకొచ్చారు.
నిజానికి సినిమాలో రష్మిక మందన్నా పాత్ర నిడివిని ఎడిటింగ్‌లో బాగా తగ్గించేశారని, అందుకే ఆమె పాత్ర అంతంతమాత్రంగానే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తూ.. "సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా తండ్రీకూతుళ్లలా కనిపిస్తున్నారు తప్ప జంటలా లేరు. అసలు ఎడిటింగ్ వల్ల కథలో అర్థం పర్థం లేకుండా పోయింది" అని విమర్శించారు.
వసూళ్లలో వెనుకబడిన ‘సికందర్’
{{/usCountry}}నిజానికి సినిమాలో రష్మిక మందన్నా పాత్ర నిడివిని ఎడిటింగ్‌లో బాగా తగ్గించేశారని, అందుకే ఆమె పాత్ర అంతంతమాత్రంగానే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తూ.. "సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా తండ్రీకూతుళ్లలా కనిపిస్తున్నారు తప్ప జంటలా లేరు. అసలు ఎడిటింగ్ వల్ల కథలో అర్థం పర్థం లేకుండా పోయింది" అని విమర్శించారు.
వసూళ్లలో వెనుకబడిన ‘సికందర్’
{{/usCountry}}దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన సికందర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 185 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. సల్మాన్ ఖాన్ క్రేజ్‌కు ఇది చాలా తక్కువ మొత్తం. సెన్సార్ కట్స్ తర్వాత సుమారు 20 నిమిషాల నిడివిని తగ్గించడం కూడా సినిమాకు మైనస్‌గా మారిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
సల్మాన్ ఖాన్ రియాక్షన్ ఏంటి?
ఇదిలా ఉంటే, బిగ్ బాస్ 19వ సీజన్‌లో సల్మాన్ ఖాన్ ఈ సినిమా గురించి ఆసక్తికరంగా స్పందించారు. తనకు నచ్చకుండా చేసిన సినిమాలు ఏవైనా ఉన్నాయా అని అడిగినప్పుడు సికందర్ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"నేను చేసిన సినిమాల్లో నాకు సూర్యవంశీ, నిశ్చయ్ వంటి పాత సినిమాలు నచ్చవు. కానీ 'సికందర్' గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అది డిజాస్టర్ అని వారు అనుకోవచ్చు కానీ, నేను మాత్రం అలా నమ్మను. ఆ సినిమా ప్లాట్ (కథాంశం) నాకు చాలా నచ్చింది" అని సల్మాన్ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు.
ఈద్ నాటికే రిలీజ్ చేయాలని
కాగా, సల్మాన్ తన ఆరోగ్యం బాగోలేకపోయినా సికందర్ సినిమాను ఈద్ (Eid) నాటికే విడుదల చేయాలని పట్టుబట్టడం కూడా ఫలితంపై ప్రభావం చూపిందని ఇండస్ట్రీ టాక్. ఇక సినిమాలో సత్యరాజ్, కాజల్ అగర్వాల్ కూడా నటించినప్పటికీ వారి పాత్రలు కూడా నామమాత్రంగానే ఉండిపోయాయని టాక్ వినిపించింది.