వెబ్ సిరీస్: రోస్లిన్

నటీనటులు: మీనా, వినీత్, సంజన దీపు, హకీం షాజహాన్, అనిష్మ అనిల్ కుమార్ తదితరులు
డైరెక్టర్: సుమేష్ నందకుమార్
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 27, 2026
ఓటీటీ: జియోహాట్‌స్టార్
ఓటీటీలో ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన ఒరిజినల్ వెబ్ సిరీస్ లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మిస్టరీ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చిన రోస్లిన్ వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ మలయాళం థ్రిల్లర్ సిరీస్ ఫిబ్రవరి 27న జియోహాట్‌స్టార్‌లో రిలీజైంది. ఆరు ఎపిసోడ్ల ఈ సిరీస్ ఎలా ఉందో రోస్లిన్ రివ్యూలో చూసేయండి.
రోస్లిన్ కథ
శోభ (మీనా), జాన్ (వినీత్) కుటుంబం చుట్టూ సాగే కథనే రోస్లిన్ వెబ్ సిరీస్. శోభ, జాన్ భార్యాభర్తలు. వీళ్లకు రోస్లిన్ (సంజన దీపు) అనే టీనేజ్ కూతురు, చిన్న పిల్లాడైన ఆరోన్ ఉంటారు. ఈ ఫ్యామిలీ రోజ్ వ్యాలీని చూసుకుంటూ అక్కడి బంగ్లాలో ఉంటారు. అయితే రోస్లిన్ తర్వాత పుట్టిన అలెన్ చనిపోతాడు. రోస్లిన్ ను ఈ జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి.
ఈ కథలో రోస్లిన్ చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఆమెకు తరచుగా ఒకే రకమైన కల వస్తుంది. ఆకుపచ్చ రంగు కళ్లు కలిగిన ఓ వ్యక్తి తనను వెంటాడుతున్నట్లు, చంపాలని చూస్తున్నట్లు రోస్లిన్ కు కల వస్తుంది. ఈ విషయం అమ్మానాన్నకు చెప్తుంది. కానీ ఆమె చదివే నవలల కారణంగా ఇలాంటి కలలు వస్తున్నాయని చెప్పి ఊరుకుంటారు. అయితే ఒక రోజు జాన్ ఇంటికి జెర్రీ (హకీమ్ షాజహాన్) పెయింగ్ గెస్ట్ గా ఉండేందుకు వస్తాడు. తన కలలో వచ్చే వ్యక్తి జెర్రీనే అని రోస్లిన్ చెప్తుంది. కానీ ఎవరూ పట్టించుకోరు.
మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు జెర్రీ ఎవరు? రోస్లిన్ ఎందుకు అంతలా భయపడుతుంది? అనేది రోస్లిన్ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ
జీతు జోసెఫ్ సినిమాలంటేనే ఉత్కంఠతో ఊపేస్తాయి. అతను షో రన్నర్ గా వ్యవహరించిన రోస్లిన్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఇందులో ఉత్కంఠ చివరి వరకూ కొనసాగింది. ఆరు ఎపిసోడ్ల సిరీస్ లో తర్వాత ఏం జరుగుతుందనే సస్పెన్స్ ఆడియన్స్ కు మంచి థ్రిల్ అందిస్తుంది. ముఖ్యంగా రోస్లిన్ భయం, జెర్రీ బిహేవియర్ సిరీస్ ను మరింత ఎలివేట్ చేశాయి.
{{/usCountry}}జీతు జోసెఫ్ సినిమాలంటేనే ఉత్కంఠతో ఊపేస్తాయి. అతను షో రన్నర్ గా వ్యవహరించిన రోస్లిన్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఇందులో ఉత్కంఠ చివరి వరకూ కొనసాగింది. ఆరు ఎపిసోడ్ల సిరీస్ లో తర్వాత ఏం జరుగుతుందనే సస్పెన్స్ ఆడియన్స్ కు మంచి థ్రిల్ అందిస్తుంది. ముఖ్యంగా రోస్లిన్ భయం, జెర్రీ బిహేవియర్ సిరీస్ ను మరింత ఎలివేట్ చేశాయి.
{{/usCountry}}రోస్లిన్ సిరీస్ ను డైరెక్టర్ సుమేష్ నందకుమార్ బాగానే తెరకెక్కించాడు. కానీ నెమ్మదిగా సాగే కథాంశం ఈ సిరీస్ కు కాస్త మైనస్ గా కనిపిస్తుంది. రెండు, మూడు ఎపిసోడ్లలో రోస్లిన్ కల గురించే ఎక్కువగా చూపించారు. ఆరో ఎపిసోడ్ వరకు ప్రేక్షకుడు ఓపికగా చూడాల్సి వస్తుంది. అయితే లాస్ట్ ఎపిసోడ్ రాగానే ఆ ఫీలింగ్ అంతా ఎగిరిపోయి, మళ్లీ ఉత్కంఠ అందుకుంటుంది.
ఎవరెలా చేశారంటే
ప్రేమ దేశం హీరో వినీత్ గుర్తున్నాడా? ఈ సిరీస్ లో మీనా భర్తగా వినీత్ చక్కగా నటించాడు. సీనియర్ నటి మీనా తనకు అలవాటైన స్టైల్లో స్టోరీని ముందుకు తీసుకెళ్లింది. అయితే ఈ సిరీస్ కు వెన్నెముక మాత్రం సంజన దీపు. టీనేజీ అమ్మాయిగా తన యాక్టింగ్ మరో లెవల్ అని చెప్పొచ్చు. హకీం షాజహాన్ కూడా డిఫరెంట్ షేడ్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ బాగుంది.
ఫైనల్ గా
మలయాళం థ్రిల్లర్లు అంటేనే ఓటీటీలో ఉండే క్రేజే వేరు. రోస్లిన్ సిరీస్ కూడా అలాంటిదే. మంచి సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడే ఆడియన్స్ ఈ సిరీస్ చూడొచ్చు. తెలుగులోనూ అందుబాటులో ఉంది.