Bigg Boss Rhiti Tiwari About Death Rape Threats: ప్రసిద్ధ భోజ్‌పురి నటుడు, పార్లమెంట్ సభ్యుడు మనోజ్ తివారీ కుమార్తెగా గుర్తింపు తెచ్చుకున్న రితీ తివారీ బిగ్ బాస్ సీజన్ 20 వేదికపై అత్యంత సున్నితమైన అంశాలను పంచుకున్నారు. సెలబ్రిటీల పిల్లలుగా పుట్టడం పైకి ఎంతో హంగులు కనిపించినా, లోపల అంతే భారంగా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
స్టార్ డాటర్ కావడం వల్ల

ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్‌తో జరిగిన సంభాషణలో తనపై పడుతున్న ఒత్తిడి, ఎదురవుతున్న తీవ్రమైన వేధింపుల గురించి రితి తివారీ వివరిస్తూ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే విషయాలను వెల్లడించారు. స్టార్ డాటర్ కావడం వల్ల సమాజం నుంచి వచ్చే గుర్తింపుతో పాటు సమాన స్థాయిలో వేధింపులు కూడా అనుభవించాల్సి వస్తోందని రితీ చెప్పారు.
రేప్, హత్య బెదిరింపులు వస్తున్నాయి!
"నాపై ఎప్పుడూ రెట్టింపు ఒత్తిడి ఉంటుంది. నేను ఏం మాట్లాడినా మనోజ్ తివారీ కుమార్తె ఇలా అంది అని ప్రచారం చేస్తారు. ఆయన కూతురిని అన్న ఒక్క కారణంతోనే నాకు ఆన్‌లైన్‌లో హత్య బెదిరింపులు, రేప్ బెదిరింపులు వస్తున్నాయి. నా వ్యక్తిగత అభిప్రాయాలను కూడా నా తండ్రి అభిప్రాయాలుగానే భావించి నన్ను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు" అని బాక్సర్ మేరీ కోమ్‌తో రితీ తివారీ తన బాధను పంచుకున్నారు.
తల్లిదండ్రుల విడాకులు.. విరిగిన ప్రేమ బంధం
మరోవైపు నటి కనికా మన్‌తో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్‌లోని చేదు అనుభవాలను రితి తివారీ వెల్లడించారు. తల్లిదండ్రులు విడిపోవడం, సింగిల్ పేరెంట్‌గా తన తల్లి పడిన కష్టాలు తన ఆలోచనా విధానంపై తీవ్ర ప్రభావం చూపాయని చెప్పారు.
"గతంలో నన్ను అతిగా నియంత్రించాలని చూసిన పురుషులను చూశాను. నా జీవితంపై మరొకరికి అంత అధికారం ఉండే బంధంలో ఉండటం నాకు ఇష్టం లేదు. నా కాళ్లపై నేను నిలబడి, స్వయంగా సంపాదించుకుంటూ నాకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను. 20 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్న వ్యక్తిని ప్రాణంగా ప్రేమించాను, కానీ ఇటీవల ఆ ప్రేమ కథ ముగిసిపోయి నా గుండె పగిలింది" అని రితీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
గాయనిగా తనదైన గుర్తింపు
{{/usCountry}}"గతంలో నన్ను అతిగా నియంత్రించాలని చూసిన పురుషులను చూశాను. నా జీవితంపై మరొకరికి అంత అధికారం ఉండే బంధంలో ఉండటం నాకు ఇష్టం లేదు. నా కాళ్లపై నేను నిలబడి, స్వయంగా సంపాదించుకుంటూ నాకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను. 20 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్న వ్యక్తిని ప్రాణంగా ప్రేమించాను, కానీ ఇటీవల ఆ ప్రేమ కథ ముగిసిపోయి నా గుండె పగిలింది" అని రితీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
గాయనిగా తనదైన గుర్తింపు
{{/usCountry}}తండ్రి పేరుతో గుర్తింపు వచ్చినప్పటికీ, సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసేందుకు రితీ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఆమె కేవలం స్టార్ కిడ్ మాత్రమే కాదు, స్వశక్తితో ఎదుగుతున్న మంచి గాయని, పాటల రచయిత్రి, మ్యూజిక్ కంపోజర్, ప్రొడ్యూసర్ కూడా. యూట్యూబ్, స్పాటిఫై వేదికగా విడుదలైన 'బారిష్', 'మానసిక్ సంతులన్', 'జూటీ బేబీ', 'ఘుమ్ చుకే' వంటి పాటలతో శ్రోతలను ఆకట్టుకున్నారు.
'బిగ్ బాస్ 20'లో జోరు
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ హిందీ బిగ్ బాస్ సీజన్ 20 రియాలిటీ షో ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, కలర్స్ టీవీలో కూడా బిగ్ బాస్ హిందీ 20 ప్రసారమవుతోంది.
ఈ సీజన్‌లో రితీ తివారీతో పాటు ఖాజీ తౌకీర్, ఆసిఫ్ ఖాన్, కనికా మన్, మహీ విజ్, అమ్రపాలి దూబే, యూట్యూబర్ స్కౌట్ ఓపీ సహా 16 మంది పోటీదారులు ఈ విజేత ట్రోఫీ కోసం పోటీపడుతున్నారు. ఈ ఓటీటీ రియాలిటీ షోలో రితీ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం నేషనల్ మీడియాలో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.