...
...
Next Story

అవార్డ్స్ వేదికపై హీరోయిన్‌కు లవ్ ప్రపోజ్ చేసిన హీరో- సయ్యారా హాట్ కపుల్ అహాన్ పాండే అనీత్ పడ్డా వీడియో వైరల్!

Ahaan Panday Love Propose To Aneet Padda At Zee Cine Awards: బాలీవుడ్ యంగ్ అండ్ హాట్ కపుల్ అహాన్ పాండే, అనీత్ పడ్డా రిలేషన్ షిప్ వార్తలు ఇప్పుడు బి టౌన్ లో సెన్సేషన్ గా మారాయి. అవార్డుల వేదికపైనే వీరిద్దరూ ప్రేమను వ్యక్తపరుచుకున్న వీడియో వైరల్ అవుతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Published on: Mar 7, 2026, 09:07:07 IST
Advertisement

వెండి తెరపై హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న నటీనటుల మధ్య రియల్ లైఫ్‌లోనూ ప్రేమ చిగురించడం బాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. ఇప్పుడు తాజాగా 'సయ్యారా' (Saiyaara) ఫేమ్ జెన్-జీ జంట అహాన్ పాండే, అనీత్ పడ్డా మధ్య ఏదో నడుస్తోందంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలు ఇప్పుడు ఒక క్లైమాక్స్‌కు చేరుకున్నాయి.

షూటింగ్ సమయంలోనే

అవార్డ్స్ వేదికపై హీరోయిన్‌కు లవ్ ప్రపోజ్ చేసిన హీరో- సయ్యారా హాట్ కపుల్ అహాన్ పాండే అనీత్ పడ్డా వీడియో వైరల్!
అవార్డ్స్ వేదికపై హీరోయిన్‌కు లవ్ ప్రపోజ్ చేసిన హీరో- సయ్యారా హాట్ కపుల్ అహాన్ పాండే అనీత్ పడ్డా వీడియో వైరల్!

చుంకీ పాండే మేనల్లుడు అహాన్ పాండే ప్రస్తుతం తన కెరీర్ కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. 'సయ్యారా' షూటింగ్ సమయంలోనే అహాన్, అనీత్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని సినీ వర్గాల టాక్. వీరిద్దరూ ముంబైలోని రెస్టారెంట్లు, ఎయిర్‌పోర్టుల్లో తరచూ కలిసి కనిపిస్తుండటంతో వీరి డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి.

ఫొటోలు, వీడియో వైరల్

ముఖ్యంగా అనీత్ పడ్డా పుట్టినరోజును అహాన్ పాండేప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడం, ఆ ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. మధ్యలో వీరి బ్రేకప్ గురించి కూడా వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా బయటకు వచ్చిన ఒక వీడియో వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టింది.

అందరిముందే ప్రపోజ్.. ఐ లవ్ యూ!

ఇటీవల జరిగిన 'జీ సినీ అవార్డ్స్ 2026' (Zee Cine Awards 2026) వేదికపై అహాన్ పాండే అందరి సమక్షంలో అనీత్ పడ్డాకు తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ వేడుకలో ఉత్తమ నూతన నటుడిగా (Best Debut) అవార్డు అందుకున్న అహాన్ పాండే.. స్టేజ్ పైనే మాట్లాడుతూ.. "నా బ్యూటిపుల్.. బ్యూటిఫుల్ సహనటి అనీత్ పడ్డా.. నేను నీకు ప్రపోజ్ చేస్తున్నాను" అని ప్రకటించారు.

ఒప్పుకున్న హీరోయిన్

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జీ సినీ అవార్డ్స్ 2026కి సంబంధించిన ప్రోమోలో అనీత్ పడ్డాకు అహాన్ పాండే లవ్ ప్రపోజ్ చేయడం చూపించారు. దీంతో ఈ వ్యవహారం వెనుక మరో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది.

పాపులారిటీపై ప్రభావం

యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఈ జంటకు ఒక కీలక సలహా ఇచ్చారని సమాచారం. కెరీర్ ఆరంభంలోనే ప్రేమ వ్యవహారాలను బహిర్గతం చేస్తే అది వారి పాపులారిటీపై ప్రభావం చూపుతుందని, ప్రస్తుతానికి దీన్ని రహస్యంగా ఉంచమని ఆయన కోరారట. అందుకే గతంలో ఒక ఇంటర్వ్యూలో అహాన్ మాట్లాడుతూ అనీత్ తన 'బెస్ట్ ఫ్రెండ్' మాత్రమేనని డేటింగ్ పుకార్లను కొట్టిపారేశారు.

నిజమా? పబ్లిసిటీ స్టంటా?

ఇప్పుడు అవార్డు వేడుకలో బహిరంగంగా ప్రేమను ప్రకటించడం చూస్తుంటే, ఇది నిజమైన ప్రేమా? లేక తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి చేస్తున్న పబ్లిసిటీ స్టంటా? అని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.

హాట్ కపుల్‌గా పేరు

ఏదేమైనా ఈ యంగ్ జోడీ కెమిస్ట్రీ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా సయ్యారా సినిమాతో బాలీవుడ్ హాట్ కపుల్‌గా అహాన్, అనీత్ పేరు తెచ్చుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe