...
...
Next Story

Sonakshi Sinha: సల్మాన్ ఖాన్ అమాయకుడేం కాదు కదా, రొమాన్స్ చేస్తూ పట్టుబడిపోయాం: హీరోయిన్ సోనాక్షి సిన్హా కామెంట్స్

Sonakshi Sinha Caught To Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా రొమాన్స్ చేస్తూ సల్మాన్ ఖాన్‌కు పట్టుబడినట్లు తాజాగా చెప్పుకొచ్చింది. సల్మాన్ ఖాన్ అమాయకుడేం కాదుగా అని, అతనెంత అడిగిన లేదు భాయ్ అని అబద్ధం చెప్పేదాన్ని తాజాగా టాక్ షోలో సోనాక్షి వివరించింది.

Published on: Jul 16, 2026, 19:41:52 IST
Advertisement

Sonakshi Sinha Caught To Salman Khan: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ గత ఏడాది కాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తమ పెళ్లికి ముందు చాలా ఏళ్ల పాటు గుట్టుగా ప్రేమాయణం సాగించిన ఈ జంట, గతేడాది జూన్ 23న స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఒక్కటయ్యారు.

దొరక్కుండా తప్పించుకోలేకపోయాం

సల్మాన్ ఖాన్ అమాయకుడేం కాదు కదా, రొమాన్స్ చేస్తూ పట్టుబడిపోయాం: హీరోయిన్ సోనాక్షి సిన్హా కామెంట్స్
సల్మాన్ ఖాన్ అమాయకుడేం కాదు కదా, రొమాన్స్ చేస్తూ పట్టుబడిపోయాం: హీరోయిన్ సోనాక్షి సిన్హా కామెంట్స్

అయితే తాము ఎంత దాచాలని ప్రయత్నించినా, బాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దన్న సల్మాన్ ఖాన్ కళ్లకు మాత్రం అస్సలు దొరక్కుండా తప్పించుకోలేకపోయామని ఈ జంట అంటోంది. నేహా ధూపియా, అంగద్ బేడీలు యాంకర్లుగా వ్యవహరిస్తోన్న 'డబుల్ డేట్' టాక్ షోలో పాల్గొన్న సోనాక్షి, జహీర్ తమ లవ్ స్టోరీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నిజానికి సోనాక్షి సిన్హాకు, సల్మాన్ ఖాన్‌కు మధ్య అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. సల్మాన్ నటించిన ఇండస్ట్రీ హిట్ 'దబాంగ్' సినిమాతోనే సోనాక్షి బాలీవుడ్ వెండితెరకు పరిచయమైంది. అలాగే జహీర్ ఇక్బాల్‌ను కూడా సల్మాన్ ఖానే ప్రోత్సహించారు. 2017లో సల్మాన్ ఖాన్ ఏర్పాటు చేసిన ఒక గ్రాండ్ పార్టీలోనే సోనాక్షి, జహీర్ మొదటిసారి కలుసుకున్నారు. అక్కడే వీరి మధ్య స్నేహం కుదిరి, ఆపై ప్రేమగా మారింది.

"రేపు బ్రేకప్ అయితే నా దగ్గరికే రావాలి"

తమ మధ్య ప్రేమ చిగురిస్తున్న కొత్తలో సల్మాన్ ఖాన్ తమను చాలాసార్లు నిలదీశారని జహీర్ ఇక్బాల్ గుర్తుచేసుకున్నారు. తాము ఎంత కాదన్నా సల్మాన్ ఖాన్ నమ్మలేదని చెప్పారు. "సల్మాన్ భాయ్‌కి అంతా ముందే తెలుసు. మేము ఆయనకు మా ప్రేమ విషయం చెప్పకముందే ఆయన కనిపెట్టేశారు. మేము ఎంత దాచాలని చూసినా ఆయన అస్సలు ఒప్పుకోలేదు" అని జహీర్ పేర్కొన్నారు.

ఒకసారి అందరం కలిసి ట్రెకింగ్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఈ దాగుడు మూతలకు సల్మాన్ ఖాన్ పూర్తిగా తెరదించారని సోనాక్షి గుర్తుచేసుకుంది. ట్రెకింగ్ చేస్తున్న సమయంలో సల్మాన్ నేరుగా జహీర్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్లారు. చాలా క్యాజువల్‌గా జహీర్ భుజంపై చేయి వేసి, "అంతా కనిపిస్తూనే ఉందిరా భాయ్" (దిఖ్ రహా హై సబ్) అని మెల్లగా అని వెళ్లిపోయారు.

సల్మాన్ నోట ఆ మూడు మాటలు విన్న తర్వాత తాము ఎంత దాచాలని చూసినా లాభం లేదని ఈ జంటకు అర్థమైపోయింది. అంటే, సోనాక్షి, జహీర్ రొమాన్స్ చేసుకుంటుండుంగా సల్మాన్ చూసినట్లుగా హీరోయిన్ చెప్పుకొచ్చింది. ఆ క్షణంతో తమ గుట్టు పూర్తిగా రట్టయిపోయిందని వారు గ్రహించారట. అలా 2017లో మొదలైన వీరి ప్రయాణం ఏడేళ్ల పాటు రహస్యంగా సాగి, చివరికి పెద్దల సమక్షంలో పెళ్లి పీటల వరకు చేరింది.

సోనాక్షి తదుపరి చిత్రాలు

సినిమాల విషయానికి వస్తే, సోనాక్షి సిన్హా ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన 'సిస్టమ్' (System) ఓటీటీ వెబ్ సిరీస్‌లో నటించింది. ఇందులో సీనియర్ నటి జ్యోతిక, అశుతోష్ గోవారికర్ కూడా కీలక పాత్రలు పోషించారు.

ప్రస్తుతం సోనాక్షి సిన్హా చేతిలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో భారీ విజయాన్ని అందుకున్న క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ సిరీస్ 'దహాద్ సీజన్ 2' (Dahaad Season 2) ఒకటి. త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe