Save The Tigers Season 3 OTT Trailer Released: సూపర్ హిట్ తెలుగు ఓటీటీ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’కి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఇప్పటికే సేవ్ ది టైగర్స్ నుంచి వచ్చిన రెండు సీజన్లు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. సేవ్ ది టైగర్స్ 3 ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.
సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్ రిలీజ్

సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా, వినోదభరితంగా సాగింది. ఈ సీజన్ 3లో ఇంద్రుడిగా స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు గత రెండు సీజన్లలో భార్యల వల్ల నలిగే భర్తలను చూపించారు. కానీ, ఈసారి సేవ్ ది టైగర్స్ సీజన్ 3లో మరో లోకంలో భార్యలను ఏమార్చి జల్సాలు చేసుకునే భర్తలను చూపించారు.
సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్‌లోకి వెళితే.. ‘ఎవరన్నా.. చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి మనకు ఇన్ని అబద్దాలు చెప్పింది.. పెళ్లి అంటే పండు వెన్నెల, పెళ్లాం అంటే నిండు పున్నమి’ అని రాహుల్ పాత్రలో అభినవ్ గోమటం చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ఓపెన్ అవుతుంది.
పెళ్లి జీవితం గురించి
బార్‌లో రాహుల్ (అభినవ్ గోమటం), విక్రమ్ (కృష్ణ చైతన్య), ఘంటా రవి (ప్రియదర్శి) ముగ్గురూ కలిసి పెళ్లి గురించి, జీవితం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అన్నడో నాకు దొరికితేనా? అని విక్రమ్ (కృష్ణ చైతన్య) అనడంతో స్వర్గంలో ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ ప్రత్యక్షం అవుతారు.
అక్కడి నుంచి కథ వేరే ట్రాక్ ఎక్కుతుంది. ఘంటా రవి ఎమ్మెల్యేగా ఎదుగుతాడు. రాహుల్ గొప్ప స్క్రీన్ ప్లే రైటర్ అవుతారు. విక్రమ్ ఓ పెద్ద కంపెనీకి సీఈవో అవుతారు. అసలు తమ జీవితంలో ఏం జరుగుతుందో తమకే అర్థం కాకుండా ఉంటుంది. రెండో ప్రపంచంలో ఈ మార్పులు అన్నీ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది.
మగాళ్ల కు కనెక్ట్ అయ్యేలా
{{/usCountry}}అక్కడి నుంచి కథ వేరే ట్రాక్ ఎక్కుతుంది. ఘంటా రవి ఎమ్మెల్యేగా ఎదుగుతాడు. రాహుల్ గొప్ప స్క్రీన్ ప్లే రైటర్ అవుతారు. విక్రమ్ ఓ పెద్ద కంపెనీకి సీఈవో అవుతారు. అసలు తమ జీవితంలో ఏం జరుగుతుందో తమకే అర్థం కాకుండా ఉంటుంది. రెండో ప్రపంచంలో ఈ మార్పులు అన్నీ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది.
మగాళ్ల కు కనెక్ట్ అయ్యేలా
{{/usCountry}}ఫుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఈ మూడో సీజన్‌ను నెక్ట్స్ లెవెల్లో రూపొందించారని సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఇక ట్రైలర్ చివర్లో వెన్నెల కిషోర్ చెప్పిన గాలికిపోయే కంప డైలాగ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. విడాకులు తీసుకున్నప్పుడు భర్తను భార్య భరణం అడిగినట్లే భార్యను భర్త భరణం అడిగితే తప్పేంటీ అని కోర్టులో కృష్ణ చైతన్య చెప్పే డైలాగ్ మగాళ్లందరికి కనెక్ట్ అయ్యేలా ఉంది.
సరికొత్త కాన్సెప్ట్‌తో సేవ్ ది టైగర్స్ సీజన్ 3ని తెరకెక్కించినట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది. సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్ కాస్త కన్ఫ్యూజింగ్‌గానే ఉన్నా కామెడీ మాత్రం కన్ఫామ్‌గా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. ఫాంటసీ అంశాలతో రిలేషన్ షిప్ డ్రామాను మిక్స్ చేసి మూడో సీజన్‌ను వినోదభరితంగా తెరకెక్కించారు. అలాగే, ఈసారి కథ రెండు విభిన్న ప్రపంచాలు, మధ్యలో ఇంద్రుడు చుట్టూ జరుగుతుందని అర్థం అవుతోంది.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, జబర్దస్త్ రోహిణి ఇలా అందరూ తమ తమ పాత్రలతో మరోసారి ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు సిద్దంగా ఉన్నారు. సేవ్ ది టైగర్స్ సీజన్ 3కి ప్రదీప్ అద్వైతం, మహి వి. రాఘవ్ క్రియేటర్స్‌గా ఉండగా.. శ్రీరామ్ ఎరగం దర్శకత్వం వహించారు. శివ మేక, సాహితీ చింతలపూడి నిర్మాతలుగా ఉన్నారు.
ఇక ఎప్పటిలాగే జియో హాట్‌స్టార్‌లోనే సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఓటీటీ రిలీజ్ కానుంది. జూన్ 19 నుంచి హాట్‌స్టార్‌లో సేవ్ ది టైగర్స్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
మరోసారి జియో హాట్‌స్టార్ ఓటీటీ వేదికపై నవ్వులు పూయించేందుకు 3వ సీజన్‌తో వచ్చేయనుంది సేవ్ ది టైగర్స్ సిరీస్.