Ramya Krishnan Second Love OTT Release Today: 'బాహుబలి' చిత్రంలో శివగామి పాత్రతో దేశవ్యాప్తంగా అశేష ప్రజాదరణ పొందిన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ బుల్లితెరపై, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై సరికొత్త ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
రమ్యకృష్ణ హోస్ట్‌గా

గతంలో కొన్ని టాక్ షోలు, డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించిన రమ్యకృష్ణ ఇప్పుడు సరికొత్త ఓటీటీ రియాలిటీ షోతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. తమిళ్ డిజిటల్ రంగంలోనే మొదటిసారిగా వస్తున్న వినూత్న డేటింగ్ రియాలిటీ షో 'సెకండ్ లవ్' (Second Love)కు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించారు.
ఈ క్రేజీ షో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar) లో ఓటీటీ రిలీజ్ అయింది. జూలై 13 అంటే నేటి నుంచే జియో హాట్‌స్టార్‌లో సెకండ్ లవ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి ఐదు భాషల్లో జియో హాట్‌స్టార్ ఓటీటీలోకి డేటింగ్ రియాలిటీ షో సెకండ్ లవ్ అందుబాటులోకి వచ్చేసింది.
సరికొత్త కాన్సెప్ట్‌తో 'సెకండ్ లవ్'
దక్షిణాదిలో ఇప్పటివరకు ఎన్నో రియాలిటీ షోలు వచ్చినా, డేటింగ్ జోనర్‌లో ప్రాంతీయ భాషల్లో పెద్దగా షోలు రాలేదు. ఈ లోటును భర్తీ చేస్తూ జియో హాట్‌స్టార్ సౌత్ ప్రేక్షకుల కోసం ఈ సరికొత్త కాన్సెప్ట్‌ను తీసుకువస్తోంది.
జీవితంలో ఒకసారి ప్రేమ వైఫల్యాన్ని లేదా ఒంటరితనాన్ని అనుభవించి, మళ్లీ తోడు కోసం వెతుక్కునే వారికి ఈ ఓటీటీ షో ఒక చక్కని వేదిక కానుంది. ప్రేమలో ప్రతి ఒక్కరికీ రెండో అవకాశం లభించాలనే బలమైన నమ్మకంతో ఈ రియాలిటీ సిరీస్‌ను రూపొందించారు.
{{/usCountry}}జీవితంలో ఒకసారి ప్రేమ వైఫల్యాన్ని లేదా ఒంటరితనాన్ని అనుభవించి, మళ్లీ తోడు కోసం వెతుక్కునే వారికి ఈ ఓటీటీ షో ఒక చక్కని వేదిక కానుంది. ప్రేమలో ప్రతి ఒక్కరికీ రెండో అవకాశం లభించాలనే బలమైన నమ్మకంతో ఈ రియాలిటీ సిరీస్‌ను రూపొందించారు.
{{/usCountry}}ఈ షోకి సంబంధించిన మొదటి ప్రోమోను ఒక కలర్‌ఫుల్ మ్యూజిక్ వీడియో రూపంలో ఇదివరకే విడుదల చేశారు. ఇందులో రమ్యకృష్ణ తనదైన స్టైల్, గ్రేస్‌తో ఎంతో హుషారుగా కనిపిస్తూ షో థీమ్‌ను పరిచయం చేశారు. ప్రముఖ నటి శ్రుతికా అర్జున్ ఈ ప్రోమోలో క్యూపిడ్ (ప్రేమ దేవత) పాత్రలో మెరిసి అలరించారు.
సరికొత్తగా ఆధునిక బంధాలు
గతాన్ని మర్చిపోయి సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే వ్యక్తులకు ఈ షో ద్వారా భాగస్వామిని ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. భావోద్వేగాలు, ఆశలు, హాస్యం, లోతైన బంధాల కలయికగా ఈ సిరీస్ సాగనుంది. నేటి తరం ఆలోచనలకు అద్దం పడుతూ, ఆధునిక బంధాల వెనుక ఉండే సరికొత్త కోణాన్ని, మళ్లీ మనసు విప్పి ప్రేమించే ధైర్యాన్ని ఈ షోలో చూపించనున్నారు.
"ప్రేమకు ఎలాంటి కారణాలు అవసరం లేదు. ఇది ప్రేమకు సంబంధించిన సరికొత్త సీజన్" అని రమ్యకృష్ణ పేర్కొన్నారు. ప్రోమో చివరలో రమ్యకృష్ణ చెప్పిన ఈ డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ ఒక్క లైన్‌తోనే షో ఉద్దేశం ఏంటో స్పష్టంగా అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
జియో హాట్‌స్టార్, బనిజయ్ ఏషియా క్రేజీ కాంబో
తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయాన్ని అందుకున్న 'బిగ్ బాస్' వంటి మెగా రియాలిటీ షోలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'బనిజయ్ ఏషియా' (Banijay Asia), జియో హాట్‌స్టార్ సంస్థలు సంయుక్తంగా ఈ 'సెకండ్ లవ్' ఓటీటీ షోను నిర్మిస్తున్నాయి.
నాన్-స్క్రిప్టెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో ఇప్పటికే ట్రెండ్ సెట్ చేసిన ఈ రెండు సంస్థలు కలిసి వస్తుండటంతో ఈ డేటింగ్ షోపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా పెరిగాయి.
సెకండ్ లవ్ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్
ఇవాళ జియో హాట్‌స్టార్‌లో సెకండ్ లవ్ షో నుంచి 'ఏ లీప్ ఆఫ్ ఫెయిత్' టైటిల్‌తో ఫస్ట్ ఎపిసోడ్ ఓటీటీ రిలీజ్ అయింది. అందులో కొన్ని జంటలను తీసుకొచ్చి వారి ప్రేమ ప్రయాణం గురించి చెప్పించారు. వాటికి గురించి, ప్రేమ గురించి చెబుతూ రమ్యకృష్ణ తనదైన స్టైల్‌లో హోస్ట్ చేశారు. మరిన్ని ఎపిసోడ్స్‌ను రోజువారీగా అప్‌లోడ్ చేస్తారని తెలుస్తోంది.