...
...
Next Story

Singer: సింగర్ శ్రేయా ఘోషల్ రియల్ ఎస్టేట్ జోరు- 21 కోట్లతో మరో లగ్జరీ ప్లాట్ కొనుగోలు- 3 నెలల్లో 80 కోట్లకుపైగా ఆస్తులు!

Singer Shreya Ghoshal Real Estate Investments: ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ముంబైలో భారీ ఆస్తులను కొనుగోలు చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో జోరు చూపిస్తున్నారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే మూడు విలాసవంతమైన ఫ్లాట్స్ కొనుగోలు చేయడం, వాటి ధర రూ. 80 కోట్లకుపైగా ఉండటం విశేషంగా మారింది.

Published on: Apr 26, 2026, 15:25:18 IST
Advertisement

Singer Shreya Ghoshal Real Estate Buys 3 Flats: మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్ వరుస పెట్టి ఆస్తులు కొంటున్నారు. ముంబైలోని అత్యంత ఖరీదైన శాంతాక్రజ్ వెస్ట్ ప్రాంతంలో సింగర్ శ్రేయా ఘోషల్ రూ. 20.88 కోట్లు వెచ్చించి ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్నారు. అంటే సుమారు రూ. 21 కోట్లు అన్నమాట.

కుటుంబ సభ్యులతో కలిసి

సింగర్ శ్రేయా ఘోషల్ రియల్ ఎస్టేట్ జోరు- 21 కోట్లతో మరో లగ్జరీ ప్లాట్ కొనుగోలు- 3 నెలల్లో 80 కోట్లకుపైగా ఆస్తులు!
సింగర్ శ్రేయా ఘోషల్ రియల్ ఎస్టేట్ జోరు- 21 కోట్లతో మరో లగ్జరీ ప్లాట్ కొనుగోలు- 3 నెలల్లో 80 కోట్లకుపైగా ఆస్తులు!

రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన డాక్యుమెంట్ల ప్రకారం.. శ్రేయా ఘోషల్ తన కుటుంబ సభ్యులు శర్మిష్ఠ ఘోషల్, బిశ్వజిత్ ఘోషల్‌తో కలిసి ఈ ఆస్తిని రిజిస్టర్ చేయించారు.

మూడు నెలల్లో మూడవ కొనుగోలు

శ్రేయా ఘోషల్ పెట్టుబడులు చూస్తుంటే ఆమె రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల (ఏప్రిల్) ప్రారంభంలోనే ముంబైలోని వర్లీలో దాదాపు రూ. 60 కోట్లతో రెండు ఖరీదైన ఫ్లాట్లను శ్రేయా ఘోషల్ కొనుగోలు చేశారు. ఇప్పుడు శాంతాక్రజ్‌లో కొన్న ఈ మూడవ అపార్ట్‌మెంట్‌తో కలిపి గత మూడు నెలల్లోనే శ్రేయా ఘోషల్ సుమారు రూ. 80 కోట్లకు పైగా ఆస్తుల కోసం వెచ్చించడం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కొత్త ఇంటి ప్రత్యేకతలు ఇవే

శాంతాక్రజ్ సరోజిని రోడ్‌లోని 'వాయు' బిల్డింగ్‌లో శ్రేయా ఘోషల్ ఈ కొత్త ఫ్లాట్ ఉంది. 'ఓం డెవలపర్స్ రియాల్టీ' నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఎగువ అంతస్తులో ఈ అపార్ట్‌మెంట్‌ను ఆమె ఎంచుకున్నారు. దీని విస్తీర్ణం సుమారు 2,900 చదరపు అడుగులు (బాల్కనీతో కలిపి).

గతంలో గోద్రెజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్న 'గోద్రెజ్ ట్రైలజీ'లో శ్రేయా ఘోషల్ రెండు ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఏప్రిల్ 1న జరిగిన ఆ రిజిస్ట్రేషన్ల కోసం ఏకంగా రూ. 1.78 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించడం గమనార్హం.

కేవలం శ్రేయా ఘోషల్ మాత్రమే కాదు, ఇటీవల ప్రముఖ హీరోయిన్ టబు కూడా వెర్సోవా ప్రాంతంలో రూ. 10 కోట్లతో ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ముంబైలో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, సెలబ్రిటీలు మాత్రం విలాసవంతమైన భవనాల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

ఆ కోవలోకే శ్రేయా ఘోషల్

సాధారణంగా సెలబ్రిటీలు తమ ఆదాయాన్ని కేవలం సినిమాలు, షోలకే పరిమితం చేయకుండా ఇలా రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించడం ద్వారా భవిష్యత్తుకు భద్రతను వెతుక్కుంటారు. శ్రేయా ఘోషల్ తీసుకున్న ఈ నిర్ణయం కూడా ఆ కోవలోకే వస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks