Karthik Jayanthi Rayavalasa Release Date Poster: టాలీవుడ్‌లో సరికొత్త కథాంశాలతో వస్తున్న యువ నటుల చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అదే బాటలో ఊరమాస్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన సినిమా 'రాయవలస'.
నవంబర్ 20న థియేటర్లలోకి!

కార్తిక్ జయంతిని హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ నిర్మించిన ఈ రాయవలస సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన రాయవలస టీజర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాను నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
అమ్మవారి ముందు త్రిశూలంతో పవర్‌ఫుల్ అవతార్
విడుదల తేదీకి సంబంధించి సోషల్ మీడియాలో వదిలిన రాయవలస ప్రత్యేక పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అమ్మవారి విగ్రహం ముందు నిలబడి చేతిలో త్రిశూలం పట్టుకున్న కార్తిక్ జయంతి లుక్ రౌద్ర రసాన్ని పండిస్తూ సినీ ప్రియులను కట్టిపడేస్తోంది.
ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా
తొలి సినిమానే అయినప్పటికీ కార్తిక్ జయంతి చూపించిన హావభావాలు, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ జె ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.
హీరో తల్లి రాధిక డైరెక్షన్
హీరో కార్తీక్ తల్లి రాధిక జయంతి రాయవలస చిత్రానికి దర్శకత్వం వహించగా, రాఖీ ఎ అందించిన కథ, సంభాషణలు మాస్ ప్రేక్షకులను నేరుగా రీచ్ అయ్యేలా ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రీష నూలు హీరోయిన్‌గా నటిస్తోంది.
సీనియర్ నటుల బలగం.. అలరించే సంగీతం
అలాగే, రాయవలస సినిమాలో భారీ తారగణం నటిస్తోంది. అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్ లాంటి సీనియర్ నటులతో పాటు త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు ఇతర కీలక పాత్రలలో మెరవనున్నారు.
రాయవలస సినిమా పాటలు పాడిన సింగర్స్
{{/usCountry}}అలాగే, రాయవలస సినిమాలో భారీ తారగణం నటిస్తోంది. అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్ లాంటి సీనియర్ నటులతో పాటు త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు ఇతర కీలక పాత్రలలో మెరవనున్నారు.
రాయవలస సినిమా పాటలు పాడిన సింగర్స్
{{/usCountry}}అర్జున్ బాలా అందించిన స్వరాలు, నేపథ్య సంగీతం రాయవలస చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పూర్ణ చారి, తరుణ్ సైదులతో కలిసి హీరో కార్తిక్ జయంతి స్వయంగా పాటలు రాయడం విశేషం. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, రమ్య బెహరా, సాహితి చాగంటి, సౌజన్య భగవతుల, వాగ్దేవి లాంటి ప్రముఖ గాయనీగాయకులు ఈ పాటలను ఆలపించారు.
మూవీ యూనిట్ ధీమా
"భావోద్వేగం, పవర్‌ఫుల్ యాక్షన్, అద్భుతమైన సంగీతం కలగలిపిన పరిపూర్ణమైన ఎంటర్‌టైనర్‌గా రాయవలస అలరిస్తుంది" అని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.
కెమెరా పనితనం, ఎడిటింగ్ వర్క్స్
వీఆర్కే నాయుడు కెమెరా పనితనం, గ్యారీ బిహెచ్ ఎడిటింగ్, మల్లేశ్ షాలియోన్ ఫైట్స్ రాయవలస సినిమా స్థాయిని మరింత పెంచనున్నాయి. కాగా, నవంబర్ 20న ఈ రాయవలస చిత్రం థియేటర్లలో ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి.