Serial Heroine Shilpa Shinde On Family Issues: 'భాబీజీ ఘర్ పరి హై' సీరియల్‌లో అంగూరీ భాబీగా దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొంది, బిగ్ బాస్ 11 విజేతగా నిలిచిన టీవీ హీరోయిన్ శిల్పా షిండే జీవితంలో ఊహించని విషాదం దాగుంది.
మానసిక క్షోభ అనుభవించినట్లు

తెరపై నిరంతరం చిరునవ్వులు చిందిస్తూ అందరినీ నవ్వించే ఈ నటి, నిజ జీవితంలో సొంత కుటుంబం నుంచే తీవ్ర మానసిక క్షోభ అనుభవించారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న 'లాక్ అప్' రియాలిటీ షోలో ఆమె వెల్లడించిన చేదు నిజాలు అభిమానులను, నెటిజన్లను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.
రాత్రి 11 గంటలకు ఇంట్లోంచి బయటకు..
ఈ ఓటీటీ షోలో నామినేషన్ల ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు తోటి పోటీదారు శివాంగి జోషి ఒత్తిడి మేరకు శిల్పా తన జీవితంలోని అతిపెద్ద రహస్యాన్ని బయటపెట్టాల్సి వచ్చింది. మూడేళ్ల క్రితం తనకు భుజానికి సర్జరీ జరిగిన సమయంలో తనను ఇంట్లోంచి కుటుంబ సభ్యులే గెంటేసినటువంటి దారుణ పరిస్థితులను శిల్పా గుర్తు చేసుకున్నారు.
ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు
తమ్ముడు తన భార్య మాటలు విని ఇంట్లో గొడవలు సృష్టించాడని, తమ్ముడి ప్రభావంలో పడ్డ తల్లి కూడా తనకు అండగా నిలవలేదని శిల్పా ఆవేదన వ్యక్తం చేశారు. భుజానికి కుట్లు కూడా విప్పని సమయంలో, సర్జరీ జరిగిన ఐదో రోజే రాత్రి 11 గంటలకు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి సొంత ఇల్లు వదిలి బయటకు వచ్చేసినట్లు తెలిపారు.
"కుటుంబమున్నా నేను అనాథనే"
తన సొంత మనుషులే తనను తీవ్రంగా వాడుకుని పక్కన పడేశారని శిల్పా ఆవేదన చెందారు. "చాలామందికి కుటుంబం ఉండదు. కానీ నాకు కుటుంబం ఉన్నా నేను అనాథగానే బతుకుతున్నాను. నేను ఏ సానుభూతి కోసం ఈ విషయాలు చెప్పడం లేదు" అని శిల్పా షిండే కన్నీళ్లు పెట్టుకున్నారు.
సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి
{{/usCountry}}తన సొంత మనుషులే తనను తీవ్రంగా వాడుకుని పక్కన పడేశారని శిల్పా ఆవేదన చెందారు. "చాలామందికి కుటుంబం ఉండదు. కానీ నాకు కుటుంబం ఉన్నా నేను అనాథగానే బతుకుతున్నాను. నేను ఏ సానుభూతి కోసం ఈ విషయాలు చెప్పడం లేదు" అని శిల్పా షిండే కన్నీళ్లు పెట్టుకున్నారు.
సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి
{{/usCountry}}ముంబైకి వచ్చిన ప్రతిసారీ హోటళ్లలో లేదా షెల్టర్ హోమ్‌లలో ఉంటున్నానని, ప్రశాంతత కోసం కర్జత్‌లోని నివాసానికి మారిపోయానని చెప్పారు. ముంబైలో హోటల్‌లో దిగినప్పుడు బంధువులు వచ్చారని అబద్ధం చెబుతానని, కానీ అసలు నిజం ఏంటంటే కుటుంబంతో సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయని శిల్పా స్పష్టం చేశారు.
డోర్‌మాట్‌లా మారిపోయాను
ఆఖరికి తన ఆస్తి విల్లులో కూడా కుటుంబ సభ్యులకు ఎలాంటి హక్కు లేకుండా రాసేశానని శిల్పా షిండే వెల్లడించారు. సొంత కుటుంబంలో తాను ఒక కాళ్ల తుడుపు గుడ్డలా (డోర్‌మాట్) మారిపోయానని, అందరూ తనను వాడుకుని వదిలేశారని వాపోయారు.
షెల్టర్ హోమ్ నిర్మించడమే జీవితాశయం
నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేలా ఒక పెద్ద షెల్టర్ హోమ్ నిర్మించడమే తన జీవిత లక్ష్యమని, ఆ కల నెరవేర్చుకోవడానికే ఈ రియాలిటీ షోలో పాల్గొంటున్నానని చెప్పారు.
టాక్సిక్ అని విమర్శించినా పట్టించుకోను
జనాలు తనను 'టాక్సిక్' అని విమర్శించినా పట్టించుకోనని, ఈ చేదు అనుభవాలే తనను మానసికంగా మరింత దృఢంగా మార్చాయని ధైర్యంగా తెలిపారు.