...
...
Next Story

తుంబాడ్ స్ఫూర్తితో ఫ్యామిలీ హారర్ థ్రిల్లర్ వారస్-గర్భిణీ భార్య కోసం దివ్యాంగురాలైన సోదరిని బలిచ్చే అన్న-ఎక్కడ చూడాలంటే?

యువ దర్శకుడు రోహన్ ఆప్టే తెరకెక్కించిన ‘వారస్’ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 'తుంబాడ్' స్ఫూర్తితో సామాజిక అంశాలను జోడించి బ్లాక్ మ్యాజిక్, హారర్ ఎలిమెంట్స్‌తో రూపొందించిన ఈ చిత్రం వారస్ ఫిబ్రవరి 28న ప్రీమియర్ కానుంది. మరి వారస్ సినిమాను ఎక్కడ చూడాలో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Feb 21, 2026, 16:05:22 IST
Advertisement

కేవలం 29 ఏళ్ల వయసులోనే హారర్, ఫాంటసీ ప్రపంచాలను తనదైన శైలిలో ఆవిష్కరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు యువ దర్శకుడు రోహన్ ఆప్టే. "కేవలం భయపెట్టడం మాత్రమే హారర్ కాదు.. వస్తువుల వెనుక ఉండే భావోద్వేగాలు, చరిత్రలు, ఇతర ప్రపంచాల పట్ల నాకు ఉన్న ఆసక్తిని నా సినిమాల్లో చూపిస్తాను" అని రోహన్ తన ఫిలిం మేకింగ్ శైలి గురించి వివరిస్తున్నారు.

PREMIUMతుంబాడ్ స్ఫూర్తితో ఫ్యామిలీ హారర్ థ్రిల్లర్ వారస్-గర్భిణీ భార్య కోసం దివ్యాంగురాలైన సోదరిని బలిచ్చే అన్న-ఎక్కడ చూడాలంటే?
తుంబాడ్ స్ఫూర్తితో ఫ్యామిలీ హారర్ థ్రిల్లర్ వారస్-గర్భిణీ భార్య కోసం దివ్యాంగురాలైన సోదరిని బలిచ్చే అన్న-ఎక్కడ చూడాలంటే?

ఆయన రూపొందించిన తాజా లఘు చిత్రం (షార్ట్ ఫిల్మ్) ‘వారస్’ (Varas) ఇప్పుడు ముంబైలో జరగనున్న ప్రతిష్టాత్మక 'వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్' (Wench Film Festival) లో ఫిబ్రవరి 28న ప్రదర్శితం కానుంది.

‘తుంబాడ్’ స్ఫూర్తితో.. సమాజానికి అద్దం పడుతూ..

రోమన్ పోలన్స్కీ క్లాసిక్ ‘రోజ్మేరీస్ బేబీ’,

వారస్ బడ్జెట్

మరాఠీలో తెరకెక్కిన ఫ్యామిలీ హారర్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ వారస్‌ను గుర్మీత్ సింగ్, విశాల్ బజాజ్, ప్రతీక్ నందకుమార్ మోర్ నిర్మాతలుగా వ్యవహరించి నిర్మించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌కు రూ. 15 లక్షల బడ్జెట్ అయినట్లు మేకర్స్ తెలిపారు. 9 నిమిషాల 42 సెకన్ల నిడివి ఉన్న ఈ లఘు చిత్రాన్ని మరాఠీ, హిందీ భాషల్లో ముంబైలోని వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఫిబ్రవరి 28న వీక్షించవచ్చు.

రోమన్ పోలన్స్కీ క్లాసిక్ ‘రోజ్మేరీస్ బేబీ’, రాహి అనిల్ బార్వే విజువల్ వండర్ ‘తుంబాడ్’ చిత్రాల స్ఫూర్తి ‘వారస్’లో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ‘తుంబాడ్’ చిత్రానికి పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ అపూర్వ మెహ్రా ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. గ్రామీణ భారత నేపథ్యం, శిథిలావస్థలో ఉన్న పురాతన భవనం, విషపూరితమైన పితృస్వామ్య వ్యవస్థ.. వీటన్నిటి చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

కథా నేపథ్యం:

ఒక కుటుంబం తరతరాలుగా వస్తున్న శాపం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తుంది. తన గర్భిణీ భార్యతో కలిసి ఆ పాడుబడిన భవనం నుంచి వెళ్లిపోవాలని తపించే ఒక వ్యక్తి (తేజస్ రవిశంకర్), అందుకు తన దివ్యాంగురాలైన సోదరిని (పారుల్ రాణా) బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. గొలుసులతో బంధించిన ఒక చెక్క బీరువా, రక్తపు మరకలు ఉన్న దూది ఉండలు, నూనె దీపాల వలయం వంటి వస్తువులతో ఆ ముగ్గురి భవిష్యత్తు ఎలా దాగి ఉందనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు

కేవలం 20 నిమిషాల నిడివి ఉన్న వారస్ షార్ట్ ఫిల్మ్ అద్భుతమైన విజువల్స్, లైటింగ్, తక్కువ డైలాగులతో బలమైన ప్రభావాన్ని చూపుతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే టొరంటో, బెల్జియం వంటి దేశాల్లో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ‘వారస్’ ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది.

ఇంజనీర్ టు మేకర్: రోహన్ ప్రయాణం

ఇకపోతే రోహన్ ఆప్టే ఒక మెకానికల్ ఇంజనీర్. సెలవుల్లో తన తల్లి ‘లగాన్’ సినిమా మేకింగ్ వీడియో చూస్తుండగా, కెమెరా వెనుక ఉండే ప్రపంచంపై ఆయనకు ఆసక్తి కలిగింది.

ఆపై అమోల్ గుప్తే దగ్గర ‘సైనా’ సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేసి మెలకువలు నేర్చుకున్నారు రోహన్ ఆప్టే. పైన పేర్కొన్న ‘వారస్’తో పాటు, ప్రస్తుతం ముగ్గురు పిల్లలు, ఒక మాయా పిల్లనగ్రోవి చుట్టూ తిరిగే పూర్తి స్థాయి ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్‌పై రోహన్ ఆప్టే పని చేస్తున్నారు.

వారస్ బడ్జెట్

మరాఠీలో తెరకెక్కిన ఫ్యామిలీ హారర్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ వారస్‌ను గుర్మీత్ సింగ్, విశాల్ బజాజ్, ప్రతీక్ నందకుమార్ మోర్ నిర్మాతలుగా వ్యవహరించి నిర్మించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌కు రూ. 15 లక్షల బడ్జెట్ అయినట్లు మేకర్స్ తెలిపారు. 9 నిమిషాల 42 సెకన్ల నిడివి ఉన్న ఈ లఘు చిత్రాన్ని మరాఠీ, హిందీ భాషల్లో ముంబైలోని వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఫిబ్రవరి 28న వీక్షించవచ్చు.

All Access.
One Subscription.

Get 360° coverage—from daily headlines
to 100 year archives.

E-Paper
Full
Archives
Full Access to
HT App & Website
Games
 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe