పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం "దేవగుడి". ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, సింగర్ రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు.
దేవగుడి సక్సెస్ మీట్

"దేవగుడి" సినిమా శుక్రవారం (జనవరి 30) ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోందని దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ నేపథ్యంలో దేవగుడి చిత్ర సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో తాజాగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగర్ రఘు కుంచె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
రఘు కుంచె కామెంట్స్
నటుడు, సింగర్ రఘు కుంచె మాట్లాడుతూ.. "మంచి కంటెంట్ ఉంటే తప్పకుండా చిన్న సినిమాను కూడా ఆదరిస్తామని తెలుగు ఆడియెన్స్ దేవగుడి విజయంతో మరోసారి ప్రూవ్ చేశారు. ఈ క్రెడిట్ బెల్లం రామకృష్ణా రెడ్డి గారికే ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ చిన్న సినిమా రిలీజైతే అది ప్రేక్షకులకు రీచ్ కావడం లేదు, ఎక్కడా కనిపించడం లేదు" అని అన్నారు.
ప్లానింగ్‌తో రీచ్ అయ్యేలా చేశారు
"కానీ, రామకృష్ణా రెడ్డి గారు ఎంత శ్రద్ధగా సినిమాను తెరకెక్కించారో, అంతే ప్లానింగ్‌తో పబ్లిసిటీ, రిలీజ్ చేసి సినిమాను తెలుగు ఆడియెన్స్‌కు రీచ్ అయ్యేలా చేశారు. ఈ చిత్రంలో దేవగుడి వీరారెడ్డిగా నేను చేసిన పాత్ర నా కెరీర్‌లో బెస్ట్ రోల్ అయ్యింది" అని సంతోషం వ్యక్తం చేశారు రఘు కుంచె.
నటుడిగా సంతృప్తినిచ్చిన సినిమా
"ప్రతి రివ్యూలోనూ నా పేరుతోనే రాయడం మొదలుపెట్టారు. నటుడిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రమిది. అన్నిటికంటే ముఖ్యంగా మా దర్శకనిర్మాత హ్యాపీగా ఉన్నారు. అదే మాకు నిజమైన విజయం" అని తన స్పీచ్ ముగించారు రఘు కుంచె.
తెలుగు అమ్మాయిగా
{{/usCountry}}"ప్రతి రివ్యూలోనూ నా పేరుతోనే రాయడం మొదలుపెట్టారు. నటుడిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రమిది. అన్నిటికంటే ముఖ్యంగా మా దర్శకనిర్మాత హ్యాపీగా ఉన్నారు. అదే మాకు నిజమైన విజయం" అని తన స్పీచ్ ముగించారు రఘు కుంచె.
తెలుగు అమ్మాయిగా
{{/usCountry}}ఇదే సక్సెస్ మీట్‌లో హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ.. "ఒక తెలుగు అమ్మాయిగా దేవగుడి చిత్రంతో హీరోయిన్‌గా మీ ముందుకు వచ్చాను. తిరుపతిలో మా సినిమా చూసి బయటకు వస్తుంటే శ్వేతా రెడ్డి అని ఆడియెన్స్ పిలుస్తున్నారు. ఇది నటిగా నాకు దక్కిన రియల్ గుర్తింపు అని నమ్ముతున్నాను" అని అన్నారు.
విజిల్స్ పడుతున్నాయి
"ఈ చిత్రంలో శ్వేతారెడ్డిగా నన్ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బెల్లం రామకృష్ణారెడ్డి గారు సినిమాలోని ప్రతి పాత్రను అంత బాగా తెరకెక్కించారు. నేను చేసిన కొన్ని ఫైట్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్‌కు థియేటర్స్‌లో విజిల్స్ పడుతున్నాయి" అని ఆనందం వ్యక్తం చేశారు హీరోయిన్ అనుశ్రీ.