థియేటర్లలో రిలీజై మూడు నెలలు గడిచిపోయినా ఇంకా ధురంధర్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ మూవీ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా చూసిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టండన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ధురంధర్ చూసిన తర్వాత డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య, హీరోయిన్ యామి గౌతమ్ కు కాల్ చేసి రవీనా సారీ చెప్పింది.
రవీనా సారీ

డిసెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజైన ధురంధర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీల మనసులనూ గెలుచుకుంది. ఈ సినిమా చూసిన తర్వాత తన రియాక్షన్ ను రవీనా టండన్ తాజాగా పంచుకుంది. యామి గౌతమ్ కు సారీ చెప్పినట్లు ఆమె జూమ్ స్పాట్ లైట్ పాడ్ కాస్ట్ లో వెల్లడించింది.
భర్తకు అభిమానిగా
"నేను రీసెంట్ గా ధురంధర్ చూశా. వెంటనే యామి గౌతమ్ కు కాల్ చేసి సారీ చెప్పా. ‘ఐయామ్ సారీ. నేను మీ భర్త (ఆదిత్య ధర్)కు పెద్ద అభిమానిని. నా అటెన్షన్ గురించి మీ భర్తతో పంచుకోండి’ అని చెప్పా. ఎందుకంటే అతను చాలా కాలంగా మిస్ అయిన మూవీ ఫీలింగ్ ను తిరిగి తీసుకొచ్చాడు. పుష్ప, కేజీఎఫ్, ధురంధర్ లాంటి సినిమాలు చూసినప్పుడు ఆడియన్స్ కు సంతృప్తి దక్కుతుంది’’ అని రవీనా టండన్ పేర్కొంది.
రణ్‌వీర్ నా ఫ్యాన్
ధురంధర్ హీరో రణ్‌వీర్ సింగ్ తన ఫ్యాన్ అని చెప్పాడని ఈ సందర్భంగా రవీనా టండన్ వెల్లడించింది. అతను పదేళ్ల వయసులో నేను రొమాంటిక్ సాంగ్ చేస్తుంటే చూడటానికి వచ్చాడని తెలిపింది.
{{/usCountry}}ధురంధర్ హీరో రణ్‌వీర్ సింగ్ తన ఫ్యాన్ అని చెప్పాడని ఈ సందర్భంగా రవీనా టండన్ వెల్లడించింది. అతను పదేళ్ల వయసులో నేను రొమాంటిక్ సాంగ్ చేస్తుంటే చూడటానికి వచ్చాడని తెలిపింది.
{{/usCountry}}"అతను (రణ్‌వీర్) 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు నేను ఒక రొమాంటిక్ సాంగ్ చేస్తుంటే చూడటానికి వచ్చాడు. నాకు ఫ్యాన్ అని చెప్పాడు. ధురంధర్ లో రణ్‌వీర్ ను లవ్ చేస్తున్నా. డైరెక్టర్ ఆదిత్య ఓ మేధావి. అతను మైండ్ బ్లోయింగ్ అనే పదానికి మించినవాడు. సంజయ్, అక్షయ్ చాలా అద్భుతంగా నటించారు. సారా చాలా తెలివైనది’’ అని రవీనా టండన్ చెప్పింది.
ధురంధర్ గురించి
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ తదితరులు నటించారు. ధురంధర్ లో రణ్‌వీర్ సింగ్ ఓ ఇండియన్ స్పై ఏజెంట్ గా నటించాడు.
సీక్వెల్
ధురంధర్ మూవీకి సీక్వెల్ గా ధురంధర్ ది రివేంజ్ థియేటర్లకు రాబోతుంది. మార్చి 19, 2026న ఈ సినిమా రిలీజ్ కానుంది. అదే రోజు యష్ హీరోగా నటించిన టాక్సిక్ కూడా విడుదల అవుతుంది. టాక్సిక్ లో యష్ తో పాటు రుక్మిణి వసంత్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ తదితరులు నటించారు.