...
...
Next Story

Shah Rukh Khan: విదేశీ గడ్డపై ఇండియన్ రెస్టారెంట్- అదొక దేవాలయం అన్న షారుఖ్ ఖాన్- బంగ్లాపై చెఫ్ వికాస్ కామెంట్స్

Shah Rukh Khan Praised Chef Vikas Khanna Restaurant: విదేశీ గడ్డపై ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా పెట్టిన రెస్టారెంట్ బంగ్లాను సందర్శించిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం వ్యాపార వేదిక కాదు, మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పవిత్ర దేవాలయం లాంటిదని కొనియాడారు.

Published on: Aug 10, 2026, 13:54:29 IST
Advertisement

Shah Rukh Khan Praised Chef Vikas Khanna Restaurant: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో భారతీయ రుచుల గుబాళింపులను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ప్రముఖ మాస్టర్ చెఫ్ వికాస్ ఖన్నా రెస్టారెంట్ 'బంగ్లా' (Bungalow) ఇప్పుడు ప్రపంచ స్థాయి సెలబ్రిటీల కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా

విదేశీ గడ్డపై ఇండియన్ రెస్టారెంట్- అదొక దేవాలయం అన్న షారుఖ్ ఖాన్- బంగ్లాపై చెఫ్ వికాస్ కామెంట్స్
విదేశీ గడ్డపై ఇండియన్ రెస్టారెంట్- అదొక దేవాలయం అన్న షారుఖ్ ఖాన్- బంగ్లాపై చెఫ్ వికాస్ కామెంట్స్

కేవలం రుచికరమైన వంటకాలకే పరిమితం కాకుండా, మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. ఇటీవల శేఖర్ సుమన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'శేఖర్ టునైట్' టాక్ షోలో పాల్గొన్న వికాస్ ఖన్నా, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తన రెస్టారెంట్‌ను సందర్శించినప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

హోటల్ కాదు.. అది మన భారతీయ సంస్కృతీ నిలయం!

షారుఖ్ ఖాన్ తన రెస్టారెంట్‌కు వచ్చినప్పుడు చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయని వికాస్ ఖన్నా తెలిపారు. ఈ భేటీ సందర్భంగా కింగ్ ఖాన్ చూపించిన ఆప్యాయత తనను ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు.

గుడిలోకి వచ్చిన అనుభూతి

"ప్రపంచంలో నేను ఎన్నో రెస్టారెంట్లను సందర్శించాను. కానీ, అవన్నీ కేవలం లావాదేవీలు జరిగే దుకాణాల్లా మాత్రమే అనిపించాయి. మొదటిసారి బంగ్లాలోకి అడుగుపెట్టగానే ఒక పవిత్ర దేవాలయంలోకి వచ్చిన అనుభూతి కలిగింది. మన సంస్కృతిని, మన తల్లిదండ్రులను, పూర్వీకులను ఇక్కడ ఎంతో గౌరవంగా ప్రతిబింబిస్తున్నారు" అని షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానించారు.

సామాన్య కుటుంబం నుంచి

కేవలం షారుఖ్ ఖాన్ మాత్రమే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు ఈ రెస్టారెంట్ రుచులకు ఫిదా అవుతున్నారు. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ సమయం గడిపారు. అంతేకాకుండా హాలీవుడ్ నటి అన్నే హాత్వే, నీల్ ప్యాట్రిక్ హారిస్ వంటి అంతర్జాతీయ తారలు కూడా బంగ్లాను సందర్శించి అక్కడి ఆహారాన్ని, ఆతిథ్యాన్ని ప్రశంసించారు.

'కింగ్' సినిమాతో రానున్న షారుఖ్

మరోవైపు షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం 'కింగ్' పనుల్లో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో షారుఖ్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తోంది.

షారుఖ్ ఖాన్ కుమార్తె కూడా

దీపికాతోపాటు కింగ్ సినిమాలో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, రాఘవ్ జుయల్, జైదీప్ అహ్లావత్, అర్షద్ వార్సీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. న్యూయార్క్‌లోని వికాస్ ఖన్నా రెస్టారెంట్ పేరేమిటి?

న్యూయార్క్‌లో చెఫ్ వికాస్ ఖన్నా నడుపుతున్న ప్రసిద్ధ భారతీయ రెస్టారెంట్ పేరు 'బంగ్లా' (Bungalow).

2. వికాస్ ఖన్నా రెస్టారెంట్‌ను షారుఖ్ ఖాన్ దేనితో పోల్చారు?

మిగతా హోటళ్లు వ్యాపార కేంద్రాల్లా ఉంటే, వికాస్ ఖన్నా రెస్టారెంట్ భారతీయ సంస్కృతికి అద్దం పట్టే పవిత్ర దేవాలయంలా ఉందని షారుఖ్ ఖాన్ పోల్చారు.

3. షారుఖ్ ఖాన్ నటిస్తున్న తదుపరి చిత్రం ఏది?

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న 'కింగ్' (King) చిత్రంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe