...
...
Next Story

Samantha Naga Chaitanya: ఒకే పెళ్లిలో సమంత నాగ చైతన్య- వేర్వేరు జంటలుగా సందడి-ఒకరినొకరు పలకరించుకున్నారా? నాగ్ అమల కూడా!

Samantha Naga Chaitanya In Wedding: టాలీవుడ్‌లో అరుదైన దృశ్యం హాట్ టాపిక్‌గా మారింది. సమంత, నాగ చైతన్య ఒకే పెళ్లిలో కనిపించడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో ఒకే వేదికపైకి వచ్చిన సమంత-రాజ్, నాగచైతన్య-శోభిత దంపతులపైనే అందరి కళ్లు నిలిచాయి.

Published on: May 3, 2026, 09:52:29 IST
Advertisement

Samantha Naga Chaitanya In Wedding: ఏషియన్ సినిమాస్ అధినేత, ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ నారంగ్ వివాహ రిసెప్షన్ శనివారం (మే 2) సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి దిగ్గజాలు విచ్చేశారు.

బిజీగా ఉన్నప్పటికీ

ఒకే పెళ్లిలో సమంత నాగ చైతన్య- వేర్వేరు జంటలుగా సందడి-ఒకరినొకరు పలకరించుకున్నారా? నాగ్ అమల కూడా!
ఒకే పెళ్లిలో సమంత నాగ చైతన్య- వేర్వేరు జంటలుగా సందడి-ఒకరినొకరు పలకరించుకున్నారా? నాగ్ అమల కూడా!

అలాగే, పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులతో సిమ్రాన్ నారంగ్ రిసెప్షన్ వేదిక కళకళలాడింది. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, సునీల్ నారంగ్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా టాలీవుడ్ సెలబ్రిటీలంతా క్యూ కట్టారు.

ఒకే వేదికపై మాజీ జంట

ఈ వేడుకలో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. విడిపోయిన తర్వాత సమంత, నాగచైతన్య ఒకే కార్యక్రమానికి హాజరు కావడం చాలా అరుదు. అయితే ఈ రిసెప్షన్‌లో వీరిద్దరూ తమ ప్రస్తుత భాగస్వాములతో (లైఫ్ పార్టనర్స్) కలిసి సందడి చేశారు. సమంత తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి రాగా.. నాగ చైతన్య తన భార్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో కలిసి విచ్చేశారు.

సమంత ఊదా రంగు (పర్పుల్), గోల్డ్ బోర్డర్ ఉన్న చీరలో మెరిసిపోగా.. రాజ్ సూట్ ధరించి కనిపించారు. మరోవైపు చైతన్య తన తండ్రి నాగార్జున (నాగ్), తల్లి అమలతో కలిసి వచ్చారు. శోభిత నీలం, గులాబీ రంగు మిళితమైన చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టేజ్ మీదకు వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించే సమయంలో నాగ చైతన్య, శోభితా జంట కెమెరా కళ్లకు చిక్కారు.

సోషల్ మీడియాలో చర్చ.. అభిమానుల ఆసక్తి

'ఏ మాయ చేసావె' సినిమాతో మొదలైన సమంత-నాగ చైతన్య ప్రయాణం 2017లో వివాహ బంధంతో ఒక్కటైంది. అయితే మనస్పర్థల కారణంగా 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగ చైతన్య 2024 డిసెంబర్‌లో శోభితను పెళ్లాడగా.. సమంత 2025 డిసెంబర్‌లో కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు.

హారర్ థ్రిల్లర్ చిత్రం

ప్రస్తుతం నాగ చైతన్య 'వృషకర్మ' అనే సోషియో ఫాంటసీ హారర్ థ్రిల్లర్ చిత్రంతో బిజీగా ఉండగా.. సమంత 'మా ఇంటి బంగారం', 'రక్త బ్రహ్మాండం' వంటి క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే, ఒకే పెళ్లిలో వేర్వేరు జంటలుగా సమంత, నాగ చైతన్య హాజరు కావడం నెట్టింట ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. సునీల్ నారంగ్ కుమార్తె రిసెప్షన్‌కు సమంత ఎవరితో కలిసి వచ్చారు?

సమంత తన భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.

2. నాగచైతన్య, సమంత ఒకరినొకరు పలకరించుకున్నారా?

వీరిద్దరూ ఒకే వేడుకకు హాజరైనప్పటికీ, ఒకరినొకరు పలకరించుకున్నట్లు లేదా కలిసినట్లు ఎలాంటి ఫొటోలు గానీ, వీడియో ఆధారాలు గానీ లేవు.

3. సమంత, రాజ్ నిడిమోరు వివాహం ఎప్పుడు జరిగింది?

సమంత, రాజ్ 2025 డిసెంబర్‌లో కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో వివాహం చేసుకున్నారు.

4. నాగచైతన్య నటిస్తున్న తదుపరి చిత్రం ఏమిటి?

నాగచైతన్య ప్రస్తుతం 'వృషకర్మ' అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. అంతకుముందు ఆయన 'తండేల్' చిత్రంతో ప్రేక్షకులను అలరించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe