టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైనర్‌గా యంగ్ హీరో శ్రీవిష్ణు పేరు తెచ్చుకున్నాడు. వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు మృత్యుంజయ్, విష్ణు విన్యాసం రెండు సినిమాలతో అలరించేందుకు రెడీగా ఉన్నాడు.
రెండు రోజుల ముందు

అయితే, ఇటీవల థియేట్రికల్ రిలీజ్‌కు రెండు రోజులో ముందు నిర్వహించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హీరో శ్రీవిష్ణు హాజరయ్యాడు. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
నా సొంత సినిమాల
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. "యూవీ మూవీ అంటే నా సొంత సినిమాలా భావిస్తా. నేను ఈ సంస్థలో ఒక మూవీ చేశాను. ఈ బ్యానర్‌లో అన్నీ బాగుంటాయి. మనల్ని ఎంతగానో లవ్ చేస్తారు" అని అన్నారు.
నేచురల్‌గా నటిస్తాడు
"గోల్కొండ హైస్కూల్ సినిమా నుంచే సంతోష్ యాక్టింగ్ అంటే నాకు ఇష్టం. మంచి పర్‌ఫార్మర్. నేచురల్‌గా నటిస్తాడు. సినిమాల్లో కూడా మన ఇరుగు పొరుగు అబ్బాయిలా అనిపిస్తాడు. ఈ సినిమాతో ఆయనకు సూపర్ హిట్ దక్కాలని కోరుకుంటున్నా. మంచి యాక్టర్స్‌ను తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. ఆ లవ్ మీపై కూడా చూపిస్తారు" అని శ్రీవిష్ణు ఆశించాడు.
ప్రతి సంక్రాంతికి సక్సెస్ ఇవ్వాలి
"అనిల్ (డైరెక్టర్ అనిల్ రావిపూడి) గారు ప్రతి సంక్రాంతికి సక్సెస్ ఇవ్వాలి. ఆయన ఇచ్చే సంక్రాంతి సక్సెస్‌తో డిస్ట్రిబ్యూటర్స్ తర్వాత మూడు నాలుగు నెలలు సినిమాలు బాగా కొంటున్నారు. కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ చూస్తుంటే విజువల్స్, మ్యూజిక్, మిగతా అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా" అని శ్రీవిష్ణు తెలిపాడు.
షార్ట్ ఫిలింస్‌కు వర్క్ చేశాం
మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రవీంద్రన్ మాట్లాడుతూ.. "ఇది నాకు ఫస్ట్ మూవీ. గతంలో డైరెక్టర్ అశ్విన్, నేను కలిసి షార్ట్ ఫిలింస్‌కు వర్క్ చేశాం. ఇలాంటి ఒక మంచి మూవీకి మ్యూజిక్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. యూవీ సంస్థ ఎంతో ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. మా సినిమాను థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయండి" అని కోరారు.
తెలుగు, తమిళ భాషల్లో
{{/usCountry}}మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రవీంద్రన్ మాట్లాడుతూ.. "ఇది నాకు ఫస్ట్ మూవీ. గతంలో డైరెక్టర్ అశ్విన్, నేను కలిసి షార్ట్ ఫిలింస్‌కు వర్క్ చేశాం. ఇలాంటి ఒక మంచి మూవీకి మ్యూజిక్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. యూవీ సంస్థ ఎంతో ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. మా సినిమాను థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయండి" అని కోరారు.
తెలుగు, తమిళ భాషల్లో
{{/usCountry}}ఇదిలా ఉంటే, కపుల్ ఫ్రెండ్లీ సినిమాలో హీరో హీరోయిన్లుగా సంతోష్ శోభన్, మానస వారణాసి నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా నిర్మించింది. ఆ సినిమాకు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.
పాజిటివ్ టాక్
తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళంలో థియేటర్లలో విడుదల అయింది. రిలీజ్ డే నుంచి సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది.