Shraddha Kapoor Eetha Teaser Released: 'స్త్రీ 2' లాంటి భారీ ఇండస్ట్రీ హిట్ తర్వాత బాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రద్ధా కపూర్ మరో అద్భుతమైన ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన 'సాహో' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితరాలైన శ్రద్ధా కపూర్.. తాజాగా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ఈత’ (Eetha).
రష్మిక మూవీ థియేటర్లలో

లక్ష్మణ్ ఉటేకర్ పర్యవేక్షణలో రాహుల్ మోడీ తెరకెక్కిస్తున్న ఈత సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను రష్మిక మందన్నా'కాక్‌టెయిల్ 2' సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్లలో జూన్ 19న అంటే ఇవాళ ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈత టీజర్ చూసిన ప్రేక్షకులు, సినీ విమర్శకులు శ్రద్ధా కపూర్ నటనకు, ఆమె చూపించిన అంకితభావానికి ఫిదా అవుతున్నారు.
ఒళ్లు గగుర్పొడిచే టీజర్.. అసలు కథేంటంటే?
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ లావణి, తమాషా జానపద నృత్య కళాకారిణి విఠాబాయి భౌ మాంగ్ నారాయణ్‌గాంకర్ యథార్థ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. 1940 నుంచి 1990 వరకు ఆమె జీవితంలో సాగిన కళా ప్రస్థానం, ఎదుర్కొన్న తీవ్రమైన పోరాటాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.
గర్భవతిగా ఉండి
తాజాగా వైరల్ అవుతున్న ఈత టీజర్‌లో శ్రద్ధా కపూర్ గర్భవతిగా ఉండి స్టేజ్ పైన నిండుగా అలంకరించుకుని నృత్య ప్రదర్శన ఇస్తూ కనిపిస్తుంది. డ్యాన్స్ చేస్తున్న సమయంలోనే ఆమెకు అకస్మాత్తుగా ప్రసవ వేదన మొదలవుతుంది. అయినప్పటికీ కళపై ఉన్న అపారమైన గౌరవంతో ప్రదర్శనను ఆపకుండా పూర్తి చేస్తుంది.
ఆ వెంటనే బ్యాక్స్టేజ్కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చి, అక్కడ దొరికిన ఒక పదునైన రాయితోనే స్వయంగా బొడ్డుతాడును కోసేసుకుంటుంది. ఆ రక్తాన్ని తుడ్చుకుని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మళ్లీ స్టేజ్ పైకి వచ్చి చిరునవ్వుతో డ్యాన్స్ కంటిన్యూ చేస్తుంది. ఈ హృదయ విదారక, ఉద్వేగభరిత సీన్ థియేటర్లలో చూసిన వారందరినీ షాక్‌కు గురిచేయడమే కాకుండా కళ్లవెంట నీళ్లు తెప్పిస్తోంది.
నెటిజన్ల ప్రశంసల జల్లు
{{/usCountry}}ఆ వెంటనే బ్యాక్స్టేజ్కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చి, అక్కడ దొరికిన ఒక పదునైన రాయితోనే స్వయంగా బొడ్డుతాడును కోసేసుకుంటుంది. ఆ రక్తాన్ని తుడ్చుకుని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మళ్లీ స్టేజ్ పైకి వచ్చి చిరునవ్వుతో డ్యాన్స్ కంటిన్యూ చేస్తుంది. ఈ హృదయ విదారక, ఉద్వేగభరిత సీన్ థియేటర్లలో చూసిన వారందరినీ షాక్‌కు గురిచేయడమే కాకుండా కళ్లవెంట నీళ్లు తెప్పిస్తోంది.
నెటిజన్ల ప్రశంసల జల్లు
{{/usCountry}}థియేటర్లలో ఈత టీజర్ చూసిన ప్రేక్షకులు ఆ క్లిప్పింగ్స్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ శ్రద్ధా కపూర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. "ఈత టీజర్ అద్భుతంగా ఉంది. లక్ష్మణ్ ఉటేకర్ చేతిలో మరో బ్లాక్‌బస్టర్ సినిమా పడినట్లే. శ్రద్ధా కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్, రిచ్ విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి" అని ఒక నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్)లో కొనియాడారు.
"ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం, టీజర్ చూస్తుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి" అంటూ మరికొందరు సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నారు.
పాత్ర కోసం 15 కిలోల బరువు.. షూటింగ్‌లో గాయం
ఈ పవర్‌ఫుల్ బయోపిక్ కోసం శ్రద్ధా కపూర్ ప్రాణం పెట్టి పనిచేసింది. విఠాబాయి యువతిగా ఉన్నప్పటి పాత్రలో పర్‌ఫెక్ట్‌గా సరిపోవడం కోసం శ్రద్ధా కపూర్ ఏకంగా 15 కిలోల బరువు పెరిగింది. నౌవారి చీర కట్టుకుని, భారీ ఆభరణాలు ధరించి అజయ్-అతుల్ సంగీత దర్శకత్వంలో వచ్చే ఒక వేగవంతమైన లావణి జానపద నృత్యం చేస్తున్న సమయంలో శ్రద్ధా తీవ్రమైన గాయానికి గురైంది.
దోల్కి దరువులకు తగినట్లుగా వేగంగా స్టెప్పులు వేసే క్రమంలో బరువంతా ఎడమ కాలిపై పడటంతో బ్యాలెన్స్ తప్పి కండరాలకు గాయమైంది (Muscle Tear). అప్పట్లో ఈ గాయంపై శ్రద్ధా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. "టెర్మినేటర్ లాగా నడుస్తున్నా. కండరాల గాయం అయింది కానీ త్వరలోనే తగ్గిపోతుంది. కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే మళ్లీ మామూలు మనిషిని అయిపోతాను" అని సరదాగా పోస్ట్ పెట్టింది.
ఈత రిలీజ్ డేట్
కాగా, ఈ ప్రతిష్టాత్మక ఈత చిత్రంలో శ్రద్ధా కపూర్‌తో పాటు రణదీప్ హుడా, మహమ్మద్ జీషన్ అయ్యూబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాఖీ పండుగ కానుకగా ఆగస్టు 28న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.