...
...
Next Story

Singer: హైదరాబాద్ లైవ్ షోలో అభిమానిపై ఉమ్మేసిన సింగర్- నీ చెల్లి పెళ్లికి కట్నంగా ఇవ్వమంటూ బూతులు- అర్పిత్ బాలా వివరణ!

Singer Arpit Bala Clarity On Spits At Fan: హైదరాబాద్‌లోని కింగ్‌డమ్ క్లబ్ అండ్ కిచెన్‌లో జరిగిన కచేరీలో గాయకుడు అర్పిత్ బాలా వివాదంలో చిక్కుకున్నారు. వేదికపై నుంచి అభిమానిపై ఉమ్మివేయడం, బూతులు తిట్టడం వంటి విషయాలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘటనపై అర్పిత్ బాలా స్పందిస్తూ తన వైపు వెర్షన్ వినిపించారు.

Published on: Mar 31, 2026, 11:50:03 IST
Advertisement

2025లో వచ్చిన 'బర్గద్' పాటతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన సింగర్ అర్పిత్ బాలా. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన తన లైవ్ కాన్సెర్ట్‌లో అర్పిత్ బాలా చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ప్రదర్శన ఇస్తుండగా ఎవరో బాటిల్ విసరడంతో ఆగ్రహానికి గురైన అర్పిత్ బాలా సదరు అభిమానిపై ఉమ్మివేసి నానా రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు.

అసలేం జరిగింది?

హైదరాబాద్ లైవ్ షోలో అభిమానిపై ఉమ్మేసిన సింగర్- నీ చెల్లి పెళ్లికి కట్నంగా ఇవ్వమంటూ బూతులు- అర్పిత్ బాలా వివరణ!
హైదరాబాద్ లైవ్ షోలో అభిమానిపై ఉమ్మేసిన సింగర్- నీ చెల్లి పెళ్లికి కట్నంగా ఇవ్వమంటూ బూతులు- అర్పిత్ బాలా వివరణ!

మార్చి 28న హైదరాబాద్‌లోని 'కింగ్‌డమ్ క్లబ్ అండ్ కిచెన్'లో అర్పిత్ బాలా కచేరీ జరుగుతోంది. ప్రదర్శన మధ్యలో ఉండగా ప్రేక్షకుల నుంచి ఎవరో ఒక ప్లాస్టిక్ బాటిల్‌ను స్టేజ్ మీదకు విసిరారు. అది నేరుగా అర్పిత్ కంటికి తగిలింది. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన అర్పిత్ బాలా బాటిల్ విసిరిన వ్యక్తిని వేలెత్తి చూపిస్తూ బూతులు లంకించుకున్నారు.

వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. అర్పిత్ ఆ బాటిల్‌ను తిరిగి వారిపైకే విసిరి, "ఇటు చూడు.. ఏమైంది? భయమేస్తుందా?" అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. అంతటితో ఆగకుండా సదరు అభిమాని వైపు ఉమ్మివేశారు. "దీన్ని తీసుకెళ్లి నీ చెల్లెలి పెళ్లిలో కట్నంగా ఇవ్వు" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంటనే సెక్యూరిటీని పిలిచి ఆ వ్యక్తిని బయటకు పంపేయాలని ఆదేశించారు.

క్లారిటీ ఇచ్చిన అర్పిత్ బాలా

ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో, అర్పిత్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందించారు. "ఇది వివరణ కాదు, కేవలం నా వైపు ఏం జరిగిందో మీకు తెలియజేయాలనుకుంటున్నాను" అని అర్పిత్ బాలా పేర్కొన్నారు.

"ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు పెద్ద మనసుతో ఉండటం అందరికీ చెప్పడానికి బాగుంటుంది. కానీ, ముఖం మీద ఏదైనా విసిరినప్పుడు అది కేవలం అవమానం మాత్రమే కాదు, ప్రాణాపాయం కూడా (Safety Hazard). ఆ క్షణంలో ఉద్వేగానికి లోనై ఉమ్మివేశాను.. అలా చేసి ఉండకూడదు. కానీ మీరు హద్దులు దాటినప్పుడు నేను మౌనంగా ఉంటానని ఆశించకండి" అని అర్పిత్ బాలా స్పష్టం చేశారు.

ఎవరీ అర్పిత్ బాలా?

హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన అర్పిత్ బాలా పూర్తి పేరు అర్పిత్ బాలబంతరాయ్. 2025లో విడుదలైన 'బర్గద్' పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

45 లక్షల మందికి పైగా

ప్రస్తుతం స్పాటిఫైలో నెలకు 45 లక్షల మందికి పైగా వినేవారు ఉండగా, సోషల్ మీడియాలో దాదాపు 9.7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 'రక్లో తుమ్ చుపాకే', 'ఇక్ కుడీ', 'నహాని' వంటి పాటలతో గుర్తింపు తెచ్చుకున్న అర్పిత్ బాలా తన తదుపరి లైవ్ కాన్సర్ట్‌ను మే 9న ముంబైలో నిర్వహించనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe