హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. సంతాన ప్రాప్తిరస్తు చిత్రానికి డైరెక్టర్ సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు.
నవంబర్ 14న రిలీజ్

రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఇవాళ (అక్టోబర్27) హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సంతాన ప్రాప్తిరస్తు నుంచి తెలుసా నీ కోసమే లిరికల్ సాంగ్‌ను అతిథిగా హాజరైన ప్రొడ్యూసర్ సురేష్ బాబు రిలీజ్ చేశారు.
తెలుసా నీ కోసమే సాంగ్ లాంచ్ ఈవెంట్
"ఆయ్", "సేవ్ ది టైగర్స్" వంటి సక్సెస్‍ఫుల్ ప్రాజెక్ట్స్‌కు వర్క్ చేసిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ 'తెలుసా నీ కోసమే..' పాటను బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా.. అర్మాన్ మాలిక్ మనసుకు హత్తుకునేలా పాడారు. ఈ సందర్భంగా సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడుతూ.. "నేను ఇటీవల వరుసగా ఎంటర్‌టైనింగ్ మూవీస్ చేస్తూ వస్తున్నాను. ఆయ్, సేవ్ ది టైగర్స్, త్రీ రోజెస్.. ఇలాంటి ఎంటర్‌టైనర్స్ చేస్తున్న టైమ్‌లో శ్రీధర్ గారు పిలిచి "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా చూడమన్నారు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయమని అడిగారు" అని అన్నారు.
ఆర్గానిక్ ఫీలింగ్ కలిగింది
"ఈ మూవీ చూస్తున్నంతసేపు ఎంతో ఆర్గానిక్ ఫీల్ కలిగింది. అలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్న క్రమంలోనే తెలుసా నీ కోసమే కంపోజ్ చేశాం. బీజీఎమ్ నుంచి వచ్చిన సాంగ్ ఇది. శ్రీమణి బ్యూటిఫుల్‌గా రాశాడు. అర్మాన్ బాగా పాడాడు. నా మ్యూజిక్ టీమ్ అందరికీ థ్యాంక్స్" అని సంగీత దర్శకుడు అజయ్ అరసాడ తెలిపారు.
{{/usCountry}}"ఈ మూవీ చూస్తున్నంతసేపు ఎంతో ఆర్గానిక్ ఫీల్ కలిగింది. అలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్న క్రమంలోనే తెలుసా నీ కోసమే కంపోజ్ చేశాం. బీజీఎమ్ నుంచి వచ్చిన సాంగ్ ఇది. శ్రీమణి బ్యూటిఫుల్‌గా రాశాడు. అర్మాన్ బాగా పాడాడు. నా మ్యూజిక్ టీమ్ అందరికీ థ్యాంక్స్" అని సంగీత దర్శకుడు అజయ్ అరసాడ తెలిపారు.
{{/usCountry}}డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. "ఈ రోజు సమాజంలో కపుల్స్ ఎదుర్కొంటున్న సమస్య నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. అయితే ఎక్కడా సందేశాలు ఇచ్చేలా సినిమా ఉండదు. ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో లైటర్ వేలోనే మూవీ వెళ్తుంటుంది" అని అన్నారు.
వాళ్లు ఎలా కనిపిస్తారో అలా
"మా ప్రొడ్యూసర్స్ శ్రీధర్ గారు, నిర్వి హరిప్రసాద్ గారు మూవీకి కావాల్సిన ఆర్టిస్టులతో పాటు ప్రొడక్షన్ పరంగా కావాల్సినవన్నీ ఇచ్చి సపోర్ట్ చేశారు. మా హీరో విక్రాంత్ మూవీలో కంటే బయటే అందంగా ఉంటాడు. ఎందుకంటే మా సినిమాలో అతను సాప్ట్‌వేర్ ఇంజినీర్. వాళ్లు ఎలా కనిపిస్తారో అలా విక్రాంత్ మేకోవర్ ఉంటుంది. విక్రాంత్ మాకు బాగా సపోర్ట్ చేశాడు" అని సంజీవ్ రెడ్డి తెలిపారు.
"తెలుసా నీకోసమే పాటను అజయ్ గారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నుంచి సాంగ్‌లా కంపోజ్ చేసి తీసుకొచ్చారు. హీరో హీరోయిన్స్ మధ్య ఉండే కెమిస్ట్రీ ఈ పాటలో బాగా రెఫ్లెక్ట్ అవుతుంది. సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఇంత బాగా వచ్చేందుకు ప్యాషనేట్‌గా వర్క్ చేసిన నా టీమ్ అందరికీ థ్యాంక్స్" అని డైరెక్టర్ సంజీవ్ రెడ్డి పేర్కొన్నారు.