Bold Psychological Horror Thriller Seducer OTT Release Telugu: అర్ధరాత్రి పూట లైట్లు ఆపేసి ఒక మంచి హారర్ సినిమా చూస్తూ థ్రిల్ అవ్వాలనుకునే ఓటీటీ ప్రియులకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. అంతర్జాతీయ స్థాయిలో భయాన్ని పరిచయం చేస్తూ గతంలో థియేటర్లలో అలరించిన హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
మరో టైటిల్‌తో

ఆ సినిమానే 'సెడ్యూసర్'. బోల్డ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన సెడ్యూసర్ సినిమాను కొన్ని ఇంటర్నేషన్ల్ ప్రాంతాల్లో 'సక్యుబస్' (Succubus) అనే టైటిల్‌తో విడుదల చేశారు. సక్యుబస్ అంటే కామ పిశాచి లేదా ఆడ దెయ్యం అనే అర్థాలు వస్తాయి. అలాంటి ఈ సినిమా భారతీయ ఓటీటీ వీక్షకులను భయపెట్టడానికి సుమారు 2 ఏళ్ల తర్వాత వచ్చింది.
ఈ సినిమా కథాంశం అంతా ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. కొంతమంది యువకులు సరదాగా గడపడానికి ఒక నిర్మానుష్య పల్లెటూరిలోకి అడుగుపెడతారు. అయితే వారు అనుకోకుండా ఒక ప్రాణాంతకమైన, రూపాలు మార్చే వింత కామ పిశాచి బారిన పడతారు.
లోబర్చుకునే కామ పిశాచి
మనుషుల మనసుల్లో ఉండే శృంగార కోరికలను ఆసరాగా చేసుకుని ఆ కామ పిశాచి వారిని లోబర్చుకోవడం మొదలుపెడుతుంది. అంతేకాదు, ఆ వ్యక్తుల్లో ఉండే అత్యంత చీకటి కోణాలను, క్రూరమైన ఆలోచనలను అది బయటకు తీస్తుంది. శృంగార కోరికలతో రెచ్చగొట్టి మగాళ్లను తన వశం చేసుకుంటుంది ఆ కామ పిశాచి.
అలా వశం చేసుకున్నాక ఏం జరిగింది, ఆ కామ పిశాచి నుంచి ఎలా ప్రాణాలతో బయటపడ్డారు? అసలు ఆ గ్రామం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనే ట్విస్టులతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అడల్ట్ అండ్ జంప్ స్కేర్స్ వంటి హారర్ సీన్లతో థ్రిల్లింగ్‌గా సెడ్యూసర్ సినిమాను తెరకెక్కించారు మేకర్స్.
క్రిస్ప్ రన్‌టైమ్.. వీకెండ్‌కు పర్ఫెక్ట్ చాయిస్
{{/usCountry}}అలా వశం చేసుకున్నాక ఏం జరిగింది, ఆ కామ పిశాచి నుంచి ఎలా ప్రాణాలతో బయటపడ్డారు? అసలు ఆ గ్రామం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనే ట్విస్టులతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అడల్ట్ అండ్ జంప్ స్కేర్స్ వంటి హారర్ సీన్లతో థ్రిల్లింగ్‌గా సెడ్యూసర్ సినిమాను తెరకెక్కించారు మేకర్స్.
క్రిస్ప్ రన్‌టైమ్.. వీకెండ్‌కు పర్ఫెక్ట్ చాయిస్
{{/usCountry}}చాలా హారర్ సినిమాలు సాగతీత లేకుండా ఉంటేనే ప్రేక్షకులకు ఆ భయం, థ్రిల్ కలుగుతాయి. ఈ విషయాన్ని దర్శకుడు బాగా గుర్తుంచుకుని సినిమాను ఎక్కడా ల్యాగ్ లేకుండా తెరకెక్కించారు. ఈ సినిమా రన్‌టైమ్ కేవలం 1 గంట 32 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అంటే సరిగ్గా 92 నిమిషాల్లో అనవసరమైన డ్రామా ఏమీ లేకుండా, పాయింట్ టు పాయింట్ ప్రేక్షకులను భయపెట్టడంలో ఈ చిత్రం సక్సెస్ అయింది.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
సైకలాజికల్ అండ్ బోల్డ్ హారర్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారికి, ముఖ్యంగా రాత్రిపూట అడల్ట్ కంటెంట్‌తోపాటు గగుర్పాటు కలిగించే సీన్లు చూడాలనుకునే వారికి సెడ్యూసర్ మంచి ఛాయిస్. ఇలాంటి సెడ్యూసర్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో సెడ్యూసర్ ఓటీటీ రిలీజ్ అయింది.
2024లో తెరకెక్కిన సెడ్యూసర్ మే 28 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంటే, దాదాపుగా రెండేళ్ల తర్వాత ఇండియాలో సెడ్యూసర్ ఓటీటీ రిలీజ్ అయింది. అది కూడా జియో హాట్‌స్టార్‌లో తమిళం, హిందీ, తెలుగు వంటి 3 భాషల్లో సెడ్యూసర్ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఈ సక్యుబస్ ఓటీటీ రిలీజ్ అయింది.