ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జీవిత చరిత్రను(బయోపిక్) వెండితెరపైకి తీసుకురావాలనే ఆలోచన తనకు ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లతో చర్చించిన అనంతరం ఈ సినిమా ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి ప్రణాళికను అధికారికంగా వెల్లడిస్తానని ఆయన తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు.

డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తామని, తిరిగి ఆమె తదుపరి పుట్టినరోజు నాటికి చిత్రాన్ని పూర్తి చేస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ చిత్ర నిర్మాణానికి పార్టీ శ్రేణుల నుంచి నైతిక మద్దతుతో పాటు, స్థానిక మిత్రులు, శ్రేయోభిలాషుల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.
దేశ రాజకీయాల్లో గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు మరే ఇతర రాజకీయ కుటుంబానికి లేవని జగ్గారెడ్డి కొనియాడారు. గతంలో దేశానికి ఎంతోమంది ప్రధానమంత్రులుగా పనిచేసినప్పటికీ, సోనియా గాంధీ చూపిన నిస్వార్థం, ప్రజాసేవా దృక్పథం అత్యున్నతమైనవని ఆయన అన్నారు.
మూడుసార్లు ప్రధానమంత్రి అయ్యే సువర్ణావకాశం తలుపు తట్టినా, దేశ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సోనియా గాంధీ ఆ పదవిని తృణప్రాయంగా వదులుకున్నారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. నాడు మిత్రపక్షాలన్నీ ఆమెనే ప్రధానిగా ఉండాలని కోరినప్పటికీ, ఆమె అంగీకరించలేదని తెలిపారు.
సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love)పై వస్తున్న విమర్శలను జగ్గారెడ్డి తిప్పికొట్టారు. 'రూ. 1,000 ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ, ఆ విషయాన్ని తన పుస్తకంలో గొప్పగా చెప్పుకోకపోవడమే ఆమె హుందాతనానికి నిదర్శనం.' అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
సోనియా గాంధీ పుస్తకంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కంగనా రనౌత్ ఇప్పటికీ ఒక సినీ నటిలాగే వ్యవహరిస్తున్నారని, ఆమెకు రాజకీయ పరిణతి లేదని ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను, డైలాగులను చదవడం తప్ప ఆమెకు దేశ రాజకీయ చరిత్ర, నాయకుల త్యాగాల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు.
{{/usCountry}}సోనియా గాంధీ పుస్తకంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కంగనా రనౌత్ ఇప్పటికీ ఒక సినీ నటిలాగే వ్యవహరిస్తున్నారని, ఆమెకు రాజకీయ పరిణతి లేదని ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను, డైలాగులను చదవడం తప్ప ఆమెకు దేశ రాజకీయ చరిత్ర, నాయకుల త్యాగాల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు.
{{/usCountry}}ఈ దేశంలోనే పుట్టి, పెరిగి కూడా సామాన్య ప్రజల కష్టాలను అర్థం చేసుకోలేని బీజేపీ నేతలు గొప్పవారా? లేక విదేశాల నుంచి ఈ ఇంటి కోడలిగా వచ్చి, భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకుని ప్రజల కోసం పాలన సాగించిన సోనియా గాంధీ గొప్పవారా? అని బీజేపీ నాయకత్వాన్ని జగ్గారెడ్డి నిలదీశారు.