...
...
Next Story

Naga Chaitanya Birthday: నాగ చైతన్య బర్త్ డే.. లవర్ అంటూ శోభిత ధూళిపాళ రొమాంటిక్ విషెస్..కడుపుబ్బా నవ్వించే వీడియో కూడా!

Sobhita Dhulipala Wishes To Naga Chaitanya Birthday: అక్కినేని హీరో నాగ చైతన్య నవంబర్ 23న 40వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, హీరోయిన్ శోభిత ధూళిపాళ సైప్రస్ వెకేషన్‌లోని రొమాంటిక్ ఫోటోలు, నవ్వించే వీడియోను పంచుకుంటూ ప్రేమగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Published on: Nov 23, 2026, 16:58:16 IST
Advertisement

Sobhita Dhulipala Wishes To Naga Chaitanya Birthday: అక్కినేని నాగ చైతన్య 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 23న ఆయన పుట్టినరోజు సందర్భంగా అటు అభిమానులు, ఇటు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తించారు.

రొమాంటిక్‌గా బర్త్‌డే విషెస్

నాగ చైతన్య బర్త్ డే.. లవర్ అంటూ శోభిత ధూళిపాళ రొమాంటిక్ విషెస్..కడుపుబ్బా నవ్వించే వీడియో కూడా!
నాగ చైతన్య బర్త్ డే.. లవర్ అంటూ శోభిత ధూళిపాళ రొమాంటిక్ విషెస్..కడుపుబ్బా నవ్వించే వీడియో కూడా!

అందరికంటే భిన్నంగా చైతూ సతీమణి, హీరోయిన్ శోభిత ధూళిపాళ తన భర్తకు అత్యంత రొమాంటిక్‌గా బర్త్‌డే విషెస్ చెప్పారు. తమ ప్రేమ ప్రయాణంలోని మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సైప్రస్ వెకేషన్ ఫోటోలతో శోభిత సర్‌ప్రైజ్

సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ చైతన్యతో దిగిన అందమైన ఫోటోలు, ఒక సరదా వీడియోను శోభిత పంచుకున్నారు. "హ్యాపీ బర్త్‌డే లవర్" అంటూ ఆమె రాసిన క్యాప్షన్ నెటిజన్ల మనసు దోచుకుంది. ఈ ఏడాది ఆరంభంలో ఈ జంట సైప్రస్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి 'పిక్సిడా ఫిష్ టవెర్న్' వద్ద తీసుకున్న ఫోటోలను ఆమె షేర్ చేశారు.

ఒక ఫోటోలో ఆర్చ్‌వే కింద ఇద్దరూ ఆప్యాయంగా ముద్దుపెట్టుకుంటూ కనిపించగా, మరో ఫోటోలో చైతూ తన భార్యను ప్రేమగా దగ్గరకు హత్తుకుని పోజులిచ్చారు. ఫోటోలతో పాటు శోభిత షేర్ చేసిన ఒక వీడియో అభిమానులను కడుపుబ్బా నవ్విస్తోంది.

అద్దాలతో రూపొందించిన ఒక ఆర్ట్ ఇన్‌స్టాలేషన్ వద్ద నాగచైతన్య చిన్నపిల్లాడిలా రకరకాల ముఖ కవళికలు పెడుతూ సరదాగా గడిపారు. వెనుక నుంచి శోభిత నవ్వుతూ "లోపలికి రా.. డ్యూడ్" అని అంటున్న మాటలు ఆ వీడియోలో వినిపిస్తున్నాయి. తెరపై ఎంతో హుందాగా, గంభీరంగా కనిపించే చైతూలోని ఈ చిలిపి కోణాన్ని చూసి అక్కినేని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కామెంట్ సెక్షన్‌లో తమ అభిమాన హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సందడి చేస్తున్నారు.

శోభితలో నాగ చైతన్యకు నచ్చే ఆ ఒక్క లక్షణం ఇదే!

"శోభితలో నాకు నచ్చే లక్షణాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒక్కటి చెప్పాలంటే ఆమెలోని డైనమిక్ స్వభావం గురించి మాట్లాడాలి. మన సంప్రదాయ విలువలు, ఆధునిక ఆలోచనా ధోరణి కలగలిసిన అద్భుతమైన వ్యక్తిత్వం ఆమెది. ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆమె ఆసక్తి చూపుతుంది" అని నాగ చైతన్య వివరించారు.

తమ వెకేషన్ అనుభవాన్ని ఉదాహరణగా చెబుతూ చైతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "మేము హాలిడేకు వెళ్లినప్పుడు నేను ఒక పక్కా ప్లాన్‌తో వెళ్తాను. ఒకవేళ ఆ ప్లాన్ వర్కవుట్ కాకపోతే నా బుర్ర పనిచేయడం ఆగిపోతుంది. కానీ శోభిత మాత్రం ఏమాత్రం కంగారు పడకుండా వెంటనే మరో దారి వెతికి నన్ను ముందుకు నడిపిస్తుంది. ఆమె వల్లే నేను అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, కొత్త విషయాలను ఆస్వాదించడం నేర్చుకున్నాను" అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు.

ప్రేమ వివాహం నుంచి వరుస సినిమాల వరకు..

ఇదే కార్యక్రమంలో జరిగిన ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో తన భార్యను ఒక్క మాటలో వర్ణించమని అడగగా, 'ప్రేమ' (లవ్) అని చైతూ సమాధానమిచ్చారు. రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న నాగ చైతన్య, శోభిత 2024 ఆగస్టులో నిశ్చితార్థం చేసుకుని తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

అదే ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని అక్కినేని కుటుంబ ప్రతిష్ఠాత్మక అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరూ తమ సినీ కెరీర్‌లోనూ బిజీగా కొనసాగుతున్నారు. 2025లో సాయి పల్లవితో కలిసి 'తండేల్' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన నాగచైతన్య, ప్రస్తుతం 'వృషకర్మ' సినిమాతో సిద్ధమవుతున్నారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

భారీ అంచనాల మధ్య వృషకర్మ చిత్రం డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ రిలీజ్ అయిన 'చీకటిలో' చిత్రంతో శోభిత ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె తమిళ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న 'వెట్టువమ్' చిత్రంలో నటిస్తున్నారు.

వెట్టువమ్ సినిమా 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. వృత్తిగత జీవితంలో విజయాలు సాధిస్తూనే, వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో అన్యోన్యంగా సాగుతున్న ఈ జంటకు అభిమానులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీస్సులు అందిస్తున్నారు.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks