...
...
Next Story

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- మూగ తల్లి, రైతు తండ్రిని వద్దనుకునే కొడుకులు-స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా స్పర్శ. శివాజీ రాజా ప్రధాన పాత్రలో శివారెడ్డి, లావణ్య రెడ్డి తదితరులు ఇతర రూల్స్‌లో నటించిన ఈ సినిమా తల్లిదండ్రులను వద్దనుకునే కొడుకుల కథతో సాగుతుంది. మరి స్పర్శ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jan 18, 2026, 13:57:36 IST
Advertisement

స్వచ్ఛమైన తెలుగు కంటెంట్ ఇటీవల కాలంలో తరచుగా వస్తోంది. ప్రతి వారం సరికొత్త కాన్సెప్ట్‌తో తెలుగు సినిమా ఒకటి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ (జనవరి 18) ఓటీటీలోకి వచ్చేసింది తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా.

శివాజీ రాజా ప్రధాన పాత్రలో

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- మూగ తల్లి, రైతు తండ్రిని వద్దనుకునే కొడుకులు-స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- మూగ తల్లి, రైతు తండ్రిని వద్దనుకునే కొడుకులు-స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మనసుకు హత్తుకునే సీన్లతో, కన్నీళ్లు పెట్టించే భావోద్వేగాలతో సాగే ఆ సినిమా పేరే స్పర్శ. ప్రముఖ నటుడు శివాజీ రాజా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రవీణ్ రామరాజు దర్శకత్వంతోపాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు. ప్రణీత బండ్రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.

స్పర్శ నటీనటులు

స్పర్శ సినిమాలో శివారెడ్డి, లావణ్య రెడ్డి, త్రివేణి, శివ కార్తీక్, అపరాజిత యోల్మో, భూమి, అద్విత్, రాఘవేందర్ మొవ్వ, శివాజీ వడ్రేవు, శ్రుతి రాజ్, రేష్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. కొండూరి వెంకట సన్యాసి రావు కథ అందించిన ఈ సినిమాకు గణేష్ రాఘవేంద్ర సంగీతం అందించారు.

ఒకరు సిటీలో మరొకరు విలేజ్‌లో

ఇక స్పర్శ కథ విషయానికొస్తే.. ఓ గ్రామంలో అరుసు అనే రైతు ఉంటాడు. అతనికి మూగ భార్య ఉంటుంది. వారికి ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు సిటీలో, చిన్న కుమారుడు మరో గ్రామంలో ఉంటారు. కొడుకు, మనవళ్లను చూసేందుకు సిటీకి వెళ్తారు అరుసు, అతని భార్య.

నచ్చిన సిటీ లైఫ్

అక్కడ వారికి ఆ సిటీ లైఫ్ నచ్చదు. పల్లెటూరు ఎలా ఉంటుందో, గ్రామాల్లో ఉండే మనుషులు, వారి మధ్య ఉండే ఆప్యాయత, స్పర్ష ఎంత స్వచ్ఛంగా ఉంటాయో మనవళ్లకు మనవరాళ్లకు చెబుతారు. అక్కడ నచ్చక చిన్న కుమారుడి ఇంటికి వెళ్తారు అరుసు కుటుంబం. కానీ, చిన్న కొడుకు రానివ్వడు. పెద్దగా పట్టించుకోడు.

మూగ తల్లి, తండ్రి రైతు

ఇలాంటి స్పర్శ ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో స్పర్శ ఓటీటీ రిలీజ్ అయింది. ఈటీవీ విన్ ఓటీటీ వీక్లీ సిరీస్ కథా సుధాలో భాగంగా నేటి నుంచి స్పర్శ స్ట్రీమింగ్ అవనుంది. మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను చూడాలనుకునేవారికి ఓటీటీ మూవీ స్పర్శ బెస్ట్ ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks