Shah Rukh Khan OTT: కింగ్ ఖాన్.. ఈ పేరు బాలీవుడ్‌కే పరిమితం కాదు. తన యాక్షన్, రొమాంటిక్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఎంతగానో అలరించిన గ్లోబల్ స్టార్ షారుఖ్ ఖాన్. ఆయన బర్త్ డే సందర్భంగా ఇంట్లోనే ఉండి టీవీకి అతుక్కుపోవాలనుకునే ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ఓటీటీ లిస్ట్ రెడీ చేశాం. తెలుగు ఆడియోలో అందుబాటులో ఉన్న షారుఖ్ బెస్ట్ 5 సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం.
1. జవాన్ (Jawan) - నెట్‌ఫ్లిక్స్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ సౌత్ ప్రేక్షకులకు పిచ్చి పిచ్చిగా కనెక్ట్ అయింది. నయనతార, విజయ్ సేతుపతి యాక్టింగ్.. అనిరుధ్ మ్యూజిక్ తో పక్కా టాలీవుడ్ మాస్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు కొల్లగొట్టిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ లవర్స్‌కు ఇది బెస్ట్ ఛాయిస్.
2. పఠాన్ (Pathaan) - అమెజాన్ ప్రైమ్
షారుఖ్ ఖాన్‌కు పదేళ్ల తర్వాత బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ ఇచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్, జాన్ అబ్రహం విలనిజం, దీపికా పదుకొనే గ్లామర్.. వీటన్నింటికీ మించి షారుఖ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు కిక్ ఇస్తాయి. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అద్భుతమైన తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది.
3. డంకీ (Dunki) - నెట్‌ఫ్లిక్స్
ఓటీటీలో యాక్షన్ ఇక చాలు కాస్త ఫ్యామిలీ ఎమోషన్స్ కావాలి అనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ 'డంకీ'. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. అక్రమంగా విదేశాలకు వెళ్లే యువత పడే కష్టాలను గుండెకు హత్తుకునేలా చూపిస్తుంది. నవ్వించి, కంటతడి పెట్టించే ఈ ఫీల్ గుడ్ డ్రామా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో చూడొచ్చు.
4. దిల్వాలే (Dilwale) - నెట్‌ఫ్లిక్స్
{{/usCountry}}ఓటీటీలో యాక్షన్ ఇక చాలు కాస్త ఫ్యామిలీ ఎమోషన్స్ కావాలి అనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ 'డంకీ'. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. అక్రమంగా విదేశాలకు వెళ్లే యువత పడే కష్టాలను గుండెకు హత్తుకునేలా చూపిస్తుంది. నవ్వించి, కంటతడి పెట్టించే ఈ ఫీల్ గుడ్ డ్రామా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో చూడొచ్చు.
4. దిల్వాలే (Dilwale) - నెట్‌ఫ్లిక్స్
{{/usCountry}}షారుఖ్ ఖాన్, కాజోల్ సూపర్ హిట్ పెయిర్, రోహిత్ శెట్టి డైరెక్షన్.. ఈ కాంబినేషనే ఈ సినిమాకు హైలైట్. ఫుల్ ఆన్ కామెడీ, లవ్ అండ్ యాక్షన్ తో సాగే ఈ సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. ముఖ్యంగా కార్ చేజింగ్ సీన్స్, వరుణ్ ధావన్ కామెడీ ట్రాక్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. వీకెండ్ టైమ్‌పాస్ కోసం నెట్‌ఫ్లిక్స్‌లో దీన్ని ట్రై చేయొచ్చు.
5. హ్యాపీ న్యూ ఇయర్ (Happy New Year) - నెట్‌ఫ్లిక్స్
ఒక ఇంటర్నేషనల్ డ్యాన్స్ కాంపిటీషన్ ముసుగులో దుబాయ్‌లో భారీ రాబరీ ఎలా చేశారన్నది ఈ సినిమా స్టోరీ. ఫరా ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ హీస్ట్ కామెడీ మూవీలో దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్, సోనూ సూద్ కూడా నటించారు. అదిరిపోయే సాంగ్స్, మంచి కామెడీ, కలర్ ఫుల్ విజువల్స్ ఉండే ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసేయొచ్చు.