...
...
Next Story

Sandeep Reddy Review: రణబాలిపై సందీప్ రెడ్డి వంగా రివ్యూ- విజయ్, రష్మిక కెమిస్ట్రీకి మించిన బంధం, చరిత్రలో చెప్పని కథ!

Sandeep Reddy Vanga Review On Ranabaali: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా చిత్రం రణబాలిపై సందీప్ రెడ్డి వంగా రివ్యూ ఇచ్చాడు. పాఠ్యపుస్తకాల్లో దాచిపెట్టిన నిజమైన చరిత్రను దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు.ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Published on: Oct 17, 2026, 11:57:27 IST
Advertisement

Sandeep Reddy Vanga Review On Ranabaali: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. గతంలో 'గీత గోవిందం' తరహాలో ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ తెరపై మ్యాజిక్ చేయడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.

చరిత్రలో వెలుగుచూడని చారిత్రక ఘట్టం ఆధారంగా

రణబాలిపై సందీప్ రెడ్డి వంగా రివ్యూ- విజయ్, రష్మిక కెమిస్ట్రీకి మించిన బంధం, చరిత్రలో చెప్పని కథ!
రణబాలిపై సందీప్ రెడ్డి వంగా రివ్యూ- విజయ్, రష్మిక కెమిస్ట్రీకి మించిన బంధం, చరిత్రలో చెప్పని కథ!

చరిత్రలో పెద్దగా వెలుగుచూడని ఒక చారిత్రక ఘట్టం ఆధారంగా తెరకెక్కిన రణబాలి సినిమాపై సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన రివ్యూ, దానికి సంబంధించి చేసిన పోస్ట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

విజయ్ నటన.. రష్మికతో ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతం!

రణబాలి సినిమాలో విజయ్ దేవరకొండ నటనపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసల వర్షం కురిపించారు. విజయ్ తన పాత్రలో చూపించిన ఇంటెన్సిటీ, నటనలోని పరిణతి ఆకట్టుకున్నాయని తెలిపారు.

కెమిస్ట్రీకి మించిన బంధం ఉంది

"గాయ్స్.. విజయ్ దేవరకొండ అద్భుతమైన నటన కోసం ప్రతి ఒక్కరూ 'రణబాలి' సినిమా చూడాల్సిందే. విజయ్, రష్మికల మధ్య ఉన్నది కేవలం ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాదు, దానికి మించిన బంధం ఉంది. రష్మిక పోషించిన జయమ్మ పాత్ర చాలా సహజంగా ఉంది" అని సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా పొగిడారు.

పాఠ్యపుస్తకాల్లో లేని చరిత్రను చూపించారు!

పాఠశాల పుస్తకాల్లో చెప్పని ఒక నిజమైన చారిత్రక అంశాన్ని దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ సినిమా ద్వారా వెలికితీశారని సందీప్ అభినందించారు. "హిస్టరీపై రాహుల్ చూపించిన ఆసక్తి, తీసుకున్న జాగ్రత్తలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మన పాఠ్యపుస్తకాల్లో చూపించడానికి ఇష్టపడని ఒక ముఖ్యమైన చారిత్రక ఘట్టాన్ని ఈ చిత్రం ద్వారా అందించారు" అని సందీప్ కొనియాడారు.

టాక్సీవాలా తర్వాత

ఈ సినిమాకు అజయ్-అతుల్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం కథకు ప్రధాన బలంగా నిలిచాయని సందీప్ అభిప్రాయపడ్డారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలుగా రూపొందించిన ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి-సిరీస్ ఫిలిమ్స్ సమర్పించాయి.

రణబాలి కలెక్షన్స్

ప్రస్తుతం అన్ని సెంటర్లలో మంచి ఆక్యుపెన్సీతో ప్రదర్శితమవుతున్న రణబాలి చిత్రం విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం నేటి నుంచి థియేటర్ల సందర్శన చేపట్టనుంది. ఇదిలా ఉంటే, తొలి రోజున వరల్డ్ వైడ్‌గా రణబాలి సినిమాకు రూ. 16 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks