...
...
Next Story

Shakti Kapoor: హీరోయిన్ శ్రద్ధా కపూర్ తండ్రి మరణించాడని వార్తలు- అలా క్లారిటీ ఇచ్చిన శక్తి కపూర్- కేసు పెడతానంటూ!

Shakti Kapoor Death Rumours Clarity: హీరోయిన్ శ్రద్ధా కపూర్ తండ్రి బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ మరణించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్వయంగా ఆయనే స్పందించారు. తాను ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నానని చెబుతూ పుకార్లకు చెక్ పెట్టారు. అలాగే, కేసులు పెడాతనని వార్నింగ్ ఇచ్చారు.

Published on: May 8, 2026, 10:12:17 IST
Advertisement

Shakti Kapoor Death Rumours Clarity: బాలీవుడ్‌లో విలన్‌గా, కమెడియన్‌గా తనదైన ముద్ర వేసిన శక్తి కపూర్ గురించి గురువారం (మే 5) ఉదయం నుంచి ఒక షాకింగ్ వార్త నెట్టింట వైరల్ అయింది. శక్తి కపూర్ ఇక లేరంటూ కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

హీరోయిన్ శ్రద్ధా కపూర్ తండ్రి మరణించాడని వార్తలు- అలా క్లారిటీ ఇచ్చిన శక్తి కపూర్- కేసు పెడతానంటూ!
హీరోయిన్ శ్రద్ధా కపూర్ తండ్రి మరణించాడని వార్తలు- అలా క్లారిటీ ఇచ్చిన శక్తి కపూర్- కేసు పెడతానంటూ!

వాస్తవానికి సినీ ప్రముఖులపై ఇలాంటి 'డెత్ హోక్స్' (మరణించినట్లు పుకార్లు పుట్టించడం) రావడం కొత్తేమీ కాకపోయినా, శక్తి కపూర్ విషయంలో ఇది తీవ్ర కలకలం రేపింది. దీంతో ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో ఆయన కుటుంబ సభ్యులు కూడా విసిగిపోయారు.

పుకార్లను కొట్టిపారేసిన శక్తి కపూర్

ఈ తప్పుడు ప్రచారం ముదురుతుండటంతో శక్తి కపూర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. వైలెట్ కలర్ వెస్ట్ ధరించి, ఎంతో ఉత్సాహంగా కనిపించిన ఆయన.. "హలో అందరికీ నమస్కారం. నా మరణం గురించి వస్తున్న వార్తలన్నీ అబద్ధం. నేను చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. దయచేసి ఇలాంటి పుకార్లను నమ్మకండి, పట్టించుకోకండి" అని శక్తి కపూర్ పేర్కొన్నారు.

కేవలం వివరణ ఇవ్వడంతోనే ఆయన ఆగలేదు. తనపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. "ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. దీనిపై నేను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నాను" అని 73 ఏళ్ల ఈ నటుడు శక్తి కపూర్ హెచ్చరించారు.

ఊపిరి పీల్చుకున్న అభిమానులు

కాగా, శక్తి కపూర్ కెరీర్ గురించి చెప్పాలంటే అదొక సుదీర్ఘ ప్రయాణం. దాదాపు 40 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఆయన, సుమారు 700 చిత్రాల్లో నటించారు. 'రాజా బాబు'లో నందు పాత్ర అయినా, 'అందాజ్ అప్నా అప్నా'లో క్రైమ్ మాస్టర్ గోగో పాత్ర అయినా ఆయనకే చెల్లుతుంది.

శ్రద్ధా కపూర్ తండ్రి

విలన్‌గా భయపెడుతూనే, కామెడీతో పొట్టచెక్కలయ్యేలా నవ్వించడం కూడా శక్తి కపూర్ శైలి. ఇక శక్తి కపూర్ వారసురాలిగా ఆయన కూతురు శ్రద్ధా కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది. గతేడాది విడుదలైన శ్రద్ధా కపూర్ చిత్రం 'స్త్రీ-2' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. మొత్తానికి సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ మరణ పుకార్లకు చెక్ పడింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. శక్తి కపూర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది?

శక్తి కపూర్ పూర్తి ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారు. తన మరణం గురించి వస్తున్నవన్నీ కేవలం పుకార్లేనని ఆయన స్వయంగా స్పష్టం చేశారు.

2. శక్తి కపూర్ తప్పుడు వార్తలపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు?

తమపై అవాస్తవ ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

3. శక్తి కపూర్ నటించిన ముఖ్యమైన సినిమాలు ఏవి?

రాజా బాబు, అందాజ్ అప్నా అప్నా, చాల్ బాజ్, హంగామా, భాగమ్ భాగ్ వంటి వందలాది సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన నటించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe