Siddu Gadi Love Story Success Meet: మనోజ్, శృతి, మోహన సిద్ధి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సినిమా "సిద్ధుగాడి లవ్ స్టోరీ". ఈ చిత్రాన్ని శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారిచెరుకూరు శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో నిర్మాత సావిత్రమ్మ చెరుకూరు నిర్మించారు.
యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి

యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన "సిద్ధుగాడి లవ్ స్టోరీ" సినిమా ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చి యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సందర్భంగా తాజాగా ఈ రోజు (నవంబర్ 29) సిద్ధుగాడి లవ్ స్టోరీ సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వైవి రావు మాట్లాడుతూ.. "మా సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. మా సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్" అని చెప్పారు.
అన్ని ఏరియాల్లో హిట్ టాక్
రైటర్ శ్రీధర్ మాట్లాడుతూ.. "మా సినిమాకు యూత్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. నైజాం, సీడెడ్, ఆంధ్రా..ఇలా అన్ని ఏరియాస్‌లో హిట్ టాక్ వస్తోంది. సాంగ్స్ బాగున్నాయని చెబుతున్నారు. హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్‌ను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. మా చిత్రాన్ని ఇలాగే మరింత సక్సెస్ చేయాలని కోరుతున్నాం" అని కోరారు.
హీరోయిన్ శృతి మాట్లాడుతూ.. "ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో మా సినిమాకు ఆదరణ లభిస్తోంది. ప్రతి సెంటర్ నుంచి హిట్ టాక్ వస్తోంది. ఇది యూత్ ఓరియెంటెడ్ మూవీ అయినా ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మా సినిమాను చూస్తున్నారు. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్లి మా సినిమా చూడాలని కోరుతున్నా" అని ఆకాంక్షించారు.
మదర్ సెంటిమెంట్ బాగుందని
హీరో మనోజ్ మాట్లాడుతూ.. "మేము మా సినిమాను కష్టపడి రూపొందించాం. మా కష్టానికి తగిన ఫలితాన్నిస్తూ సినిమాను ప్రేక్షకులు పెద్ద హిట్ చేశారు. మేము ఇంతటి రెస్పాన్స్ ను ఊహించలేదు. చూసిన వాళ్లంతా సినిమా బాగుందంటున్నారు. యూత్ ఆడియెన్స్ నేను చేసిన సిద్ధు క్యారెక్టర్‌కు బాగా కనెక్ట్ అవుతున్నారు" అని అన్నారు.
{{/usCountry}}హీరో మనోజ్ మాట్లాడుతూ.. "మేము మా సినిమాను కష్టపడి రూపొందించాం. మా కష్టానికి తగిన ఫలితాన్నిస్తూ సినిమాను ప్రేక్షకులు పెద్ద హిట్ చేశారు. మేము ఇంతటి రెస్పాన్స్ ను ఊహించలేదు. చూసిన వాళ్లంతా సినిమా బాగుందంటున్నారు. యూత్ ఆడియెన్స్ నేను చేసిన సిద్ధు క్యారెక్టర్‌కు బాగా కనెక్ట్ అవుతున్నారు" అని అన్నారు.
{{/usCountry}}"డ్యాన్స్ , ఫైట్స్ బాగా చేశాననే పేరొస్తోంది. మార్నింగ్ షోస్‌కు చాలా మంది వెళ్లారు. ఇప్పుడు ఫస్ట్షోకి హౌస్ ఫుల్స్ అవుతాయని నమ్ముతున్నాం. మీరు కూడా ఫ్యామిలీతో వెళ్లి చూడండి. సాంగ్స్ బాగున్నాయి. సెకండాఫ్‌లో మదర్ సెంటిమెంట్ బాగుందని అంటున్నారు. మీ అందరికీ మా సినిమా నచ్చుతుంది" అని హీరో మనోజ్ తెలిపారు.
నా మొదటి కల సినిమా
డైరెక్టర్ రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ.. "మా మూవీని ఆడియెన్స్‌తో పాటు కలిసి థియేటర్స్‌లో చూశాను. మంచి రెస్పాన్స్ వస్తోంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మా సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ మా మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్స్‌కు అయితే విజిల్స్ కొడుతున్నారు" అని పేర్కొన్నారు.
"ఇది నాకు పెద్ద విజయంగా భావిస్తున్నా. నా మొదటి కల సినిమా. అది తీరింది. సినిమా బాగా ఆడుతోంది. ఇంత ఆదరణ ఇస్తారని అంచనా వేయలేదు. ప్రతి సెంటర్ నుంచి మా సినిమాకు మంచి రిపోర్ట్ వస్తోంది. ప్రేక్షకుందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా" అని చెప్పుకొచ్చారు దర్శకుడు రమేష్ బాబు.
ABOUT THE AUTHOR
చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.