...
...
Next Story

Rashmika Bigg Boss: పెళ్లయ్యాక మరింత అందంగా కనపడుతున్నావ్- రష్మిక మందన్నాతో నాగార్జున- బిగ్ బాస్‌లో అతనికి రష్షీ వదినగా!

Rashmika Mandanna In Bigg Boss Telugu 10 Nagarjuna: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లోకి ఇవాళ రష్మిక మందన్నా ఎంట్రీ ఇచ్చారు. ఒసేయ్ రాములమ్మ పాటతో మైసాగా స్టేజీ మీదకు వచ్చిన రష్మికతో పెళ్లి తర్వాత మరింత అందంగా కనపడుతున్నావ్ అని నాగార్జున చెప్పారు. హౌజ్‌లో ఆ కంటెస్టెంట్‌ను మైసాగా పోల్చారు నాగార్జున.

Published on: Nov 22, 2026, 13:17:58 IST
Advertisement

Rashmika Mandanna In Nagarjuna Bigg Boss Telugu 10 Today: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 10 జోరుగా సాగుతోంది. వీకెండ్ వచ్చేసింది కాబట్టి హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి అందరిపై రివ్యూలు ఇస్తాడని తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ ఆదివారం (నవంబర్ 22) స్పెషల్ గెస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు 10లోకి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అడుగుపెట్టింది.

ఈ పాటతో రావాలంటే భయం

పెళ్లయ్యాక మరింత అందంగా కనపడుతున్నావ్- రష్మిక మందన్నాతో నాగార్జున- బిగ్ బాస్‌లో అతనికి రష్షీ వదినగా!
పెళ్లయ్యాక మరింత అందంగా కనపడుతున్నావ్- రష్మిక మందన్నాతో నాగార్జున- బిగ్ బాస్‌లో అతనికి రష్షీ వదినగా!

మైసాలోని ఒసెయ్ రాములమ్మా పాటతో బిగ్ బాస్ స్టేజీపైకి రష్మిక మందన్నా ఎంట్రీ ఇచ్చింది. "ఈ మ్యూజిక్ మీద స్టేజీ మీదకు రావాలంటే కొంచెం భయం వేస్తుంది" అని రష్మిక మందన్నా చెప్పింది. "ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే.. ఈ సినిమాలో నిన్ను చూస్తే భయమేయాలిగా" అని నాగ్ రిప్లై బదులిచ్చాడు.

"రష్మిక.. యూ లుక్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ ఆఫ్టర్ గెట్టింగ్ మ్యారీడ్ (పెళ్లి తర్వాత మరింత అందంగా కనిపిస్తున్నావ్)" అని నాగార్జున కాంప్లిమెంట్ ఇచ్చాడు. దానికి రష్మిక నవ్వేసింది. "నాకు తెలిసి అది నాలో ఉన్న సంతోషం వల్ల కావచ్చేమో" అని రష్మిక మందన్నా సమాధానం ఇచ్చింది.

నాగార్జున పంచ్‌లు

"మైసాలో బోలెడన్నీ ఫైట్స్ చేశావ్" అని నాగార్జున అంటే.. "మీరందరూ కూడా ఫైట్స్ చేస్తుంటారు కదా సర్. నేను కొంచెం ఇన్సిపిరేషన్ తీసుకుని నేను కూడా స్టార్ట్ చేశా" రష్మిక బదులిచ్చింది. "అంతేనా పెళ్లికి ప్రిపేర్ అయ్యావా" అని నాగార్జున పంచ్ వేశాడు. దానికి రష్మిక నవ్వేసింది. తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు రష్మికను యాక్షన్ హీరోయిన్‌గా పరిచయం చేశాడు నాగార్జున.

"అన్ని భాషల్లో చెప్పేసినా. కొరియన్‌లో అయిపోయింది, జపనీస్‌లో అయిపోయింది, బెంగాలీలో అయిపోయింది" అని రష్మిక చెబుతుంటే.. "అమీ తుమాకీ బాలు బాషి" అని బెంగాలీలో ఐ లవ్యూను దేబ్జానీ మోదక్ చెప్పేసింది. దాంతో రష్మిక సర్‌ప్రైజ్ అయింది. ఇద్దరు హార్ట్ సింబల్స్ చేతులతో చూపించుకున్నారు.

తర్వాత అమన్ మసూద్ లేచి.. "బయట మా ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నప్పుడు విజయ్ అన్నా.. రష్మిక వదినా అని చెప్పుకుంటాం సర్ మేము" అని చెబుతుంటే.. "ఇంకా డిస్టెన్స్ ఎందుకు రష్షీ అని పిలవచ్చు కదా" అని రష్మిక మందన్నా చనువుగా చెప్పింది. దాంతో "రష్షీ వదినా.." అని అమన్ అన్నాడు. "హా ఓకే" అని రష్మిక అంది.

మైసాల దేబ్జానీ

తర్వాత నాగార్జున కంటెస్టెంట్స్‌తో గేమ్ ఆడించాడు. డైలాగ్ వినిపిస్తే అది ఏ సినిమానో చెప్పాలి. తర్వాత గెలిచిన టీమ్ పాటకు డ్యాన్స్ చేస్తే.. వేరే టీమ్ మార్క్స్ ఇవ్వాలని, దానికి జడ్జ్ రష్మిక కూడా మార్క్స్ ఇవ్వాలని నాగార్జున చెప్పాడు. అర్జున్ రెడ్డి మూవీ డైలాగ్ వస్తే జబర్దస్త్ నరేష్ చెబుతాడు. ఆ సినిమా డైలాగ్‌ను ఇంగ్లీషులో చెప్పమని నాగ్ అడిగాడు.

దానికి జబర్దస్త్ నరేష్ చెప్పే విధానానికి రష్మిక నవ్వుకుంది. తర్వాత మగధీర సినిమా డైలాగ్ వస్తే చెప్పేందుకు గంట పట్టుకోడానికి రామ్ ప్రసాద్, దేబ్జానీ పోటీ పడతారు. గంట పట్టుకునేందుకు దేబ్జానీ దూకిన విధానం చూసి "మైసా.. మైసాలాగా చేశావ్" అని నాగార్జున అంటాడు. "అవును నైస్" అని షాక్ అయింది రష్మిక మందన్నా.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks