...
...
Next Story

Pregnant Samantha Workouts: ప్రెగ్నెన్సీతోనే సమంత భారీ వర్కౌట్లు- కాబోయే తల్లులకు స్పెషల్ టిప్స్-గర్బిణీలు ఇలా చేయొచ్చా?

Samantha Workouts In Pregnancy: ప్రెగ్నెన్సీలోనూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతూ నటి సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో స్పెషల్ వర్కౌట్ల వీడియో పంచుకున్నారు. శరీరం చెప్పే మాట వినడం ఎంత ముఖ్యమో వివరిస్తూ, వ్యాయామాలు చేసే క్రమంలో తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పెషల్ టిప్స్ ఇచ్చారు.

Published on: Aug 26, 2026, 15:58:10 IST
Advertisement

Samantha Workouts In Pregnancy: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ సమయాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తున్నారు. గర్భంతో ఉన్న సమయంలోనూ క్రమం తప్పకుండా వర్కవుట్లు చేస్తూ ఫిట్‌నెస్‌ పట్ల తనకున్న నిబద్ధత, క్రమశిక్షణ చాటుకుంటున్నారు.

సమంత వర్కౌట్స్ వీడియో వైరల్

ప్రెగ్నెన్సీతోనే సమంత భారీ వర్కౌట్లు- కాబోయే తల్లులకు స్పెషల్ టిప్స్-గర్బిణీలు ఇలా చేయొచ్చా?
ప్రెగ్నెన్సీతోనే సమంత భారీ వర్కౌట్లు- కాబోయే తల్లులకు స్పెషల్ టిప్స్-గర్బిణీలు ఇలా చేయొచ్చా?

ఆగస్టు 26న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో గర్భధారణ సమయపు ఫిట్‌నెస్ ప్రయాణానికి సంబంధించిన వర్కవుట్ వీడియోలు, ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

గతంలో కఠినమైన శిక్షణ తీసుకున్న సమంత, ఇప్పుడు గర్భధారణ సమయానికి తగినట్లుగా తన వ్యాయామాల్లో మార్పులు చేసుకున్నారు. వ్యాయామం చేసేటప్పుడు శరీరాన్ని పరిమితికి మించి కష్టపెట్టకూడదని ఆమె స్పష్టం చేశారు.

శరీరం చెప్పే మాట వినడమే అసలైన ఫిట్‌నెస్

"శరీరాన్ని కష్టపెట్టడం కంటే అది చెప్పే మాట వినడమే ఇప్పుడు నాకు ముఖ్యం. కొన్ని రోజులు శరీరం బలంగా అనిపిస్తే పూర్తిస్థాయిలో వ్యాయామం చేస్తాను, మరికొన్ని రోజులు కాస్త విశ్రాంతికే మొగ్గు చూపుతాను. ఇన్నాళ్లూ ఎక్కువ వర్కవుట్లు చేసేలా నా శరీరాన్ని సిద్ధం చేశాను. కానీ, ఇప్పుడు నా శరీరం విశ్రాంతి కోరినప్పుడు దానికి ప్రాధాన్యం ఇవ్వడం నేర్చుకుంటున్నాను" అని సమంత వివరించారు.

సమంత చేసిన వర్కౌట్స్ ఇవే

సిటెడ్ ఇన్‌క్లైన్ రోయింగ్, డెడ్‌లిఫ్ట్స్, కెటిల్‌బెల్ ఎక్సర్‌సైజులు, చెస్ట్ ప్రెస్ వంటి వ్యాయామాలను తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా మార్చుకుని సమంత వర్కౌట్స్ చేస్తుండటం ఆ వీడియోల్లో కనిపించింది.

వైద్యుల సలహా తప్పనిసరి

"నా ట్రైనర్ ప్రీనేటల్ (గర్భధారణ) ఫిట్‌నెస్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణులు. డాక్టర్ల ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే ఈ వర్కవుట్లు చేస్తున్నాను. ప్రతి ఒక్కరి శరీరం ఒకేలా ఉండదు కాబట్టి వ్యాయామాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా డాక్టర్లను సంప్రదించాలి" అని సమంత స్పష్టం చేశారు.

డాక్టర్ సంధ్య మిశ్రా సలహాలు

తల్లి కడుపులో మరొక ప్రాణం రూపుదిద్దుకుంటోందని, తన శరీరం సాధించిన అత్యంత గొప్ప విజయం ఇదేనని సమంత ఆనందం వ్యక్తం చేశారు. బెంగళూరు మిలాన్ ఫెర్టిలిటీ సెంటర్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సంధ్య మిశ్రా మాట్లాడుతూ, గర్భధారణ సమయంలో తగిన వ్యాయామాలు చేయడం వల్ల తల్లికి, బిడ్డకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.

గర్భధారణలో వ్యాయామం.. నిపుణులు ఏమంటున్నారంటే?

క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు పెరగడం (ప్రీ-ఎక్లాంప్సియా), గర్భధారణ మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్), తీవ్రమైన నడుము నొప్పి వంటి సమస్యల ముప్పు తగ్గుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యం మెరుగై సుఖ ప్రసవానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి.

అలాంటప్పుడు విశ్రాంతి తప్పనిసరి

బరువు కూడా అదుపులో ఉంటుందని డాక్టర్ సంధ్య వివరించారు. వ్యాయామం చేసే సమయంలో కళ్లు తిరగడం, తీవ్రమైన అలసట లేదా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే నిలిపివేసి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe