Sandeep Reddy Vanga About Prabhas Spirit Movie: తెలుగు సినీ పరిశ్రమ నుంచి వెళ్లి బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరోసారి వార్తల్లో నిలిచారు. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాలతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఆయన, తన సినిమాల్లో ఉండే తీవ్రత, అనూహ్య మలుపులపై మనసు విప్పి మాట్లాడారు.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' చిత్రాన్ని రూపొందిస్తున్న సందీప్ రెడ్డి వంగా.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలే తన కథలకు బలమని వెల్లడించారు.
ఊహించని మలుపులే నా బలం: సందీప్ వంగా
ప్రతి సినిమాతో ప్రేక్షకులను విస్మయానికి గురిచేయడం వెనుక ఉన్న రహస్యాన్ని సందీప్ రెడ్డి వంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు ఫరీదూన్ షహర్యార్ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ తన రచనా శైలిని ఆయన వివరించారు.
"నేను కావాలని ఏదీ చేయను కానీ, దశాబ్దాలుగా సినిమాలు చూస్తున్న ప్రేక్షకుల దృష్టిని ఎలా ఆకర్షించాలనే ఆలోచిస్తాను. తెరపై ఏదో ఒక కొత్తదనం, ఆశ్చర్యపరిచే అంశం ఉండాలి. సినిమాలో కచ్చితంగా షాక్ వాల్యూ ఉండాలని నేను నమ్ముతాను. అయితే దీనికోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయను, నా రచనా ప్రక్రియలోనే అది సహజంగా కలిసిపోయింది. ఇప్పుడు నా నాలుగో సినిమా (స్పిరిట్) చేస్తున్నప్పుడు కూడా కొన్ని సన్నివేశాలు చూసి నేనే ఆశ్చర్యపోతున్నాను" అని సందీప్ రెడ్డి పేర్కొన్నారు.
వివాదాలు.. వసూళ్ల సునామీ
2017లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయమయ్యారు. తెలుగులో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమాను 2019లో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, పురుషాధిక్యత, హింసను చూపించిన తీరుపై తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి.
{{/usCountry}}2017లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయమయ్యారు. తెలుగులో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమాను 2019లో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, పురుషాధిక్యత, హింసను చూపించిన తీరుపై తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి.
{{/usCountry}}2023లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో సందీప్ తెరకెక్కించిన 'యానిమల్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం రేపింది.
జావేద్ అక్తర్, కంగనా రనౌత్ వంటి సినీ ప్రముఖులు యానిమల్ సినిమాలోని హింస, స్త్రీ ద్వేషపూరిత ధోరణులపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. తండ్రిపై హత్యాయత్నం జరిగిన తర్వాత ప్రతీకారంతో రగిలిపోయే రణ్‌విజయ్ సింగ్ కథగా వచ్చిన ఈ చిత్రం విమర్శలను తట్టుకుని బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ ఎప్పుడంటే?
సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం తన నాలుగో చిత్రం 'స్పిరిట్' పనుల్లో నిమగ్నమయ్యారు. రెబల్ స్టార్ ప్రభాస్, 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రి జంటగా నటిస్తున్న ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన, ఐశ్వర్య దేశాయ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి, అవమాన భారంతో రగిలిపోయే ఓ పోలీస్ అధికారి చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది.
స్పిరిట్ రికార్డులు
వాస్తవానికి 2027 మార్చిలో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని, తాజా షెడ్యూల్ ప్రకారం 2027 అక్టోబర్ 29న థియేటర్లలోకి తీసుకురానున్నారు. సందీప్ మార్క్ షాక్ వాల్యూతో ప్రభాస్ కటౌట్ తోడైతే బాక్సాఫీస్ వద్ద స్పిరిట్ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ABOUT THE AUTHOR
చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.