థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, ఆ సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్‌ను సదరు ప్లాట్‌ఫామ్స్ లేదా మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేస్తారు. కానీ, కొన్నిసార్లు మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా సర్‌ప్రైజ్ ఇస్తూ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి.
సడెన్‌గా ఓటీటీలోకి

ఇప్పుడు అలాంటి సినిమా గురించే తెలుసుకుందాం. థియేటర్లలో విడుదలైన కేవలం 2 వారాల్లోనే ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సడెన్‌గా ఇవాళ (మార్చి 27) ఓటీటీలోకి వచ్చింది ఓ తెలుగు మూవీ. ఆ సినిమానే "రేపు ఉదయం 10 గంటలకు". తెలుగులో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా "రేపు ఉదయం 10 గంటలకు" మూవీ తెరకెక్కింది.
చెందు మొద్దు దర్శకత్వ సినిమాలు
ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ హెబ్బా పటేల్, చైతన్య రావు, అభినవ్ గోమటం, కిరీటి దామరాజు, సాహితి అవంచ, వాసు ఇంటూరి, మోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు. 'ఓ పిట్ట కథ', 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' సినిమాలకు దర్శకత్వం వహించిన చెందు ముద్దు ఈ "రేపు ఉదయం 10 గంటలకు" మూవీకి దర్శకత్వం వహించారు.
మార్చి 14న థియేట్రికల్ రిలీజ్
మాస్ మీడియా సమర్పణలో తెరకెక్కిన "రేపు ఉదయం 10 గంటలకు" చిత్రానికి రామ్ వీరపనేని నిర్మించారు. ప్రిన్స్ హెన్రీ సంగీతం, సునీల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా, వెంకట్ ప్రభు ఎడిటింగ్ వర్క్స్ చేపట్టారు. ఇంట్రెస్టింగ్ పోస్టర్స్, గ్లింప్స్‌తో ఆకట్టుకున్న "రేపు ఉదయం 10 గంటలకు" మార్చి 14న థియేటర్లలో విడుదల అయింది.
రేపు ఉదయం 10 గంటలకు ఓటీటీ స్ట్రీమింగ్
అయితే, ఈ సినిమా ఎప్పుడు విడుదల అయింది, వెళ్లిపోయిందనే విషయం తెలియలేదు. సడెన్‌గా కేవలం 2 వారాల్లోనే అంటే థియేట్రికల్ రిలీజ్ అయన 14వ రోజునే "రేపు ఉదయం 10 గంటలకు" ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో రేపు ఉదయం 10 గంటలకు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
శ్రీరామ నవమి సందర్భంగా
{{/usCountry}}అయితే, ఈ సినిమా ఎప్పుడు విడుదల అయింది, వెళ్లిపోయిందనే విషయం తెలియలేదు. సడెన్‌గా కేవలం 2 వారాల్లోనే అంటే థియేట్రికల్ రిలీజ్ అయన 14వ రోజునే "రేపు ఉదయం 10 గంటలకు" ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో రేపు ఉదయం 10 గంటలకు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
శ్రీరామ నవమి సందర్భంగా
{{/usCountry}}ఇవాళ (మార్చి 27) శ్రీరామ నవమి సందర్భంగా అమెజాన్ ప్రైమ్‌లో రేపు ఉదయం 10 గంటలకు సినిమా ఓటీటీ రిలీజ్ అయింది. ప్రస్తుతం తెలుగు భాషలో మాత్రమే "రేపు ఉదయం 10 గంటలకు" ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమాలోని పాత్రల జీవితాలు రూ. 10 కోట్ల డ్రగ్ చుట్టూ తిరుగుతాయి.
10 కోట్ల డ్రగ్ చుట్టూ
కాల్ గర్ల్, ఆమెను ప్రేమించే యువకుడు, అంబులెన్స్ డ్రైవర్, ఇద్దరు లవర్స్, డ్రగ్ డీలర్, ఒక ఎస్సై ఇలా విభిన్న లైఫ్ స్టైల్ గల వ్యక్తుల జీవితాలు ఆ 10 కోట్ల డ్రగ్‌తో ముడిపడి ఉంటాయి. అలా ఎందుకు ముడిపడి ఉంది? రేపు ఉదయం 10 గంటలకు? అందరి జీవితాల్లో జరిగే మార్పు ఏంటీ అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
థియేటర్లలో మిస్ అయిన వాళ్లు లేదా తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న రేపు ఉదయం 10 గంటలకు సినిమాను నేటి నుంచే చూసి ఎంజాయ్ చేయొచ్చు.