...
...
Next Story

Singer: గన్ ఫైట్, హీరో హెయిర్ ఫ్లిప్ సీన్- లెజెండరీ సింగర్ ఉషా క్లాసిక్ సాంగ్- భయమేసిందంటూ మధుబంతి సంచలన నిజాలు!

Singer Madhubanti Bagchi About Dhurandhar Ramba Ho Song: గతేడాది సూపర్ హిట్‌గా నిలిచిన ‘ధురంధర్’ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హెయిర్ ఫ్లిప్ సీన్, ‘రంబా హో’ సాంగ్ ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. ఉషా ఉతుప్ పాడిన ఈ లెజెండరీ సాంగ్‌ను మళ్లీ పాడటానికి తాను మొదట ఎందుకు భయపడిందో సింగర్ మధుబంతి బాగ్చీ వివరించారు.

Published on: Mar 9, 2026, 22:49:14 IST
Advertisement

గతేడాది డిసెంబర్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాల్లో ‘ధురంధర్’ (Dhurandhar) ఒకటి. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ చేసిన ‘హెయిర్-ఫ్లిప్’ సీన్ యూత్‌ను పిచ్చెక్కించింది.

తుపాకీ పట్టుకుని

గన్ ఫైట్, హీరో హెయిర్ ఫ్లిప్ సీన్- లెజెండరీ సింగర్ ఉషా క్లాసిక్ సాంగ్- భయమేసిందంటూ మధుబంతి సంచలన నిజాలు!
గన్ ఫైట్, హీరో హెయిర్ ఫ్లిప్ సీన్- లెజెండరీ సింగర్ ఉషా క్లాసిక్ సాంగ్- భయమేసిందంటూ మధుబంతి సంచలన నిజాలు!

ఒక పెళ్లి రిసెప్షన్ జరుగుతుండగా, మధ్యలో రణ్‌వీర్ సింగ్ (హంజా) తుపాకీ పట్టుకుని శత్రువులతో పోరాడే ఈ యాక్షన్ సీన్ హైలైట్‌గా నిలిచింది. సరిగ్గా ఈ గన్ ఫైట్ జరుగుతున్నప్పుడే బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ‘రంబా హో’ (Ramba Ho) సాంగ్ థియేటర్లను దద్దరిల్లేలా చేసింది.

లెజెండరీ సింగర్ ఉషా ఉతుప్ పాడిన ఈ ఐకానిక్ సాంగ్‌ను కొత్తగా రీమిక్స్ చేసి పాడారు సింగర్ మధుబంతి బాగ్చీ. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో రంబా హో రీమిక్స్ సాంగ్ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను మధుబంతి బాగ్చీ పంచుకున్నారు.

"భయంతోనే ఒప్పుకున్నాను"

సంగీత దర్శకుడు శాశ్వత్ ఈ పాట గురించి తనతో చెప్పినప్పుడు మొదట ఆశ్చర్యపోయానని మధుబంతి తెలిపారు. "మ్యూజిక్ ఆల్బమ్ లాంచ్ కావడానికి ఒక రోజు ముందు ఈ పాటను రికార్డ్ చేశాం. సినిమాలో ఎవరూ ఊహించని సమయంలో ఈ పాట వస్తుందని శాశ్వత్ చెప్పారు. ఆ సీన్ విజువల్స్ చూశాక నాకు మైండ్ బ్లాక్ అయింది. అంత పెద్ద గన్ ఫైట్ సీన్‌లో ‘రంబా హో’ రావడం చాలా కొత్తగా, కూల్‌గా అనిపించింది" అని మధుబంతి వివరించారు.

అయితే, ఉషా ఉతుప్ వంటి దిగ్గజం పాడిన పాటను మళ్లీ పాడటం అంటే పెద్ద రిస్క్ అని మధుబంతి భయపడ్డారు. "స్టాండర్డ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.. నేను సరిగ్గా పాడలేకపోతే విమర్శలు వస్తాయని భయపడ్డాను. కానీ దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రం.. ‘ఒక గన్ ఫైట్ సీన్ కు ఎంత ఇంటెన్సిటీ కావాలో అంత పవర్‌ఫుల్‌గా పాడు’ అని ధైర్యం చెప్పారు. పాత వెర్షన్ నుంచి కొత్త వెర్షన్‌లోకి పాట మారుతున్న తీరు అద్భుతంగా కుదిరింది" అని మధుబంతి బాగ్చీ సంతోషం వ్యక్తం చేశారు.

బ్లాక్‌బస్టర్ ‘ధురంధర్’

కరాచీలోని లయారీ టౌన్ నేపథ్యంలో సాగే గ్యాంగ్ వార్స్, కాందహార్ హైజాక్, పార్లమెంట్ అటాక్, 26/11 వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా ధురంధర్ సినిమాను తెరకెక్కించారు.

సిక్వెల్ కోసం సిద్ధమా?

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సిక్వెల్ ధురంధర్ 2 మార్చి 19న థియేటర్లలోకి రానుంది. జస్కీరత్ సింగ్ రంగి అనే వ్యక్తి, గూఢచారి హంజా అలీ మజారీగా ఎలా మారాడు అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ ఈ రెండో భాగం ధురంధర్ ది రివేంజ్ తిరగనుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks