Falguni Pathak Navratri Utsav 2026 Ticket Prices: దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకల సందడి అప్పుడే మొదలైంది. ముఖ్యంగా ముంబై నగరం దసరా పండక్కి గర్బా నృత్యాలతో రంగులమయంగా మారుతుంది. అయితే ఈ ఏడాది ముంబై నవరాత్రి ఉత్సవాల్లో ప్రముఖ సింగర్, 'గర్బా క్వీన్' ఫల్గుణి పాఠక్ నిర్వహించే ప్రదర్శన ఇప్పుడు సంగీత ప్రియుల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో

ప్రతిష్టాత్మక జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 19 వరకు తొమ్మిది రోజుల పాటు ఈ 'నవరాత్రి ఉత్సవ్ 2026' వేడుకలు జరగనున్నాయి. అయితే ఈ షో టికెట్ల ధరలు చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.
రూ.2,200 నుంచి ప్రారంభమై రూ.2.04 లక్షల దాకా!
ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ 'బుక్‌మై షో'లో ఈ ఈవెంట్ టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండేలా టికెట్లు ఉంటాయని భావించిన శ్రోతలకు నిర్వాహకులు గట్టి షాకే ఇచ్చారు. మొదటి విడతలో 9 రోజులకు సంబంధించి ఈజీ పాస్ రూ.16,000గా నిర్ణయించగా, రెండో విడతలో రూ.18,000కు పెంచారు.
ప్రస్తుతం తొమ్మిది రోజుల సీజన్ పాస్ ధర వ్యక్తికి రూ.20,000కు చేరింది. ఇక కేవలం ఒక్క రోజు మాత్రమే వెళ్లాలనుకునే వారికి ఒక్కో టికెట్ ధర రూ.2,200 నుంచి మొదలవుతోంది. వీటితో పాటు పన్నులు అదనం. ఇవన్నీ ఒకెత్తయితే, అత్యంత విలాసవంతమైన వీఐపీ 'పాడ్ పాకేజ్' (POD Package) ధర ఏకంగా రూ.2.04 లక్షలుగా నిర్ణయించారు.
12 మందికి మాత్రమే ఒక్క రోజు ప్రవేశం
ఈ పాస్‌పై కేవలం 12 మందికి మాత్రమే ఒక్క రోజు ప్రవేశం ఉంటుంది. ఇందులో రూ.10,000 విలువైన ఆహార, పానీయాల కూపన్లు ఇస్తారు. దీంతో గర్బా పండుగను కూడా ఇంత వ్యాపారాత్మకంగా మార్చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
'మధ్యతరగతికి దూరమైన పండుగ'.. అభిమానుల ఆవేదన
{{/usCountry}}ఈ పాస్‌పై కేవలం 12 మందికి మాత్రమే ఒక్క రోజు ప్రవేశం ఉంటుంది. ఇందులో రూ.10,000 విలువైన ఆహార, పానీయాల కూపన్లు ఇస్తారు. దీంతో గర్బా పండుగను కూడా ఇంత వ్యాపారాత్మకంగా మార్చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
'మధ్యతరగతికి దూరమైన పండుగ'.. అభిమానుల ఆవేదన
{{/usCountry}}టికెట్ ధరలు ఆకాశాన్ని తాకడంతో ఫల్గుణి పాఠక్ అభిమానులు, సోషల్ మీడియా వినియోగదారులు నిర్వాహకులపై మండిపడుతున్నారు. భోరివలీ వంటి బహిరంగ మైదానాల్లో వేలాది మంది మధ్య జరిగే ఈ వేడుకను జియో కన్వెన్షన్ సెంటర్ వంటి ఖరీదైన ఏసీ హాలుకు మార్చడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు దూరమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక అసమానతలను చూపేలా ఉండకూడదు
"మేము ఏళ్ల తరబడి మీ పాటలకు డ్యాన్స్ చేయడానికి వేచి చూస్తాం ఫల్గుణి మేడమ్. కానీ జియో సెంటర్ లాంటి చోట పెట్టడం వల్ల సామాన్యులు ఈ పండుగకు దూరమవుతున్నారు. నవరాత్రి అనేది అందరినీ కలిపేదిగా ఉండాలి కానీ, ఆర్థిక అసమానతలను చూపేలా ఉండకూడదు" అని ఒక అభిమాని ఆవేదన వ్యక్తం చేశారు.
పాస్‌ల ధరలు కనీసం రూ.16,000 ఉంటే పార్కింగ్, ఫుడ్ ఖర్చులతో కలిపి ఎంత భారం అవుతుందో ఆలోచించాలని, టికెట్ ఏజెంట్లు వీటిని బ్లాక్ మార్కెట్ చేసుకునే ముప్పు ఉందని మరికొందరు కామెంట్ చేశారు.
90ల ఐకానిక్ సింగర్..
90ల కాలంలో 'చూడీ జో ఖంకీ హాథోన్ మే', 'మైనే పాయల్ హై ఛంకాయీ', 'యాద్ పియా కీ ఆనే లగీ', 'సావన్ మే' వంటి ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఫల్గుణి పాఠక్, ముంబై నవరాత్రి ఉత్సవాలకు పర్యాయపదంగా మారిపోయారు.
'ఫల్లు' చాలా కాస్ట్‌లీ!
ప్రతీ ఏటా ఆమె గర్బా పాడే వేదికలు కిటకిటలాడుతాయి. కానీ ఈసారి 'ట్రైబ్‌వైబ్ ఎంటర్‌టైన్‌మెంట్', 'అల్ఫోన్సో స్టూడియోస్' సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఈవెంట్‌లో ధరలు విపరీతంగా పెంచేయడంతో "ఫల్లు.. నువ్వు చాలా కాస్ట్‌లీ అయిపోయావ్" అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.