...
...
Next Story

OTT Postponed: ఓటీటీలో ఇవాళ రిలీజ్ కావాల్సిన తెలుగు విలేజ్ లవ్ డ్రామా వాయిదా- మెల్లకన్నుతో బాధపడే హీరో- 8.7 రేటింగ్!

OTT Telugu Release Postponed: ఓటీటీలో ఇవాళ రిలీజ్ కావాల్సిన తెలుగు విలేజ్ లవ్ ఎమోషనల్ డ్రామా సినిమా శ్రీ చిదంబరం గారు వాయిదా పడింది. మెల్లకన్నుతో హీరో బాధపడే కథగా తెరకెక్కిన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 8.7 రేటింగ్ ఉంది. మరి శ్రీ చిదంబరం గారు ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Feb 19, 2026, 14:45:02 IST
Advertisement

ఇటీవల తెలుగులో రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో లవ్ స్టోరీ సినిమాలు బాగానే వస్తున్నాయి. అందులో చాలా వరకు సినిమాలు మంచి హిట్స్ సాధిస్తున్నాయి. అదే తరహాలో రీసెంట్‌గా టాలీవుడ్‌లో తెరకెక్కిన విలేజ్ లవ్ ఎమోషనల్ డ్రామా సినిమా శ్రీ చిదంబరం గారు.

సినిమా నిర్మాతలు

ఓటీటీలో ఇవాళ రిలీజ్ కావాల్సిన తెలుగు విలేజ్ లవ్ డ్రామా వాయిదా- మెల్లకన్నుతో బాధపడే హీరో- 8.7 రేటింగ్!
ఓటీటీలో ఇవాళ రిలీజ్ కావాల్సిన తెలుగు విలేజ్ లవ్ డ్రామా వాయిదా- మెల్లకన్నుతో బాధపడే హీరో- 8.7 రేటింగ్!

అంతా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాకు వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాతలు చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. అలాగే, చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా ఉన్నారు.

శ్రీ చిదంబరం గారు నటీనటులు

శ్రీ చిదంబరం సినిమాలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట హీరో హీరోయిన్లుగా చేశారు. వీరితోపాటు గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత గార్లపాటి, అరుణ్ కుమార్, తులసి, నాయుడు మోరం, శంకర్ రావు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

యూనిక్ కాన్సెప్ట్

ఫిబ్రవరి 6న థియేటర్లలో శ్రీ చిదంబరం గారు సినిమా థియేటర్లలో విడుదల అయింది. యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉన్నట్లు ప్రశంసలు వచ్చాయి. హీరోకు మెల్లకన్ను ఉండటం, అది తన ప్రేమకు అడ్డుగా మారడం, అలాగే, తన మెల్లకన్ను పోయేలా చేసుకునేందుకు హీరో పడే ప్రయత్నాలు, దానివల్ల వచ్చే అవమానాలతో సినిమా సాగుతుంది.

హీరోయిన్ ఎంట్రీతో

ఊరి నుంచి పారిపోవాలనుకున్న హీరోకు హీరోయిన్ ఎంట్రీతో ప్రపంచం మారుతుంది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకోవడం, మెల్లకన్నుతో ఇంట్లో వచ్చే సమస్యలతో లవ్, ఎమోషనల్ రైడ్‌గా శ్రీ చిదంబరం గారు సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ వినయ్ రత్నం.

ఐఎమ్‌డీబీ రేటింగ్

కానీ, అనూహ్యంగా తాజాగా శ్రీ చిదంబరం గారు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేశారు మేకర్స్. ఇవాళ రిలీజ్ అయింటే కేవలం 13 రోజుల్లోనే శ్రీ చిదంబరం గారు ఓటీటీ ప్రీమియర్ అయిండేది. ఇవాళ రిలీజ్ కావాల్సిన శ్రీ చిదంబరం గారు ఫిబ్రవరి 26కు వాయిదా పడింది.

ఈటీవీ విన్ ఓటీటీలో

ఈ లెక్కన థియేట్రికల్ రిలీజ్ తర్వాత 20 రోజులకు శ్రీ చిదంబరం గారు ఓటీటీ స్ట్రీమింగ్ కానుందన్న మాట. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ఇవాళ (ఫిబ్రవరి 19) విడుదల కావాల్సిన శ్రీ చిదంబరం గారు ఫిబ్రవరి 26 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.

పెద్ది డైరెక్టర్ లాంటి స్టార్స్‌తో

కాన్సెప్ట్, లవ్ డ్రామా, ఎమోషన్ బాగున్న ఈ సినిమాకు స్లో నెరేషన్ మైనస్‌గా మారింది. ట్రైలర్, టీజర్ ఆకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సాన వంటి స్టార్స్ సినిమాను ప్రమోట్ చేసిన శ్రీ చిదంబరం గారు మూవీకి అంతగా బజ్ క్రియేట్ కాలేదు.

మరో ఏడు రోజుల్లో

ఫలితంగా అతి తక్కువగా 20 రోజుల సమయంలోనే శ్రీ చిదంబరం గారు ఓటీటీలోకి వచ్చేయనుంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఈటీవీ విన్‌లో శ్రీ చిదంబరం గారు సినిమాను మరో ఏడు రోజుల్లో ఎంచక్కా చూసేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe