హీరోగా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన సోదరుడు చైతు (చైతన్య) జొన్నలగడ్డ కూడా నటుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. హిట్ 3, భామా కలాపం 2 వంటి సినిమాల్లో నటించారు. చైతు జొన్నలగడ్డ నటుడిగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి.
ఓటీటీ ప్లాట్‌ఫామ్

"రాజు వెడ్స్ రాంబాయి" సినిమాలో అఖిల్, తేజస్విని జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. నవంబర్ 21న ఈ సినిమా రిలీజ్ కానుంది.
చైతు జొన్నలగడ్డ కామెంట్స్
అయితే, ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌మెంట్ చేశారు. దీనికి సంబంధించి ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
పక్కా తెలంగాణ సినిమా
నటుడు చైతు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. "రాజు వెడ్స్ రాంబాయి పక్కా తెలంగాణ సినిమా. తెలంగాణ నేటివిటీని, ఇక్కడి ప్రజల జీవితాలను ఈ చిత్రంలో చూస్తాం. తెలంగాణ నేటివిటీని ఇంత పర్‌ఫెక్ట్‌గా చూపించిన సినిమా మరొకటి లేదు. ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయడం హ్యాపీగా ఉంది" అని తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్‌గా న్యాయం
ఇదే ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. "రాజు వెడ్స్ రాంబాయి లాంటి మంచి కథ ఉన్న చిత్రానికి నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా న్యాయం చేయగలను అని నమ్మిన వేణు ఊడుగుల అన్నకు, ఈటీవీ విన్ వారికి, డైరెక్టర్ సాయిలు గారికి థ్యాంక్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డీటెయిల్డ్‌గా మాట్లాడుతా. మా సినిమా టీమ్‌కు మీరంతా సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా" అని అన్నారు.
నా మనసుకు ఎంతో దగ్గరైంది
{{/usCountry}}ఇదే ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. "రాజు వెడ్స్ రాంబాయి లాంటి మంచి కథ ఉన్న చిత్రానికి నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా న్యాయం చేయగలను అని నమ్మిన వేణు ఊడుగుల అన్నకు, ఈటీవీ విన్ వారికి, డైరెక్టర్ సాయిలు గారికి థ్యాంక్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డీటెయిల్డ్‌గా మాట్లాడుతా. మా సినిమా టీమ్‌కు మీరంతా సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా" అని అన్నారు.
నా మనసుకు ఎంతో దగ్గరైంది
{{/usCountry}}హీరోయిన్ తేజస్వినీ మాట్లాడుతూ.. "రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో రాంబాయి క్యారెక్టర్‌తో మీ ముందుకు రాబోతున్నాను. ఈ సినిమా, ఈ క్యారెక్టర్ నా మనసుకు ఎంతో దగ్గరయ్యాయి" అని చెప్పింది.
ఎమోషన్‌కు గురవుతారు
"సినిమా చూస్తున్నంత సేపు మీరు ఒక ఎమోషన్ కు గురవుతారు, మూవీని ఇష్టపడతారు. తెలుగు ఆడియెన్స్‌కు మా మూవీ బాగా నచ్చుతుంది. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఈటీవీ విన్ వారికి, మా డైరెక్టర్ సాయిలు, వేణు గారికి థ్యాంక్స్" అని హీరోయిన్ తేజస్వినీ తెలిపింది.