...
...
Next Story

OTT Horror: ఏకంగా 3 ఓటీటీల్లోకి వచ్చిన హారర్ థ్రిల్లర్- వందల ఏళ్ల నాటి శాపం, చిన్నారిని వెంటాడే దుష్టశక్తి-ఇక్కడ చూడండి!

Horror Thriller Satan The Dark OTT Streaming On 3 Platforms: ఓటీటీలోకి ఇటీవల స్ట్రీమింగ్‌కు వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ సతన్ ది డార్క్. వందల ఏళ్ల నాటి శాపంతో తెరకెక్కిన సతన్ ది డార్క్ ఏకంగా 3 ఓటీటీల్లో రిలీజ్ అయింది. క్షుద్రపూజల నేపథ్యంలో సాగే సతన్ ది డార్క్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ చూద్దాం.

Published on: May 22, 2026, 13:56:17 IST
Advertisement

OTT Horror Thriller Satan The Dark Streaming 3 Platforms: డిజిటల్ స్ట్రీమింగ్ వేదికలపై హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అర్ధరాత్రి పూట లైట్లు ఆపేసి ఒళ్లు గగుర్పొడిచే దెయ్యం కథలను చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా డబ్బింగ్ హారర్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది.

ఓటీటీ ఎంట్రీ

ఏకంగా 3 ఓటీటీల్లోకి వచ్చిన హారర్ థ్రిల్లర్- వందల ఏళ్ల నాటి శాపం, చిన్నారిని వెంటాడే దుష్టశక్తి-ఇక్కడ చూడండి!
ఏకంగా 3 ఓటీటీల్లోకి వచ్చిన హారర్ థ్రిల్లర్- వందల ఏళ్ల నాటి శాపం, చిన్నారిని వెంటాడే దుష్టశక్తి-ఇక్కడ చూడండి!

అలాంటి హారర్ లవర్స్ కోసం కోలీవుడ్ నుంచి మరో విభిన్నమైన మిస్టరీ హారర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 27, 2026న థియేటర్లలో విడుదలైన తమిళ హారర్ చిత్రం 'సతన్: ది డార్క్' (Satan: The Dark) ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేస్తోంది. థియేటర్లలో విడుదలైన ఆరు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది.

ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి క్షుద్రపూజలు

దర్శకుడు మణికంఠన్ రామలింగం తెరకెక్కించిన సతన్ ది డార్క్ సినిమా కథ రెండు విభిన్న కాలాల (టైమ్‌లైన్స్) నేపథ్యంలో సాగుతుంది. వందల ఏళ్ల నాటి ఒక భయంకరమైన క్షుద్రపూజ, దాని చుట్టూ అల్లుకున్న శాపం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన సాగుతున్న రోజుల్లో హస్తినాపురం అనే కొండ ప్రాంతంలో కొందరు రహస్యంగా ఒక క్షుద్రపూజ చేస్తారు. ఆ మంత్రతంత్రాల ప్రక్రియ ఊహించని విధంగా వికటించి, ఒక దుష్టశక్తి పంజరం నుంచి బయటకు వస్తుంది. చిన్నారిని సైతం వదలకుండా తరతరాలను వెంటాడే ఆ భయంకర దుష్టశక్తి కథే ఈ సినిమా.

వర్తమానంలో సైతాన్ అరాచకం

ఆ పసి ప్రాణాన్ని కాపాడుకోవడానికి తల్లితోపాటు చుట్టుపక్కల వారు చేసిన పోరాటం ఏమిటి? వందల ఏళ్ల నాటి ఆ శాపాన్ని వారు ఎలా బద్దలు కొట్టారు? చిన్నారినే ఆ దుష్టశక్తి ఎందుకు వెంటాడింది? అనేదే మిగిలిన కథాంశం. మొదట ఈ సినిమాకు 'ది బ్లాక్ బైబిల్' అనే పేరు అనుకున్నప్పటికీ, ఆ తర్వాత 'సతన్: ది డార్క్'గా మార్చారు.

అమెజాన్ ప్రైమ్‌లో మొదటగా

ఇలా హారర్, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో భయపెట్టేలా తెరకెక్కిన సతన్ ది డార్క్ ఏకంగా 3 ఓటీటీల్లోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో మొదటగా సతన్ ది డార్క్ ఓటీటీ రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో మే 8 నుంచి తమిళంలో సతన్ ది డార్క్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

3 ఓటీటీల్లో స్ట్రీమింగ్

తాజాగా మే 20 నుంచి మరో రెండు ఓటీటీల్లోకి వచ్చింది హారర్ థ్రిల్లర్ సతన్ ది డార్క్. ఆహా తమిళం, టెంట్‌కొట్టా వంటి రెండు ప్లాట్‌ఫామ్స్‌లలో మే 20న సతన్ ది డార్క్ ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చింది. దీంతో ప్రస్తుతం 3 ఓటీటీల్లో సతన్ ది డార్క్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి, హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఈ 3 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో సతన్ ది డార్క్ మూవీని ఎంచక్కా చూసేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe