Sai Dharam Tej Wedding: మెగా మేనల్లుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ఓ మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. అయితే చాలా కాలంగా ఆయన పెళ్లి గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి సైతం కొన్ని సినిమా వేదికల మీద సాయి తేజ్‌కు త్వరగా పెళ్లి చేయాలని ఉందని సరదాగా కామెంట్స్ చేశారు.
పెళ్లి పీటలెక్కనున్న సాయి ధరమ్ తేజ్

ఎట్టకేలకు ఈ రూమర్లకు, మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులకు చెక్ పెడుతూ సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యాడు. తన పెళ్లి వార్తలపై గతంలోనే హింట్ ఇచ్చిన ఆయన, ఈ ఏడాదే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నట్లు సమాచారం.
చిన్ననాటి స్నేహితురాలితో నిశ్చితార్థం
తాజా సమాచారం ప్రకారం.. చాలా ఏళ్లుగా తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, సాయి ధరమ్ తేజ్ తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడు. రిపోర్ట్స్ ప్రకారం నవంబర్ 5వ తేదీన హైదరాబాద్‌లో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరగనుంది.
కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో చాలా ప్రైవేట్‌గా ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా తనకు పరిచయం ఉన్న కిరణ్మయితో ఉన్న స్నేహ బంధాన్ని, ఇప్పుడు సాయి తేజ్ అధికారికంగా జీవితకాలపు బంధంగా మార్చుకోబోతున్నాడు.
డిసెంబర్ లో పెళ్లి
నిశ్చితార్థం పూర్తయిన వెంటనే పెళ్లి పనుల్లో మెగా ఫ్యామిలీ బిజీ కానుందట. ఎంగేజ్మెంట్ ఈ నెల 5న జరగనుండగా, పెళ్లిని వచ్చే డిసెంబర్ నెలలో ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. డిసెంబర్ 10వ తేదీన వీరి వివాహం ఉండొచ్చని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. పెళ్లి వేడుక అనంతరం టాలీవుడ్ ప్రముఖులు, స్నేహితులు, అభిమానుల కోసం హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం.
వరుస సినిమాలతో బిజీ బిజీ
కెరీర్ పరంగా సాయి దుర్గా తేజ్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న "సంబరాల ఏటి గట్టు" అనే భారీ పాన్ ఇండియా పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీలో మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
{{/usCountry}}కెరీర్ పరంగా సాయి దుర్గా తేజ్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న "సంబరాల ఏటి గట్టు" అనే భారీ పాన్ ఇండియా పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీలో మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
{{/usCountry}}ఈ ప్రాజెక్టుతో పాటే మరిన్ని ఆసక్తికరమైన కథలను సాయి తేజ్ లైన్‌లో పెడుతున్నాడు. ఏదేమైనా అతి త్వరలోనే ఈ సుప్రీమ్ హీరో పెళ్లి వార్తపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.