Suriya Scene 1st Day Worldwide Collection: కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద తన తిరుగులేని హవాను కొనసాగిస్తున్నారు. మలయాళంలో ‘ఆవేశం’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు జితు మాధవన్ తమిళంలో తొలిసారి తెరకెక్కించిన ‘సీన్’ చిత్రం దీపావళి పండగ రేసులో బాక్సాఫీస్ విజేతగా నిలిచే సంకేతాలను ఇస్తోంది.
తొలిరోజే రూ. 19 కోట్లకు పైగా రాబడి

సూర్యతోపాటు నజ్రియా నజీమ్, నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీన్ సినిమా నవంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. బాక్సాఫీస్ వర్గాల గణాంకాల ప్రకారం, 'సీన్' చిత్రం మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ. 19.15 కోట్ల నికర వసూళ్లను (నెట్ కలెక్షన్స్) రాబట్టింది.
ఇందులో తమిళ వెర్షన్ నుంచే రూ. 16.15 కోట్లు రాగా, తెలుగు డబ్బింగ్ రూపంలో రూ. 3 కోట్లు వచ్చాయి. ఇక విదేశీ మార్కెట్‌లోనూ ఈ చిత్రం జోరు చూపిస్తూ తొలిరోజే రూ. 12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీపావళి సుదీర్ఘ సెలవులు తోడవడంతో రాబోయే రోజుల్లో ఈ వసూళ్ల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
సొంత రికార్డులను తిరగరాసిన సూర్య
ఈ ఏడాది సూర్య ఖాతాలో వరుస విజయాలు చేరుతున్నాయి. మే నెలలో వచ్చిన ‘కరుప్పు’ చిత్రం తొలి రోజున రూ. 15.50 కోట్లు (తమిళం రూ. 13.10 కోట్లు, తెలుగు రూ. 2.40 కోట్లు) సాధించగా, ఆ తర్వాత ఆగస్టులో విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తొలిరోజు రూ. 15.35 కోట్లు వసూలు చేసింది.
ఈ రెండు సినిమాల ఓపెనింగ్స్ కంటే ‘సీన్’ ఎక్కువ వసూళ్లను సాధించి సూర్య కెరీర్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ ‘జైలర్ 2’ (రూ. 59.70 కోట్లు), విజయ్ ‘జన నాయగన్’ (రూ. 42.70 కోట్లు) తర్వాత అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూడో చిత్రంగా ‘సీన్’ నిలిచింది.
హ్యాట్రిక్ దిశగా వేగంగా అడుగులు
{{/usCountry}}ఈ రెండు సినిమాల ఓపెనింగ్స్ కంటే ‘సీన్’ ఎక్కువ వసూళ్లను సాధించి సూర్య కెరీర్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ ‘జైలర్ 2’ (రూ. 59.70 కోట్లు), విజయ్ ‘జన నాయగన్’ (రూ. 42.70 కోట్లు) తర్వాత అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూడో చిత్రంగా ‘సీన్’ నిలిచింది.
హ్యాట్రిక్ దిశగా వేగంగా అడుగులు
{{/usCountry}}గతంలో సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రం రూ. 310.12 కోట్ల లైఫ్‌టైమ్ వసూళ్లతో ఆయన కెరీర్‌లోనే ఆల్-టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అలాగే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రూ. 209.46 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం ‘సీన్’ పొందుతున్న పాజిటివ్ టాక్ ఆధారంగా ఈ సినిమా కూడా రూ. 200 కోట్ల క్లబ్‌లో సులువుగా చేరుతుందని ఇండస్ట్రీ భావిస్తోంది.
ఈ లెక్కన ఒకే ఏడాదిలో వరుసగా హిట్స్ సాధించి సూర్య హాట్రిక్ కొట్టినట్లు అవుతుంది. అలాగే, ఇండియాలో సీన్ సినిమాకు రూ. 22.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. వరల్డ్ వైడ్‌గా తొలి రోజున రూ. 34.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. ఓవర్సీస్‌లో రూ. 12 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
ఉత్కంఠ రేకెత్తించే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్
2D ఎంటర్‌టైన్‌మెంట్స్, దగరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఆనందరాజ్, లాల్, లాల్‌ప్రియన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఒక పోలీస్ ఆఫీసర్ తాను ఇదివరకే పూర్తి చేసిన ఒక కేసును అనుకోని పరిస్థితుల్లో మళ్లీ విచారించాల్సి రావడం, తన రహస్యం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో కాంట్రాక్ట్ కిల్లర్ వెంటపడే క్రమంలో సాగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఈ సీన్ సినిమా కథాంశం.
ఊహించని క్యామియో పాత్రలు
సుశిన్ శ్యామ్ అందించిన నేపథ్య సంగీతం సీన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కోలీవుడ్, మాలీవుడ్ నటుల ఊహించని క్యామియో పాత్రలు థియేటర్లలో ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తున్నాయి.