...
...
Next Story

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు లవ్ ఎమోషనల్ మూవీ- మనసుకు హత్తుకునేలా తండ్రికొడుకుల బంధం, మధ్యలో అమ్మాయి ప్రేమ-ఎక్కడంటే?

ఓటీటీలోకి ఇవాళ తెలుగు లవ్ ఎమోషనల్ డ్రామా చిత్రం రైడర్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మనసుకు హత్తుకునేలా తండ్రి కొడుకుల బంధం మధ్యలోకి ఓ అమ్మాయి వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో రైడర్ తెరకెక్కింది. అతి తక్కువ నిడివితో వచ్చిన రైడర్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 19, 2025, 13:52:24 IST
Advertisement

ఓటీటీలోకి తెలుగు కంటెంట్ సినిమాలు కూడా ఎక్కువగానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. రొమాంటిక్, లవ్, డ్రామా, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, హారర్, ఫ్యామిలీ ఎమోషనల్ ఇలా అన్ని రకాల జోనర్లలో ఓటీటీ తెలుగు సినిమాలు ప్రతి వారం చాలానే వస్తున్నాయి. దీంతో తెలుగు ఓటీటీ ఆడియెన్స్‌ మరింత ఆసక్తి చూపిస్తున్నారు.

ఎమోషనల్ ఫ్యామిలీ అడ్వెంచర్ రొమాంటిక్ డ్రామా

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు లవ్ ఎమోషనల్ మూవీ- మనసుకు హత్తుకునేలా తండ్రికొడుకుల బంధం, మధ్యలో అమ్మాయి ప్రేమ-ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు లవ్ ఎమోషనల్ మూవీ- మనసుకు హత్తుకునేలా తండ్రికొడుకుల బంధం, మధ్యలో అమ్మాయి ప్రేమ-ఎక్కడంటే?

ఇక తాజాగా ఇవాళ (అక్టోబర్ 19) ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త తెలుగు మూవీ రైడర్. లవ్ ఎమోషనల్ ఫ్యామిలీ అడ్వెంచర్ రొమాంటిక్ డ్రామాగా రైడర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు కిశోర్ గుణన దర్శకత్వం వహించారు. కొత్తప్లి సురేష్ రైడర్ సినిమాను నిర్మించారు. కథ గని పిక్చర్స్ బ్యానర్‌పై రైడర్ చిత్రాన్ని రూపొందించారు.

తండ్రి కొడుకు మధ్యలో అమ్మాయి

శశాంక్ తిరుపతి సంగీతం అందించిన రైడర్ సినిమాలో రావణ్ రెడ్డి నిట్టూరు, మేఘన, శ్రీనివాస్ గడ్డం ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తండ్రి కొడుకు, మధ్యలో అమ్మాయి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు రైడర్ మూవీ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ సినిమాలో హీరో ఒక రైడర్. బైక్‌పై పలు విధాలుగా అడ్వెంచర్స్ చేస్తుంటాడు.

మనసుకు హత్తుకునే సీన్లు

హీరోకు తండ్రి అంటే చాలా ఇష్టమని ట్రైలర్‌లో చూపించిన డైలాగ్స్ ద్వారా అర్థం అవుతోంది. మనసుకు హత్తుకునేలా తండ్రికొడుకుల బంధం ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో హీరో జీవితంలో ఓ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయితో ప్రేమలో పడిన హీరో సంతోషంగా ఉంటాడు.

ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్‌గా

ఆ తర్వాత ఏమైంది? హీరో తండ్రి బంధం ఏమైంది? అమ్మాయి వల్ల ఏర్పడిన పరిస్థితులు ఏంటీ? ఆ అమ్మాయి ఎవరు? వంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ సీన్స్‌తో రైడర్ సాగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇవాళ్టీ (అక్టోబర్ 19) నుంచి రైడర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

రైడర్ ఓటీటీ రిలీజ్

ఈ ఈటీవీ విన్ కథా సుధాలో కూడా గత వారం నుంచి 4 టేల్స్ అంటూ నాలుగు సినిమాలను అందిస్తున్నారు. గతవారం మాస్క్ ఓటీటీ రిలీజ్ కాగా.. ఈ వారం రైడర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరో వారం చొప్పున ఇంకో రెండు సినిమాలను ఓటీటీ ప్రీమియర్ చేయనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks