బాలీవుడ్‌లో ‘గల్లీ బాయ్’ చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన సిద్ధాంత్ చతుర్వేది ఇప్పుడు హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే, ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కన్నీళ్లు, మరెన్నో అవమానాలు ఉన్నాయి. తాజాగా హిందుస్థాన్ టైమ్స్‌తో జరిపిన సంభాషణలో సిద్ధాంత్ తన జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
నత్తి కారణంగా

త్వరలో విడుదల కానున్న ‘దో దీవానే షెహర్ మే’ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేది నత్తి ఉన్న కుర్రాడిగా నటిస్తున్నారు. ఆ కారణంతోనే పెళ్లి సంబంధాల్లో రిజెక్షన్స్ ఎదుర్కొనే పాత్ర అది. అయితే, నిజ జీవితంలో కూడా ఇలాంటి వింత కారణాలతో ఎప్పుడైనా రిజెక్షన్ ఎదురైందా అని అడిగినప్పుడు సిద్ధాంత్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.
హీరో అని మురిసిపోయా
"నేను సిఏ (CA) చదువు మధ్యలో వదిలేసి నటన వైపు వచ్చిన కొత్తలో అలా జరిగింది. ఒక పెద్ద సినిమా ఆడిషన్స్‌లో షార్ట్ లిస్ట్ అయ్యాను. వర్క్‌షాప్‌లు కూడా జరిగాయి, పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాను. ఒక ఏడాదిలోనే హీరో అయిపోతున్నానని మురిసిపోయాను. కానీ మూడు నాలుగు నెలల తర్వాత సీన్ రివర్స్ అయింది" అని సిద్ధాంత్ చతుర్వేది తెలిపారు.
"నా స్క్రీన్ టెస్ట్ చూసిన నిర్మాత నన్ను రిజెక్ట్ చేశారు. ఎందుకు అని కాస్టింగ్ డైరెక్టర్‌ను అడిగితే.. ‘నీ జుట్టు రింగులు తిరిగినట్లు (Curly hair) ఉంది, ఇలాంటి జుట్టు ఉన్నవాళ్లు హీరోలు కాలేరు’ అని చెప్పారు" అని సిద్ధాంత్ చతుర్వేది తన రెజెక్షన్ గురించి చెప్పారు.
జుట్టు స్ట్రెయిట్ చేసినా వదలలేదు..
ఆ మాట విన్న సిద్ధాంత్ తన జుట్టును స్ట్రెయిట్ చేయించుకుని మళ్లీ ఆడిషన్ ఇచ్చారట. కానీ, అప్పుడు కూడా ‘జుట్టు మరీ స్ట్రెయిట్‌గా ఉంది’ అని వంక పెట్టి పంపించేశారు.
{{/usCountry}}ఆ మాట విన్న సిద్ధాంత్ తన జుట్టును స్ట్రెయిట్ చేయించుకుని మళ్లీ ఆడిషన్ ఇచ్చారట. కానీ, అప్పుడు కూడా ‘జుట్టు మరీ స్ట్రెయిట్‌గా ఉంది’ అని వంక పెట్టి పంపించేశారు.
{{/usCountry}}"అసలు ఒక నటుడిని రిజెక్ట్ చేయడానికి ఇవేం కారణాలు అని నాకు అర్థం కాలేదు. ఆ బాధ భరించలేక ఇంటికి వెళ్లి గుండు చేయించుకున్నాను. నా కర్లీ హెయిర్ అంటే మా అమ్మకు చాలా ఇష్టం, అయినా సరే ఆ నిరాశలో తల నీలాలు సమర్పించుకున్నాను" అని సిద్ధాంత్ చతుర్వేది ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు అదే జుట్టుతో పోస్టర్‌పై!
అయితే, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని సిద్ధాంత్ చతుర్వేది నిరూపించారు. ఒకప్పుడు ఏ జుట్టు వంక పెట్టి పక్కన పెట్టారో, ఇప్పుడు ‘దో దీవానే షెహర్ మే’ పోస్టర్ మీద అదే కర్లీ హెయిర్‌తో హీరోగా మెరుస్తున్నారు. "నేను ఇప్పుడు నా జుట్టు విషయంలో చాలా గర్వంగా ఉన్నాను" అని సిద్ధాంత్ చిరునవ్వుతో చెప్పారు.
మృణాల్‌ను ఆటపట్టించిన హీరో
ఇకపోతే సిద్ధాంత్ చతుర్వేది నటించిన రొమాంటిక్ డ్రామా ‘దో దీవానే షెహర్ మే’ మూవీలో హీరోయిన్‌గా బ్యూటిపుల్ మృణాల్ ఠాకూర్ చేసింది. ఇదివరకు జరిగిన ఓ ఈవెంట్‌లో చెన్నై ప్రస్తావన రావడంతో ధనుష్‌తో పెళ్లి రూమర్స్‌ను ఉద్దేశించి మృణాల్ ఠాకూర్‌ను ఆటపట్టించాడు సిద్ధాంత్ చతుర్వేది.
నిర్మాతగా అగ్ర దర్శకుడు
కాగా, రవి ఉద్యావర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దో దీవానే షెహర్ మే’ సినిమాను అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మించారు. ‘దో దీవానే షెహర్ మే’ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది.