Rayavalasa Vishwak Sen: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ‘రాయవలస’ హవా.. విశ్వక్ సేన్ చేతుల మీదుగా సెకండ్ సాంగ్ రిలీజ్!

Vishwak Sen Released Rayavalasa Second Song: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వేదికగా తెలుగు జానపద సొగసులు మెరిసాయి. నూతన నటీనటులతో తెరకెక్కిన ‘రాయవలస’ సినిమా నుంచి 'మా ఊరు రాయవలస' పాటను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ మాస్ ఫోక్ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

Published on: Oct 25, 2026, 08:19:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Vishwak Sen Released Rayavalasa Second Song: తెలుగు సినిమా ప్రచార శైలి మునుపటిలా లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా వినూత్న ఆలోచనలతో చిత్రబృందాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘రాయవలస’ చిత్రం టాలీవుడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ‘రాయవలస’ హవా.. విశ్వక్ సేన్ చేతుల మీదుగా సెకండ్ సాంగ్ రిలీజ్!
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ‘రాయవలస’ హవా.. విశ్వక్ సేన్ చేతుల మీదుగా సెకండ్ సాంగ్ రిలీజ్!

తల్లికొడుకుల కాంబినేషన్

డెబ్యూ హీరో కార్తీక్ జయంతి, నూతన దర్శకురాలు రాధిక జయంతి తల్లికొడుకుల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ రాయవలస సినిమా ప్రమోషన్ల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో హంగామా సృష్టిస్తోంది.

విశ్వక్ సేన్ చేతుల మీదుగా ‘మా ఊరు రాయవలస’ పాట విడుదల

రాయవలస సినిమా ప్రచారంలో భాగంగా రెండో పాటను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల విడుదల చేశారు. ‘మా ఊరు రాయవలస’ అంటూ సాగే ఈ గ్రామీణ గీతాన్ని ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ పాటను ఆలపించిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా ఆలపించారు. అర్జున్ బాల స్వరపరిచిన ఈ పాట పల్లెటూరి వాతావరణాన్ని, సొంత ఊరి బంధాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

పాటపై విశ్వక్ సేన్ కామెంట్స్

"రాయవలస సినిమా కంటెంట్ చాలా బాగుంది. పాట అద్భుతంగా వచ్చింది, రాహుల్ తన గొంతుతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. చిత్ర యూనిట్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని సాంగ్ లాంచ్ సందర్భంగా విశ్వక్ సేన్ అన్నారు.

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ‘రింగుడు రింగుడు’ జోరు

అలాగే, మన తెలుగు జానపద సోయగం ప్రపంచ ప్రసిద్ధ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దాకా వెళ్లింది. రాయవలస సినిమాలోని తొలి పాట ‘రింగుడు రింగుడు’ డిజిటల్ బిల్‌బోర్డ్‌పై ప్రదర్శితమై సరికొత్త రికార్డు సృష్టించింది.

యూట్యూబ్‌లో 12 లక్షలకుపైగా వ్యూస్

కొత్త దర్శకురాలు, కొత్త కథానాయకుడు ఉన్న చిత్రానికి ఈ స్థాయిలో గ్లోబల్ ప్రమోషన్ లభించడం అరుదైన విషయం. ధనుంజయ్, సాహితీ చాగంటి పాడిన ఈ జానపద గీతం ఇప్పటికే యూట్యూబ్‌లో 12 లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ప్రవాస భారతీయులను సైతం ఈ పాట ఎంతగానో అలరిస్తోంది.

భావోద్వేగాల మేళవింపుగా ‘రాయవలస’

రేసన్ ప్రొడక్షన్స్ పతాకంపై గోపి కృష్ణ జయంతి నిర్మించిన రాయవలస చిత్రంలో కార్తీక్ జయంతి, శ్రీష నులు జంటగా నటించారు. సీనియర్ నటులు అనితా చౌదరి, రవివర్మ, జయప్రకాష్, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. పల్లెటూరి నేపథ్యం, స్వచ్ఛమైన ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

డిసెంబర్ 11న రాయవలస రిలీజ్

సాంకేతిక విభాగంలో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, రాఖీ కథనందించారు. కిట్టు సినిమాటోగ్రఫీ అందించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More